-
బికినీ ఫొటో అడిగాడు.. హీరోయిన్ రిప్లైకి షాక్ అయ్యాడు
Disha Patani Hilarious Reply Who Asked Her Bikini Photo: డ్యాషింగ్ డైరెక్ట్ చేసిన 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఫిట్నెస్ బ్యూటీ దిశా పటానీ. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా ఆడి పాడి తన గ్లామర్‌తో అలరించింది. తర్వాత బాలీవుడ్లో ఫుల్ బిజీగా మారింది. ఎంఎస్ ధోనీ, భాగీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు కూడా ఎదుర్కొంటోంది. కాగా దిశాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హాట్ ఫొటోస్, వర్క్ అవుట్ వీడియోస్‌తో అభిమానులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది. చదవండి: హాట్ ఫొటోషూట్స్ ఎందుకు చేయరన్న నెటిజన్.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు ! ఈ క్రమంలోనే తన ఇన్‌స్టా హ్యాండిల్లో 'ఆస్క్ మీ ఎనిథింగ్ (నన్ను ఏదైనా అడగండి)' అనే సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు నవ్వు తెప్పించేలా రిప్లై ఇచ్చింది దిశా పటానీ. ఈ సెషన్లో ఆ యూజర్ దిశాను 'బికినీ వేసుకున్న మంచి ఫొటో'ను పోస్ట్ చేయాల్సిందిగా కోరాడు. దానికి దిశా బికినీ వేసుకున్న ఒట్టర్ (పాండాలాంటి జంతువు) ఫొటోను పెట్టి వ్యంగంగా సమాధానం ఇచ్చింది. దీంతో షాక్‌కు గురవడం ఆ యూజర్ వంతైంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన పులువురు నెటిజన్స్ దిశా స్పాంటెనిటీకి ఫిదా అవుతున్నారు. ఇవే కాకుండా తనకు ఇష్టమై బీటీఎస్ సాంగ్, గ్లామర్ సీక్రెట్ వంటి తదితర ప్రశ్నలకు సమాదానాలిచ్చింది దిశా పటానీ. -
కొంచెం కష్టంగా ఉంది: షారుఖ్ కూతురు
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గారాల పట్టీ సుహానా ఖాన్(18) సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సుహానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో టూ పీస్ బికినీ ఫోటోను అప్లోడ్ చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ పిక్ హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్ కూడా ఉండటంతో ఆమెపై పలువురు ఘాటుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా సుహానా ఓ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఇంట్లో బానే ఉంది. కానీ బయటే కొంచెం కష్టంగా ఉంది. ప్రజలు ఏదైనా నిర్ణయిస్తామనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ దోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు నా ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్ నుంచి లీకయ్యాయి. చాలా మంది వాటి గురించి మాట్లాడుతున్నారు. వారికేం తెలియకున్నా.. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శించే వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ ఈ విమర్శలతో నేను బాధపడటం లేదు అని మనస్పూర్తిగా చెప్పలేకపోతున్నా. ఇది చాలా బాధను కలిగిస్తోంది. విమర్శించే వారికి నేనో పెద్ద సమస్యగా మారాను’ అని సుహాన ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: సుహానా..‘నీకసలు సిగ్గుందా?’ -
‘నీకసలు సిగ్గుందా?’
మతపరమైన అంశాల విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాసరే సెలబ్రిటీలను ఏకీపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్(18) మాత్రం ఆ విమర్శలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసి విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుహానా టూ పీస్ బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్ కూడా ఉండటంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘నువ్వొక ముస్లింవి అన్న విషయం మరిచిపోకు. సిగ్గు లేదా?.. చెండాలం.. నీ ప్రైవసీ నీది కావొచ్చు, కానీ, ఇలాంటి ఫోటోలు దేశమంతా చూస్తుందన్న విషయం మరిచిపోకు. నువ్వు సంప్రదాయాలను కూడా పాటిస్తే మంచిది... మీ తండ్రి అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ, గలీజు పనులతో పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదేం కొత్త కాకపోవటంతో సుహానా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది. గతంలో మెహరీన్ ఖాన్, సానియా మీర్జా, హీనా ఖాన్ తదితరులు ఇలా ట్రోలింగ్‌ను ఎదుర్కున్న వాళ్లే... My hotty babeis 🔥❤ A post shared by suhana khan (@suhanakha2) on Jul 4, 2018 at 5:53am PDT -
అడ్మిట్ కార్డు చూసి అవాక్కైంది..
సాక్షి, పాట్నా : సైన్స్ పరీక్ష రాసేందుకు తనకు ఇచ్చిన అడ్మిట్ కార్డును చూసిన బిహార్ విద్యార్థిని విస్తుపోయింది. బికినీ ధరించిన మహిళ ఫోటోగ్రాఫ్ ఉన్న అడ్మిన్ కార్డును చేతిలో పెట్టడంతో విద్యార్థిని అవాక్కైంది. దర్భంగా జిల్లాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఈ అడ్మిట్ కార్డును జారీ చేసింది. ఈ విషయాన్ని హోమ్‌సైన్స్ హానర్స్ విద్యార్థిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, సరైన ఫోటోతో కొత్త అడ్మిట్ కార్డు ఇవ్వాలని కోరింది. దరఖాస్తును, అడ్మిట్ కార్డును తాను సవ్యంగా పూర్తిచేసినా బికినీ ధరించిన మహిళ ఫోటోను ఆ కార్డులో ఇవ్వడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేసింది. కాగా, అభ్యర్ధి ఫోటోతో కూడిన అడ్మిట్ కార్డును సత్వరమే జారీ చేయాలని అధికారులను ఆదేశించామని ఎగ్జామినేషన్ కంట్రోలర్ చెప్పారు. అడ్మిట్ కార్డును ముద్రించిన ఏజెన్సీ నుంచి లిఖితపూర్వక వివరణను కోరినట్టు ఆయన తెలిపారు. -
బికినీ వివాదంపై నటి ఘాటు స్పందన
సాక్షి, ముంబై: నటి రాధికా ఆప్తే బికినీ ఫొటోల వివాదం ముగియక ముందే మరోనటి రుబినా దిలాయక్ బికినీ ఫొటోలపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. చీప్ గాళ్, సిగ్గులేదా అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నటి కూడా అంతే ఘాటుగా బదులిస్తూ మరో ఫొటోను షేర్ చేసి, తాను ఏ విషయానికి భయపడేది లేదని చెప్పకనే చెప్పారు. ‘శక్తి అస్థిత్వ కే ఎహ్ సాస్కి’టీవీ సీరియల్లో ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించిన రుబినా చాలా పాపులర్ అయ్యారు. తరచూ తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివాదాల్లో చిక్కుకునే ఈ బుల్లితెర నటి మరోసారి తన బికినీ ఫొటోలతో విమర్శలకు గురయ్యారు. నటి రుబినా బికినీ ధరించి హాట్ హాట్ ఫోజులివ్వగా ఆమె బాయ్‌ఫ్రెండ్ అభినవ్ శుక్లా తీసిన ఫొటోలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల పోస్ట్ చేసిన బికినీ ఫొటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సిగ్గులేదా, చీప్ గాళ్ అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు మాత్రం చాలా అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లకు బదులిస్తూ నటి రుబినా మరో ఫొటో షేర్ చేశారు. ‘నా శరీరంతో ఎంతో సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసు. ధన్యవాదాలు అంటూ’ మరో ఫొటోను షేర్ చేసి విమర్శకులకు అంతే ధీటుగా బదులిచ్చారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. నటి రుబినా దిలాయక్ ఇన్స్టాగ్రామ్ లో మొదట పోస్ట్ చేసిన ఫొటో
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
- అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
Advertisement