టెక్ మహీంద్రా చేతికి బయో ఏజెన్సీ కంపెనీ
డీల్ విలువ 4.5 కోట్ల పౌండ్లు
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీ తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన బయో ఏజెన్సీ కంపెనీని 4.5 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. బయో ఏజెన్సీని అంతా నగదులోనే కొనుగోలు చేశామని టెక్ మహీంద్రా తెలిపింది. ఈ కంపెనీ చేరికతో తమ డిజిటల్ సర్వీసుల పోర్ట్‌ఫోలియో మరింత శక్తివంతం అవుతుందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సి. పి. గుర్నాని చెప్పారు. ఈ డీల్ వచ్చే నెల మొదటి వారంలో పూర్తవుతుందని వివరించారు. బయో ఏజెన్సీ కొనుగోలు కారణంగా అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్‌లో మరిన్ని సంస్థల నుంచి ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 2006, ఏప్రిల్‌లో ప్రారంభమైన బయో ఏజెన్సీ సంస్థ, గత ఆర్థిక సంవత్సరంలో 1.25 కోట్ల పౌండ్ల ఆదాయం ఆర్జించింది.