breaking news
Birla Sun Life
-
ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీవోకు సై
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 13.5 శాతం వాటాకు సమానమైన 3.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థలు ఏబీ క్యాపిటల్ 28.51 లక్షలు, సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ 3.6 కోట్లు చొప్పున ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఆస్తుల నిర్వహణ జేవీ.. ఏబీ సన్ లైఫ్ ఏఎంసీ ఏప్రిల్‌లోనే సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,500–2,000 కోట్లు సమకూర్చుకోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. ఇప్పటికే ఏఎంసీలు.. నిప్పన్ లైఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యూటీఐ లిస్టింగ్ సాధించిన సంగతి తెలిసిందే. -
సన్‌లైఫ్‌కు బిర్లా వాటా విక్రయం
బీఎస్ఎల్ఐలో 23 శాతం వాటాకొనుగోలు చేయనున్న సన్‌లైఫ్ 49 శాతానికి పెరిగిన వాటా డీల్ విలువ రూ.1,664 కోట్లు న్యూఢిల్లీ: బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ (బీఎస్‌ఎల్‌ఐ)కంపెనీలో కెనడాకు చెందిన సన్ లైఫ్ ఎష్యూరెన్స్ కంపెనీ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో ప్రస్తుతం సన్‌లైఫ్ ఎష్యూరెన్స్కు 26 శాతం వాటా ఉన్నదని, ఈ వాటాను సన్‌లైఫ్ సంస్థ 49 శాతానికి పెంచుకోనున్నదని ఆదిత్య బిర్లా నువో (ఏబీఎన్‌ఎల్) బీఎస్ఈకి నివేదించింది. దీనికి సంబంధించి ఒక ఒప్పందం బుధవారం కుదిరిందని పేర్కొంది. ఈ 23 శాతం వాటాను ఏబీఎన్‌ఎల్ నుంచి సన్‌లైఫ్ సంస్థ రూ. 1,664 కోట్లకు కొనుగోలు చేయనున్నదని, 51 శాతం నియంత్రిత వాటా తమకుంటుందని వివరించింది. ఈ కొనుగోలుతో బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.7,235 కోట్లని వివరించింది. తమ గ్రూప్‌లో ఆర్థిక సేవల వ్యాపారం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని ఈ ఒప్పందం సందర్భంగా ఆదిత్య బిర్లా నువో, బీఎస్‌ఎల్‌ఐ చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. బీఎస్‌ఎల్‌ఐ సంస్థ జీవిత బీమా సేవలనందిస్తోంది. ఈ లావాదేవీ వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తవుతుందని అంచనా. బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతించడంతో ఆక్సా, స్టాండర్ట్ లైఫ్, నిప్పన్ వంటి విదేశీ కంపెనీలు భారత్‌లో ని బీమా జేవీలో వాటాను పెంచుకుంటున్నాయి. -
గోల్డ్ ఫండ్లా.. గోల్డ్ ఈటీఎఫ్లా?
మిడ్ క్యాప్ ఆధారిత బిర్లా సన్ లైఫ్, ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్లు న్యూ ఫండ్ ఆఫర్లు ప్రకటించాయి. ఈ రెండింటిలో దేనిలో ఇన్వెస్ట్ చేయవచ్చో తగిన సలహా ఇవ్వగలరు? - సరితా గోయల్, ఈ-మెయిల్ మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఈ రెండూ కూడా క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్. దీంతో మీరు వీటిలో ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తరచూ ఇన్వెస్ట్ చేస్తుండటం ద్వారా పొదుపు మొత్తం పెరుగుతుంది. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఈ సూత్రం మరింత కీలకం. క్రమంగా పెట్టుబడులు పెడితేనే యావరేజ్ చేసుకోగలుగుతాం. ఆ రకంగా చూస్తే.. క్రమక్రమంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం వీటిలో లేవు. కనుక ఇలాంటి ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అంటూ ఇవి ఊరించినా.. పెట్టుబడులు ఏకమొత్తంగా పెట్టకూడదని, క్రమక్రమంగానే ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి వీటిని పక్కన పెట్టొచ్చు. గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేక గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? - చంద్రవదన్, అనంతపురం గోల్డ్ ఫండ్లయినా, గోల్డ్ ఈటీఎఫ్లైనా పెట్టుబడులు బంగారంతో ముడిపడి ఉన్నవే. గోల్డ్ ఈటీఎఫ్ విషయానికొస్తే.. షేరు కొనుక్కున్నట్లే బ్రోకింగ్ ఏజెంటు నుంచి డీమ్యాట్ అకౌంటు తీసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే గోల్డ్ ఫండ్ సంగతి తీసుకుంటే.. ఇందులో బ్రోకింగ్ ఏజెన్సీ ప్రమేయం ఉండదు. మ్యూచువల్ ఫండ్ యూనిట్ల తరహాలోనే వీటిని తీసుకోవచ్చు. గోల్డ్ ఫండ్‌లో నిధులను తీసుకెళ్లి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈటీఎఫ్‌లతో పోలిస్తే గోల్డ్ ఫండ్లు సుమారు 75 బేసిస్ పాయింట్ల మేర ఖరీదైనవిగా ఉంటాయి. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం అంత సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. గత అయిదారేళ్లుగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నందున బంగారం ధర పరుగులు తీసింది. ఇటీవలి కాలంలో బంగారానికి ఆర్థికపరమైన ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా రేట్లు మరింత హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పైగా షేర్లు, ఫిక్సిడ్ ఇన్కమ్, రియల్ ఎస్టేట్ లాగా బంగారం అధిక రాబడినిచ్చే పెట్టుబడి సాధనం కాదు. సుమారు రూ. 10,000 మొత్తాన్ని 8-10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సాధనాన్ని సూచించగలరు? - భాను, వైజాగ్ మీరు తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక పూర్తి ఈక్విటీ ఫండ్ల జోలికి వెళ్లకండి. వీటిలో ఉండే రిస్కుల వల్ల పెట్టుబడి విలువ అకస్మాత్తుగా భారీగా పడిపోతే కొత్త ఇన్వెస్టర్లకు ఆందోళన కలుగుతుంది. కాబట్టి కొన్ని బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద పెట్టుబడులు పెట్టొచ్చు. ఇందుకోసం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, కెనరా రోబెకో బ్యాలెన్స్డ్ లాంటివి ఎంచుకోవచ్చు. ఫండ్స్ఇండియాడాట్కామ్ ద్వారా పెట్టుబడులు పెట్టడం సురక్షితమేనా? - కుల్దీప్, ఒంగోలు మ్యూచువల్ ఫండ్స్‌ను ఆన్లైన్లో విక్రయించే ఫండ్స్ఇండియాడాట్కామ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం సురక్షితమైనదే. డిస్ట్రిబ్యూటర్/ ఏజెంటు ద్వారా ఇన్వెస్ట్ చేయడంలాంటిదే. ఇలాంటి వెబ్సైట్ల ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన డెరైక్ట్ ప్లాన్స్‌లో పెట్టుబడులకు సాధ్యపడదు. డెరైక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలంటే సదరు ఫండ్ సంస్థ వెబ్సైట్ ద్వారానే చేయాలి. సుందరం స్మైల్, టాటా ఈక్విటీ పీఈలలో సుమారు రూ. 40,000 పెట్టుబడి పెట్టాను. ఏడాది కాలంగా ఇన్వెస్ట్ చేయడం లేదు. వీటిలో నుంచి వైదొలగడం మంచిదా లేక పెట్టుబడిని అలాగే ఉంచేయవచ్చా? - రాజేంద్ర, వరంగల్ టాటా ఈక్విటీ పీఈ నిజానికి వైవిధ్యభరితమైన మంచి ఫండ్. మీరు ఇందులో పెట్టుబడులు ఆపకుండా ఉండాల్సింది. ఇప్పటికైనా సరే..ఇందులో ఇన్వెస్ట్మెంట్లను అలాగే కొనసాగించండి. ఇక సుందరం స్మైల్ విషయానికొస్తే.. ఈ స్మాల్ క్యాఫ్ ఫండ్ పనితీరు గత కొన్నేళ్లుగా ఆశాజనకంగా లేదు. అయితే, ఇది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడ్డుకాలం యావత్తూ మీరు వేచి చూశారు. మరికొన్నాళ్లు ఓపిక పడితే మెరుగైన ఫలాలు అందుకోవచ్చు.