breaking news
bike sales down
-
వాహనాలు కొనేందుకు వెనుకడుగు? నవరాత్రుల్లో సేల్స్ ఇలా..
న్యూఢిల్లీ: నవరాత్రి పండుగ సీజన్లో దేశీయ వాహన రిజిస్ట్రేషన్లు వార్షిక ప్రాతిపదికన 6.5 శాతం నెమ్మదించాయి. ఈ ఏడాది అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు జరిగిన నవరాత్రుల్లో మొత్తం వాహన రిటైల్ అమ్మకాలు 11.23 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే పండుగ సమయంలో (సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2, 2025 వరకు) ఈ అమ్మకాలు 12.01 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.గతేడాది ఉన్న 'హై బేస్' ప్రభావం కారణంగానే ఈ తగ్గుదల కనిపిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ పేర్కొంది. 2025లో నవరాత్రి తొలి రోజే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపు అమల్లోకి రావడంతో డీలర్‌షిప్‌లలో కొనుగోళ్ల రద్దీ అప్పట్లో భారీగా పెరిగింది. అన్ని విభాగాల కంటే ప్యాసింజర్ వెహికల్ (పీవీ) విభాగం తీవ్రమైన పతనాన్ని చవిచూసిందని ఫాడా నివేదిక వెల్లడించింది.విభాగాల వారీగా రిజిస్ట్రేషన్లువాణిజ్య వాహనాలు (సీవీలు), ట్రాక్టర్లు మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ప్రయాణికుల వాహనాల (పీవీ) రిజిస్ట్రేషన్లు 21.9 శాతం తగ్గి 1.83 లక్షలకు పడిపోగా, టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు 2.8 శాతం తగ్గి 8.34 లక్షలకు చేరాయి. మరోవైపు త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 7.5 శాతం తగ్గి 45,735 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే కమర్షియల్ వాహనాలు (సీవీలు) 1.1 శాతం పెరిగి 35,618 యూనిట్లకు, ట్రాక్టర్లు 0.9 శాతం పెరిగి 22,690 యూనిట్లకు చేరాయి.స్వల్ప తగ్గుదల సాంకేతికమైనదే ‘‘గత ఏడాది నవరాత్రులు 11 రోజులు జరగగా, ఈసారి 10 రోజులే ఉండటం, పైగా జీఎస్టీ 2.0 రోల్-అవుట్ వంటి కారణాలతో గతంలో భారీగా పెరిగిన డిమాండ్ ఈసారి కనిపించలేదు. ఈ 6.52 శాతం స్వల్ప తగ్గుదల అనేది కేవలం సాంకేతికమైనదే’’ అని ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ స్పష్టం చేశారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగం మాత్రం సత్తా చాటిందని, ఈవీ రిటైల్ అమ్మకాలు 26.78% వృద్ధి చెంది పండుగ అమ్మకాల్లో దాదాపు 10.5 శాతానికి చేరాయని తెలిపారు.ఆటో కంపెనీల స్పందనలుతమ డెలివరీలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు సమానంగా (సుమారు 98 శాతం) ఉన్నాయని, ఉత్పత్తి సామర్థ్య పరిమితులు ఇందుకు కారణమని మారుతీ సుజుకీ కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ఓనం నుండి దసరా వరకు రిటైల్ అమ్మకాలు 30 శాతం వృద్ధి చెందాయని, దీపావళి వరకు ఇదే జోరు కొనసాగుతుందని బెనర్జీ అంచనా వేశారు. పండుగ సమయంలో డిమాండ్ బలంగా ఉందని, నవరాత్రుల్లో 50,000 పైగా వాహనాలు డెలివరీ చేశామని, ఒక్క దసరా రోజే 10,000 పైగా వాహనాలు కస్టమర్లకు చేరవేసినట్లు టాటా మోటార్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అమిత్ కామత్ వెల్లడించారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉందని హ్యుందాయ్ మోటార్స్ ఎండీ, సీఈవో తరుణ్ గార్గ్ తెలిపారు. మహాలయ పక్షాల నుండి నవరాత్రి మధ్య రిజిస్ట్రేషన్లు 30 శాతం పెరిగి దాదాపు 41,000 యూనిట్లకు చేరాయని, ధనత్రయోదశి, దీపావళి వరకు ఇదే జోరు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాకు 20 ఏళ్లే ఆయుష్షు అంటూ కామెంట్! -
వాహన కొనుగోళ్లు ఢమాల్
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ... - ద్విచక్రవాహనాలపై ఎక్కువ ప్రభావం - మిగతా వాహనాలకూ తగ్గిన డిమాండ్ అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపంలో ఉన్న ద్విచక్రవాహన షోరూంలో రెండు నెలల వ్యవధిలో దాదాపు 50 శాతం వ్యాపారం పడిపోయింది. 2015 నవంబర్‌లో 845 వాహనాలు, డిసెంబర్లో 638 వాహనాలను విక్రయించిన నిర్వాహకులు 2016 నవంబర్‌లో 509, డిసెంబర్లో 260 వాహనాలు మాత్రమే విక్రయించామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని షోరూంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. - అనంతపురం సెంట్రల్ పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని ప్రజల వద్ద నగదు లావాదేవీలు పూర్తిగా మందగించాయి. బ్యాంకులు ఇచ్చే డబ్బులు కనీస అవసరాలకే సరిపోవడం లేదు. దీంతో ప్రజలు సౌకర్యాలపై వెచ్చించే ఖర్చులను పూర్తిగా తగ్గించేశారని తెలుస్తోంది. మనిషి జీవితంలో వాహనం ఒక భాగమైంది. ప్రతి పనికీ వాహనం వినియోగించే పరిస్థితి వచ్చింది. ఆర్థిక స్థోమతను బట్టి ద్విచక్రవాహనం, కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరుకు రవాణాకు ఉపయోగించే వాహనాలు కూడా పెరిగాయి. ప్రతి ఏడాదీ వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 2008లో 1,49,670 ఉన్న ద్విచక్రవాహనాలు నేటికి 2.22,603 చేరుకున్నాయి. ఆటోలు, కార్లు, లారీలు ఇలా అన్ని వాహనాలూ 2008కి నేటికీ రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ప్రతి నెలా వందల్లో, ప్రతి ఏడాదీ వేలల్లో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మందగించిన కొనుగోళ్లు పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత వాహన కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. ఎక్కువ శాతం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వాహనాలపై ప్రభావం చూపింది. మరికొన్ని నెలల పాటు ఈ ప్రభావం ఇలాగే ఉంటుందని వాహన షోరూం నిర్వాహకులు పేర్కొంటున్నారు. నెలవారీగా ప్రధానమైన వాహన కొనుగోళ్లలో వ్యత్యాసం ఇలా... వాహనాల రకం 2015 అక్టోబర్ 2015 అక్టోబర్ 2015 నవంబర్ 2016 అక్టోబర్ 2016 నవంబర్ 2016 డిసెంబర్ మోటారు కారు 156 0 221 204 207 97 ఆటో రిక్షాలు 232 219 286 238 280 135 గూడ్స్ వాహనాలు 163 124 145 138 210 57 ద్విచక్రవాహనాలు 2712 3867 3768 2795 3652 1158 ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది వాహనాల కొనుగోళ్లు గతంతో పోలిస్తే తగ్గాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఎక్కువ ప్రభావం చూపింది. దీనివలన రిజిస్ట్రేషన్, ఇతర పన్నులు రాక ప్రభుత్వానికి ఆదాయం కూడా కొంతమేర తగ్గింది. - శ్రీధర్, ఆర్టీఓ, అనంతపురం


