breaking news
Bird flu identify
-
Red Alert: బర్డ్ ఫ్లూ దెబ్బకి లక్షలాది కోళ్లు బలి
-
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ.. ఓ వ్యక్తికి పాజిటివ్!
సాక్షి, ఏలూరు: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్‌కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో, కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.మరోవైపు.. ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో 24x7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.ఇదిలా ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులను మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక, భారీగా తగ్గిన చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. దీంతో, పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
Bird Flu: కరీంనగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం..
-
బర్డ్‌ఫ్లూపై ఆందోళన అక్కర్లేదు: మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్ (మహబూబ్‌నగర్): బర్డ్‌ప్లూపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ముందస్థు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం జడ్చర్ల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో బర్డ్‌ప్లూ నిర్దారణ అయ్యిందని, అందుకోసం అక్కడి వైద్య ఆరోగ్యశాఖ- పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా నివారణ చర్యలు చేపట్టాయన్నారు. బర్డ్‌ప్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెట్టడం జరుగుతోందని, కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి తగిన జాగ్రత్తలు వివరించటం జరిగిందన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రత్యేక బృందం క్షేత్ర స్థాయిలో పరిశీస్తుందని చెప్పారు. కోళ్లఫారాలు, చికెన్లకు దగ్గరగా ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరిచటంతోపాటు జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైరస్ నివారణకు తగినన్ని టామిఫ్లూ మాత్రలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు.