‘నీకసలు సిగ్గుందా?’ | SRK Daughter Suhana Trolled for Two Piece Bikini | Sakshi
Sakshi News home page

Jul 5 2018 8:30 AM | Updated on Apr 3 2019 6:34 PM

SRK Daughter Suhana Trolled for Two Piece Bikini - Sakshi

మతపరమైన అంశాల విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాసరే సెలబ్రిటీలను ఏకీపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌(18) మాత్రం ఆ విమర్శలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసి విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు. 

ప్రస్తుతం షారూఖ్‌ ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుహానా టూ పీస్‌ బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్‌ చిన్న కొడుకు అబ్‌రామ్‌ కూడా ఉండటంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘నువ్వొక ముస్లింవి అన్న విషయం మరిచిపోకు. సిగ్గు లేదా?.. చెండాలం.. నీ ప్రైవసీ నీది కావొచ్చు, కానీ, ఇలాంటి ఫోటోలు దేశమంతా చూస్తుందన్న విషయం మరిచిపోకు. నువ్వు సంప్రదాయాలను కూడా పాటిస్తే మంచిది... మీ తండ్రి అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ, గలీజు పనులతో పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇదేం కొత్త కాకపోవటంతో సుహానా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది. గతంలో మెహరీన్‌ ఖాన్‌, సానియా మీర్జా, హీనా ఖాన్‌ తదితరులు ఇలా ట్రోలింగ్‌ను ఎదుర్కున్న వాళ్లే...  

My hotty babeis 🔥❤

A post shared by suhana khan (@suhanakha2) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement