breaking news
Big Story
-
హైదరాబాద్‌లో ఇక్కడే తరచూ ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి పెట్టారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్టడీ ఆధారంగా 54 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్ల గణాంకాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు. – సాక్షి, సిటీబ్యూరోసిటీలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసులే. ఈ నేపథ్యంలోనే వారితో కలిసి ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. 2023–24లో సిటీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించారు. ఒకే ప్రాంతం లేదా స్టెచ్లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ (Accidents) చోటు చేసుకున్న ఏరియాలను గుర్తించారు. వీటిలో యాదృచి్ఛకంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ బ్లాక్‌స్పాట్స్‌గా నిర్ధారించారు. అనేకం ‘చావు’రస్తాలే.. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే ఉంటున్నాయి. రద్దీ వేళలు, సిగ్నల్స్ యాక్టివ్‌గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 54 బ్లాక్‌స్పాట్స్‌లో దాదాపు 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆ ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–రాచకొండ సరిహద్దుల్లో ఉన్నవి కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో 40 శాతం పాదచారులు, మరో 40 శాతం ద్విచక్ర వాహనచోదకులే ఉంటున్నారు. ఇవే ప్రధాన కారణాలు పరిమితికి మించిన వేగం (ప్రదానంగా ఐఆర్ఆర్లో..) ⇒ మద్యం తాగి వాహనాలు నడపటం ⇒ మలుపులు ఉన్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ⇒ అత్యంత సమస్యాత్మకంగా(బ్లైండ్) ఉన్న మలుపులు ⇒ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ⇒ ఇరుకైనా రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ⇒ రోడ్డు ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ⇒ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ⇒ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ⇒ నో–ఎంట్రీలోకి వాహనాలతో దూసుకుపోవడం ⇒ రోడ్ మార్కింగ్ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటం‘ఇన్నర్’లోనే అత్యధికంగా.. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో 28 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలోని కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ ఒక ఠాణా పరిధిలో ఐదు, మరోదాని పరిధిలో నాలుగు, నాలుగు పోలీసుస్టేషన్ల పరిధిలో మూడేసి, తొమ్మిదింటిలో రెండు చొప్పున యాక్సిడెంట్స్ స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్)లో విస్తరించి ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధుల్లోనే బ్లాక్‌స్పాట్స్ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.ఏ ఠాణా పరిధిలో ఎన్ని, ఎక్కడ? ⇒ బోయిన్పల్లి: 5 (డెయిరీ ఫాం ఎక్స్ రోడ్, బోయిన్పల్లి చెక్‌పోస్టు, బోయిన్పల్లి ఎక్స్ రోడ్, సీటీఓ) ⇒ లంగర్‌హౌస్: 4 (బాపూఘాట్, లక్ష్మీనగర్, మొఘల్ క నాలా, దర్గా) ⇒ గాంధీనగర్: 3 (ట్యాంక్‌బండ్‌పైన చిల్డ్రన్ పార్క్, బడేమియా కబాబ్, లేపాక్షి) ⇒ ఎస్సార్‌నగర్: 3 (ఈఎస్ఐ, ఉమేష్‌చంద్ర స్టాట్యూ, మైత్రీవనం) ⇒ అఫ్జల్‌గంజ్: 3 (అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, సీబీఎస్, చాదర్‌ఘాట్ చౌరస్తా) ⇒ బేగంపేట: 3 (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పీఎన్టీ, రసూల్‌పుర చౌరస్తా) ⇒ చాదర్‌ఘాట్: 2 (నల్లగొండ చౌరస్తా, మలక్‌పేట గంజ్) ⇒ మలక్‌పేట: 2 (మూసరాంబాగ్ చౌరస్తా, వైభవ్ బస్టాప్) ⇒ బహదూర్‌పుర: 2 (పురానాపూల్ శ్మశానవాటిక, జూపార్క్ చౌరస్తా) ⇒ తిరుమల గిరి: 2 (తిరుమలగిరి చౌరస్తా, లోతుకుంట) ⇒ బంజారాహిల్స్: 2 (కేబీఆర్ పార్క్, రోడ్ నెం.3 జంక్షన్) ⇒ చాంద్రాయణగుట్ట: 2 (బండ్లగూడ చౌరస్తా, ఒమర్ హోటల్) ⇒ గోపాలపురం: 2 (గురుద్వార, రైల్ నిలయం) ⇒ నల్లకుంట: 2 (విద్యానగర్ చౌరస్తా, తిలక్‌నగర్ చౌరస్తా) ⇒ ఉస్మానియా యూనివర్సిటీ: 2 (హబ్సిగూడ చౌరస్తా, తార్నాక చౌరస్తా) ⇒ జూబ్లీహిల్స్: 1 (జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు) ⇒ చిక్కడపల్లి: 1 (వీఎస్టీ చౌరస్తా) ⇒ గోల్కొండ: 1 (రామ్‌దేవ్‌గూడ) ⇒ కార్ఖానా: 1 (బోయిన్పల్లి మార్కెట్ యార్డ్) ⇒ లాలాగూడ: 1 (మెట్టుగూడ చౌరస్తా) ⇒ బొల్లారం: 1 (అల్వాల్ రైతుబజార్) ⇒ సైఫాబాద్: 1 (ఓల్డ్ సైఫాబాద్ ఠాణా) ⇒ బేగంబజార్: 1 (ఎంజే మార్కెట్) ⇒ చాంద్రాయణగుట్ట: 1 (కేశవగిరి టి జంక్షన్) ⇒ హుమాయున్‌నగర్: 1 (రేతిబౌలి) ⇒ కాచిగూడ: 1 (నిబోలిఅడ్డా వద్ద పాత ఠాణా) ⇒ అంబర్పేట్: 1 (త్రిశూల్ బార్) ⇒ మహంకాళి: 1 (ప్లాజా చౌరస్తా) ⇒ సుల్తాన్‌బజార్: 1 (కోఠి ఆంధ్రాబ్యాంక్) ⇒ సంతోష్‌నగర్: 1 (పిసల్‌బండ చౌరస్తా) చదవండి: హైదరాబాద్‌కు మరో వందేభారత్ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సహకారంతో.. నగరంలోని బ్లాక్‌స్పాట్స్‌పై అధ్యయనానికి ట్రాఫిక్ విభాగంలో ఇంజినీరింగ్ సెల్ పని చేస్తోంది. మృతులతో కూడిన ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. ప్రమాదాలకు కారణాలను గుర్తించి బల్దియా, జాతీయ రహదారుల సంస్థలకు సిఫార్సులు చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు కలెక్టర్ నేతృత్వంలో జరిగే రోడ్ సేఫ్టీ (Road Safety) మీటింగ్స్‌లో వీటిని ప్రతిపాదించడంతో పాటు పనుల పురోగతినీ సమీక్షిస్తున్నాం. ప్రమాదాలను నియంత్రించేందుకు షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. స్వల్ప మార్పు చేర్పులను ట్రాఫిక్ అధికారులే చేపడతారు. పెద్ద మొత్తంతో ముడిపడిన వాటి విషయంలో స్వచ్ఛంద సంస్థల సహాయం కోరుతున్నాం. ఇప్పటికే ఈ కోణంలో సర్వేజనా ఫౌండేషన్ సహాయం అందిస్తూ కొన్ని చర్యలు తీసుకుంటోంది. బ్లాక్‌స్పాట్స్‌ను నిర్మూలించడంతో పాటు నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని సూచించాల్సిందిగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను కోరాం. ప్రస్తుతం వాళ్లు నగరవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్నారు. నివేదిక అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటాం. – జోయల్ డెవిస్, హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ -
బాటిల్ నెక్.. ట్రా‘ఫికర్’కు ఏదీ చెక్..?
ప్రమాణాలకు అనుగుణంలేని రహదారులు.. ప్రయాణాలు సవ్యంగా లేక ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు.. పలుచోట్ల బాటిల్ నెక్.. అక్కడ ట్రాఫిక్ పీక్.. అధికారుల ఫ్లై‘ఓవర్ లుక్’.. రహదారుల విస్తీర్ణం తక్కువ.. వాహనాల సంఖ్య ఎక్కువ.. కరెంటు స్తంభాల రాస్తారోకో.. ట్రాఫిక్ విభాగం, జీహెచ్ఎంసీ మధ్య కొరవడిన సమన్వయం.. వెరసి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య (Traffic Problem) నిత్యకృత్యంగా మారింది. అవకాశమున్నా అవసరమైన మేర రహదారులు విస్తరించకపోవడం వాహనదారులకు శాపంగా మారిన వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది.. – సాక్షి, సిటీబ్యూరో‘పెత్తనం ఒకరి చేతిలో... బెత్తం మరొకరి చేతిలో...’రాజధానిలోని ట్రాఫిక్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. రోడ్లపై ఉండి స్థితిగతులను పర్యవేక్షించేది ట్రాఫిక్ పోలీసులైతే... వాహన శ్రేణులు సవ్యంగా సాగడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే బాధ్యత మాత్రం జీహెచ్ఎంసీది. ఈ రెండింటి మధ్య సమన్వయలేమి కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీరడం మిథ్యగా మారిపోయింది. నగరంలోని రోడ్ల విస్తీర్ణం, కనిష్టం కంటే తక్కువగా ఉన్న వైనం. పెంచే అవకాశం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం వెరసి నగరవాసికి మాత్రం నిత్యం నరకమే కనిపిస్తోంది.కనిష్ట స్థాయిలోనూ లేని రోడ్లు... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగర విస్తీర్ణంలో కనిష్టంగా 12 శాతం రహదారులు ఉండాలి. హైదరాబాద్ పురాతన నగరం కావడంతోపాటు అనేక కారణాల వల్ల ఇక్కడ కేవలం 9 శాతం రోడ్లు ఉన్నాయి. ఫలితంగా ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్‌లే. అడ్డంకులు తొలగిస్తే ఈ విస్తీర్ణాన్ని 15.5 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. కనిష్టం కంటే 3.5 శాతం ఎక్కువన్నమాట. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఏళ్లుగా పంపిస్తున్న ప్రతిపాదనల్లో సగం వాటిని కూడా జీహెచ్ఎంసీ (GHMC) సహా అనే శాఖలు అమలు చేయకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. 60 లక్షల వాహనాలు... 40 ఫ్లైఓవర్లు.. ముంబై మహానగరంలో ఉన్న వాహనాల సంఖ్య 52 లక్షలైనా అక్కడున్న ఫ్లైఓవర్ల సంఖ్య మాత్రం 55. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 60 లక్షలకు చేరుతున్నా ఫ్లైఓవర్లు 40 మాత్రమే ఉన్నాయి. మరో పురాతన నగరమైన కోల్‌కతా (Kolkata) సైతం గతంలో అస్తవ్యస్త ట్రాఫిక్‌తో ఎన్నో ఇబ్బందులు పడేది. అక్కడి రోడ్ల విస్తీర్ణం కేవలం ఆరు శాతం ఉండటమే అందుకు కారణం. ఆ తర్వాత అక్కడ ఫ్లైఓవర్లను అవసరమైన స్థాయిలో నిర్మించడం ద్వారా రోడ్ల విస్తీర్ణం 12 శాతానికి పెరిగింది. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు 2007లో సర్వే నిర్వహించి జీహెచ్ఎంసీకి నివేదిక పంపారు. దీని ప్రకారం నగరంలోని 30 ప్రాంతాల్లో 17.83 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్లు నిర్మిస్తే రోడ్ల విస్తీర్ణాన్ని పెంచవచ్చని తేల్చారు. ఈ ఫ్లైఓవర్లు జంక్షన్స్ జామ్ కాకుండా కూడా ఉపకరిస్తాయని నివేదించారు. అయితే ఇప్పటికీ వీటిలో కనీసం సగం ప్రతిపాదనలు కూడా అమలుకాలేదు. బాటిల్ నెక్.. ట్రా‘ఫికర్’కు ఏదీ చెక్.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న నేచురల్ బాటిల్ నెక్స్‌తో ఇబ్బందులు అనేకం. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన వీటి వల్లా ఎన్నో ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. రాణిగంజ్‌లోని సయిదానిమ సమాధి సమీపంలో, ఎస్సార్ నగర్–ఈఎస్ఐ, చాదర్‌ఘాట్–మలక్‌పేట్ మార్గాల్లో ఇలాంటివి అనేకం ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఇలాంటి బాటిల్‌నెక్స్ (bottlenecks) సంఖ్య 26 ఉండగా... చాలా తక్కువ మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ట్రాఫిక్ విభాగం అధికారులు, జీహెచ్ఎంసీ కలిసి పనిచేయడంతో శ్యామ్‌లాల్ నాలా సహా అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విభాగాలు సమష్టిగా ముందుకు వెళ్లాలి. నేచురల్ బాటిల్‌నెక్ సమస్యలను పరిష్కరించడం ద్వారా అదనంగా 2 శాతం రోడ్లను విస్తరించవచ్చు.సమన్వయం లేక కరెంట్ ‘షాక్’... రాజధానిలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పూర్తయినా ఫలితం లేకుండా పోయింది. ఆయా చోట్ల రోడ్ల విస్తీర్ణం పూర్తి అయినా ఒకప్పుడు రోడ్డు పక్కన ఉండి, విస్తర్ణం కారణంగా రోడ్లపైకి వచ్చిన కరెంట్ స్తంభాలతో ఈ పరిస్థితి తలెత్తింది. కొత్తగా రోడ్లు వేసిన చోట, పాత రహదారుల్లోనూ అనేక చోట్ల ఈ సమస్య ఉంది. విద్యుత్, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పని చేయకపోవడమే దీనికి కారణం. వీటితోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు అడ్డదిడ్డంగా ఉండటంతో దాదాపు 50 మార్గాలు కుంచించుకుపోయాయి. జీహెచ్ఎంసీతోపాటు ఆయా విభాగాలు స్పందిస్తే మరికొంత రోడ్డును అదనంగా విస్తరించుకోవచ్చు.‘అవసరమైనప్పుడే’ స్పందన... ఇలాంటి సమస్యలపై జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాలు ప్రజల ఇబ్బందులు తీర్చడం కంటే ‘అవసరమైనప్పుడు’మాత్రమే అప్రమత్తమై ఎక్కువగా స్పందిస్తాయి. 2012లో జరిగిన ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్, 2017లో ఇవాంక ట్రంప్ టూర్, ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలు వంటి సందర్భాల్లో మాత్రం హడావుడి చేశాయి. అతిథులకు ఇక్కడి రోడ్లకు లేని ‘అందాలను’ చూపాలని ప్రయత్నిస్తుంటాయి. చదవండి: ‘మా మేడమ్ మాకే కావాలి.. మేడమ్ మీరు వెళ్లొద్దు’డెలిగేట్స్ బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు జరిగే ప్రాంతాల మధ్య ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేసేస్తాయి. దీనికోసం బాటిల్‌నెక్స్, ఇతర అడ్డంకులను తొలగించేస్తాయి. అవసరమైతే మ్యాన్‌హోల్స్ సమాచారం సైతం సేకరించి అభివృద్ధి చేసేస్తాయి. దేశ, విదేశాల అతిథుల కోసం చూపించిన ‘ప్రేమ’ను కొనసాగిస్తూ తమకు ఈ చిక్కుల నుంచి విముక్తి ప్రసాదించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని నగరవాసులు, వాహనదారులు కోరుతున్నారు. -
కొండ వెలగాడనుంచి పదుల సంఖ్యలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు
-
కృష్ణ మరణంతో ఒంటరివాడైన మహేష్ బాబు..
-
అద్దంలా మారిన విశాఖపట్నం రోడ్లు
-
BIG STORY : రాతియుగం నాటి కులం కంపు వదులుకోని అర్భకులు
-
సినిమా 2016 : బిగ్ స్టోరి
-
బాహుబలి ప్లస్
బిగ్స్టోరీ ఫస్ట్ పార్ట్ చివరలో... కొత్తగా సెకండ్ పార్ట్ టీజర్ షాట్స్? ‘బాహుబలి’... గడచిన వారం రోజులుగా తెలుగునాట చర్చ అంతా ఈ సినిమా గురించే! సినీ ప్రియుల నుంచి సినిమాలంటే పెద్దగా ఆసక్తి చూపనివారి దాకా అందరూ ‘బాహుబలి’ గురించే మాట్లాడేలా చేయడంలో చిత్ర మార్కెటింగ్ టీమ్ వ్యూహం సక్సెసైంది. ఇటీవల ఏ సినిమాకూ రానంత హైప్ క్రియేట్ చేయడంలో మీడియా పాత్రా పెద్దదే. దానికి తగ్గట్లే సినిమా టికెట్లను అసలు ధర కన్నా చాలా ఎక్కువకు అధికారికంగానే బ్లాక్‌లో విక్రయించడమూ జరిగింది. అసలే ఎక్కువ హాళ్లలో రిలీజైన ఈ సినిమా ఈ అధికారిక బ్లాక్ రేట్ల విషయంలోనే కాక, ఫస్ట్‌డే కలెక్షన్లలోనూ మునుపటి రికార్డులను తిరగరాసింది. తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే... చిత్ర బడ్జెట్ లాగే, ఈ ఫస్ట్ డే కలెక్షన్ల గురించీ రకరకాల అంకెలు సోషల్ మీడియా మొదలు మెయిన్‌స్ట్రీమ్ మీడియా దాకా అంతటా ప్రచారమవుతున్నాయి. అంకెలగారడీ ఏమైనా, ప్రపంచమంతా కలిపి తెలుగు వెర్షన్ వరకు తొలిరోజు నికర వసూళ్ళు (ట్యాక్స్ పోగా మిగిలే షేర్) 27 కోట్ల దాకా వచ్చినట్లు సినీ వ్యాపార వర్గాల విశ్వసనీయ సమాచారం. సీడెడ్ (రాయలసీమ) ఏరియాలోనే రూ. 4 కోట్ల పైగా, నైజామ్‌లో 5 కోట్ల పైగా, ఆంధ్రాలో 9 కోట్ల పైగా షేర్ వచ్చినట్లు కథనం. అమెరికా సంగతికొస్తే, సాధారణంగా అక్కడ టికెట్ రేట్ ఆరేడు డాలర్లు, పెద్ద సినిమాల ప్రీమియర్‌కు 12 డాలర్లుంటుంది. అక్కడా ‘బాహుబలి’ ఫస్ట్‌డే టికెట్ 20 నుంచి 25 డాలర్లు పెట్టారు. ఆ దెబ్బతో ఓవర్సీస్లో ఏ తెలుగు చిత్రానికీ రాని కలెక్షన్స్ ‘బాహుబలి’కి దక్కాయి. భయపడ్డట్లే... నెట్లో పైరసీ హల్చల్ టికెట్ రేట్ల దెబ్బతో పైరసీని ఆశ్రయించేవారూ పెరిగారు. తెలుగు, తమిళ స్ట్రెయిట్ వెర్షన్స్‌తో పాటు హిందీ, మలయాళ డబ్బింగ్‌లు కూడా శుక్రవారం రిలీజైన ‘బాహుబలి... ది బిగినింగ్’ పైరసీ ఇప్పటికే ఇంట ర్నెట్లో హల్చల్ చేస్తోంది. దురదృష్టవశాత్తూ, చిత్రం హిందీ వెర్షన్ పైరసీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ అందుబాటులోకొచ్చింది. పైరసీ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని యూనిట్, సినీ పరిశ్రమ ప్రకటించినా పైరసీ జరుగుతుండడం గమనార్హం. జనం టాక్ ఏమిటంటే... ఫస్ట్ డే కలెక్షన్స్, పైరసీ గడబిడ మాట ఇలా ఉంటే, ఆడియన్స టాక్ది మరో కథ. ప్రతి సినిమా లానే ‘ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా... ఇండియా సినిమా’గా ప్రచారమైన ‘బాహుబలి’ గురించీ పరస్పర భిన్నమైన టాక్ వినపడుతోంది. ‘ఇలాంటి అద్భుతమైన సినిమా ఇప్పటిదాకా చూడలేదు’ అని ఒకటి, ‘ఆశించినంత గొప్పగా లేదు’ అని మరొకటి - ఇలా రెండు పరస్పర భిన్నస్పందనలు వినిపిస్తున్నాయి. ఈ టాక్‌కు కారణం - మిగిలిన అంశాలతో పాటు, ‘బాహుబలి’ ఫస్ట్‌పార్‌ట అర్ధం తరంగా ముగిసినట్లు ఉండడమని కొందరి అభిప్రాయం. మామూలుగా రాజమౌళి తన చిత్రాల చివర్లో వాటి ‘మేకింగ్’ దృశ్యాల్ని చూపెడతారు. ‘బాహుబలి’కీ అలా చేసుంటే బాగుండేదని కూడా కొందరంటున్నారు. రిలీజైన రెండోరోజే... కొత్త దృశ్యాల చేర్పు! ఈ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకునో ఏమో.. చిత్ర దర్శక, నిర్మాతలు ‘బాహుబలి’ సెకండ్ పార్టలోని కొన్ని దృశ్యాలను (టీజర్ షాట్స్) ఈ ఫస్ట్‌పార్‌ట చివర్లో క్రెడిట్స్ తర్వాత శనివారం నుంచి కలిపారు. ఫస్ట్‌పార్‌ట రిలీజైన రెండోరోజు సాయంత్రానికే ‘క్యూబ్’ ప్రింట్లలో వీటిని చేర్చారు. ఆ మేరకు చిత్ర ప్రచార ప్రతినిధి ట్వీట్ చేశారు. పి.ఎక్స్.డి, యు.ఎఫ్.ఒ లాంటి ఇతర డిజిటల్ ప్రింట్లలో ఆదివారం ఈ కలపడం పూర్తి కావచ్చు. కాగా, కొత్త దృశ్యాల్ని కలపడానికి కారణమేమిటో చిత్రయూనిట్ ప్రకటించలేదు. సమాచారానికై యత్నించినా, అందుబాటులోకి రాలేదు. క్రేజ్ తేవడానికీ, చూసినవారిని మళ్ళీ హాళ్ళకు రప్పించడానికీ ఇది ఓ స్ట్రేటజీ అనే వాదన కూడా వినిపిస్తోంది. మళ్లీ సెన్సార్ అయిందా? ఒక సినిమాలో కొత్త దృశ్యాల్ని అదనంగా కలిపినా, పాతవాటిని తీసేసినా ఆ ప్రభావమున్న రీలు వరకైనా సెన్సార్బోర్డకు చూపి, మును పిచ్చిన పాత సెన్సార్ సర్టిఫికెట్‌ను టెక్నికల్‌గా మళ్ళీ ‘ర్యాటిఫై’ (ఖాయం చేయడం, ధ్రువపరచడం) చేయించుకోవాల్సి ఉంటుంది. దీన్ని సెన్సార్ పరిభాషలో ‘ర్యాటిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫి కెట్’ (లేదా ‘ఎండార్సమెంట్’) అని అంటారు. అయితే, ‘బాహుబలి’ ఫస్ట్పార్టకి ఇప్పటివరకు అదేమీ జరగలేదని సమాచారం. ‘‘ఇంతవరకూ నాకు తెలిసి మా దగ్గరకు ఆ అదనపు చేర్పుతో ఎవరూ రాలేదు. పాత సర్టిఫికెట్‌కు మళ్ళీ ఆమోద ముద్ర వేయించుకోలేదు’’ అని హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డ ఆఫీసర్‌గా బాధ్యతలు చూస్తున్న టి.వి.కె. రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. చట్టబద్ధమైన ఈ అంశాలెలా ఉన్నా, ఏ కొత్త దృశ్యాలైనా ఈ ‘బాహుబలి’ మేనియోలో సినీప్రియులకు ఆనందం కలిగిస్తాయనడంలో డౌటేముంది! -
16వ సాధారణ ఎన్నికలు
-
BIG STORY - టెక్నాలజీకో దండం
-
పెట్రోల్ బంకుల నయా వంచన
-
విభజన జరిగితే తెలంగాణలో చీకట్లు?
-
పోలీస్ రాజ్
-
టైఅప్ ప్యాకప్
-
బిగ్ స్టోరి
-
ఫేస్ టర్నింగ్
-
అసత్య చంద్రుడు
-
తమ భవిష్యత్తు పై ఆందోళనలో సెటిలర్లు
-
కొత్త రాష్ట్రాల ఏర్పాట్లు, నదీ జలాల సమస్య పై బిగ్ స్టోరీ