breaking news
Bhuvneshwari Kumari
-
'భువనేశ్వరి లేకుంటే నాకు జీవితమే లేదు'
హైదరాబాద్: టీమిండియా తరపున మళ్లీ ఆడాలనుందని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తెలిపాడు. తన భార్య, కుమార్తె స్టాండ్స్ లో కూర్చుని తన ఆట చూస్తూ కేరింతలు కొడుతున్నట్టు ఊహించుకుంటున్నానని చెప్పాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడడంతో మళ్లీ బరిలోకి దిగుతానని అతడు ప్రకటించాడు. తన భార్య సహకారంతోనే సమస్యల నుంచి బయటపడ్డానని శ్రీశాంత్ వెల్లడించాడు. తన భార్య భువనేశ్వరి కుమారితో కలిసి ఓ ఆంగ్ల దినపత్రికకు శ్రీశాంత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొదట పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ భువనేశ్వరితో ప్రేమలో పడిన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నానని తెలిపాడు. తమది 1942 తరహా ప్రేమకథ అని చమత్కరించాడు. భువనేశ్వరి లేకుండా తన జీవితం ఊహించుకోలేకపోతున్నానని చెప్పాడు. ప్రపంచమంతా వ్యతిరేకించినా తనను పెళ్లాడిందని గుర్తు చేసుకున్నాడు. రాజస్థాన్ రాజకుటుంబం నుంచి వచ్చినా ఆమెలో గర్వం ఇసుమంతైనా లేదన్నాడు. ఆమె లేకుంటే జైల్లో తాను జీవించివుండే వాడిని కాదని అన్నాడు. తాను జైల్లో ఉన్నప్పుడు తన భార్య రోజూ కిచెన్ లో పడుకునేదన్న విషయం తెలిసి ఆమెపై గౌరవం మరింత పెరిగిందన్నాడు. తనకు క్రికెట్ గురించి అస్సలు తెలియదని చెప్పాడు. తన భర్త జైల్లో ఉన్నప్పుడు చూడటానికి వెళ్లలేదని భువనేశ్వరి వెల్లడించారు. తనను చూసేందుకు జైలుకు రావొద్దని శ్రీశాంత్ చెప్పాడని, అందుకే వెళ్లలేదన్నారు. శ్రీశాంత్ ఎటువంటి తప్పు చేయడన్న తన నమ్మకం కోర్టు తీర్పుతో రుజువైందన్నారు. శ్రీశాంత్ చాలా మంచివాడని, అతడిలో ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహిణిగా తన భర్త, కుమార్తె బాగోగులు చూసుకోవడమే తన కర్తవ్యమని చెప్పారు. -
కష్టకాలంలో భువనేశ్వరీ తోడుగా నిలిచింది: శ్రీశాంత్
ముంబై: కష్టకాలంలో నా భార్య భువనేశ్వరీ కుమారి తోడుగా నిలిచిందని క్రికెటర్ శ్రీశాంత్ అన్నారు. నా జీవితంలో పెళ్లి అనేక మార్పులు తెచ్చింది అని శ్రీశాంత్ తెలిపారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ జీవితకాలపు వేటు గురైన శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం డాన్స్ లపైనే దృష్టి కేంద్రికరించానని.. ఐపీఎల్7చ్ లు చూడటం లేదు అని అన్నారు. కోరియోగ్రాఫర్ స్నేహతో కలిసి ఝలక్ దిక్ లాజా అనే రియాల్టీ షో కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. మ్యూజిక్, డాన్స్ లంటే చాలా ఇష్టమన్నారు. స్కూల్ కెళ్లేటప్పుడు డాన్స్ నేర్చుకున్నానని.. ఎప్పడూ పోటీలలో పాల్గొనలేదని శ్రీశాంత్ అన్నారు.