breaking news
on bike
-
ద్విచక్రవాహనం ఎక్కిన పాము..
ఖమ్మం: మండలంలోని పాలేరు గ్రామంలో ఓ వ్యక్తి టీవీఎస్ మోపెడ్ పైకి పాము ఎక్కడంతో సదరు వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలేరు కిరాణా సరుకుల నిమిత్తం రాగా అతను సరుకులను కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే హ్యాండిల్పైకి పాము పాకుతూ కనిపించింది. దీంతో అతను కంగారుగా వాహనాన్ని నిలిపివేయగా అటుగా వెళ్తున్నవారు పామును చంపివేశారు. -
విద్యుత్స్తంభాన్ని ఢీకొట్టి యువకుడి మరణం
వీరవాసరం : నర్సాపురం–భీమవరం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ యువకుడు వృత్యువాత పడ్డాడు. మత్స్యపురి గ్రామానికి చెందిన నేలపాటి జానకిరాముడు (18) మోటార్ బైక్పై మత్స్యపురి నుంచి భీమవరం వైపు వస్తుండగా, మత్స్యపురి శివారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు మోటార్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని డీకొట్టింది. ఘటనలో జానకిరాముడు తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. చైన్నైలో తాపీ పనులు చేస్తూ జీవించే జానకీరాముడు మూడు రోజుల క్రితం మత్స్యపురిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సినిమాకు బయలేలుదేరిన అతను కానరాని దూరాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. యువకునికి తల్లిదండ్రులు లేరు. ఘటనాస్థలాన్ని నరసాపురం పోలీసులు పరిశీలించారు.