breaking news
Bhanushree Mehra
-
ఆ హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్
-
'వరుడు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
అందం ఉంటే సరిపోదు, అభినయం కూడా ఉండాలి. అంతేకాదు, ఈ రెండింటితోపాటు ఆవగింజంత లక్ కూడా ఉండాలి. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనడానికి ఇక్కడ చెప్పుకునే హీరోయినే ప్రత్యక్ష ఉదాహరణ. వరుడు సినిమా వచ్చి 11 ఏళ్లు దాటిపోయింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. మరి హీరోయిన్గా నటించిన భాను శ్రీ మెహ్రా? సైడ్ క్యారెక్టర్లు చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఆమె ఎలా ఉంది? వరుడు తర్వాత ఆమె ఏయే సినిమాలు చేసింది? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. పంజాబ్‌కు చెందిన భానుశ్రీ మెహ్రా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ముంబైలో అడుగు పెట్టి, తనకున్న ఆసక్తితో మోడలింగ్‌లోకి ప్రవేశించింది. అలా కొన్ని కమర్షియల్ యాడ్లలోనూ తళుక్కున మెరిసింది. ఈమెను చూసిన దర్శకుడు గుణశేఖర్ 'వరుడు' సినిమాలో భానుశ్రీకి అవకాశం ఇచ్చాడు. మొదటి సినిమాలోనే అల్లు అర్జున్‌తో నటించే ఛాన్స్ కొట్టేసినందుకు పలువురు తారలు కుళ్లుకున్నారు కూడా! పైగా సినిమా పోస్టర్లు రిలీజ్ చేసినప్పుడు, ప్రమోషన్ల సమయంలోనూ ఎక్కడా భానుశ్రీని చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో సినిమాలో బన్నీ వేలు పట్టుకుని నడిచిన వధువు ఎవరా? అని ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబర్చారు. కానీ సినిమా రిలీజయ్యాక పరిస్థితి తలకిందులైంది. భానుని ఎవరూ పెద్దగా గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. వరుడు సినిమాలో ఆమె కొంత భాగం వరకే కనిపించడం గాక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె కెరీర్‌కు కోలుకోలేని దెబ్బ పడింది. తొలి సినిమాతోనే భారీ అపజయాన్ని మూటగట్టుకోవడంతో అప్పటివరకు ఆకాశాన్నంటిన ఆశలు నేలకూలాయి. మొదటి సినిమాలో హీరోయిన్గా నటించిన భానుశ్రీ రెండో సినిమాకే సైడ్ క్యారెక్టర్ చేసే దుస్థితి తలెత్తింది. తర్వాత చిల్కూరి బాలాజీ, ప్రేమతో చెప్పనా, మహారాజ శ్రీ గాలిగాడు, లింగడు-రామలింగడు, అంతా నీ మాయలోనే వంటి పలు సినిమాల్లో నటించింది.. కానీ దురదృష్టం కొద్దీ అవేవీ రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో కన్నడం, పంజాబీ, తమిళ చిత్రాల్లోనూ లక్ పరీక్షించుకుంది కానీ అవేవీ తనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. తెలుగులో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి', 'సింబా' చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె గతేడాది వచ్చిన కీర్తి సురేశ్ 'మిస్ ఇండియా' చిత్రంలోనూ కనిపించి పర్వాలేదనిపించింది. సినిమా ఆఫర్లు తగ్గిపోవడంతో యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్న ఆమెకు అక్కడ కూడా మొండిచేయే ఎదురైంది. తను చేస్తున్న యూట్యూబ్ వీడియోలకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. 2018లో ప్రియుడు కరణ్‌ను పెళ్లాడిన ఈ భామ ఇప్పటికీ మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. ఇండస్ట్రీలో సక్సెస్ లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేదానికి భానుశ్రీనే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటెన్ చేస్తున్న భానుశ్రీ ఫొటోలు చూసేయండి.. చదవండి: శవం ముందు నటి డ్యాన్స్, అవాక్కైన నెటిజన్లు -
లవ్.. రొమాన్స్.. కామెడీ...
రాహుల్ రవీంద్రన్, ‘వెన్నెల’ కిశోర్, షాని సాల్మన్, భానుశ్రీ మెహ్రా, ఖుషి, హెభా పటేల్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం-‘అలా ఎలా?’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అశోకా క్రియేషన్స్ పతాకంపై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘లవ్.. రొమాన్స్.. కామెడీ.. ఈ మూడు అంశాల నేపథ్యంలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కేరళ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన పాటలు వినడానికి, చూడ్డానికి బావుంటాయి. ఈ నెల మూడోవారంలో పాటలను, వచ్చే నెల తొలి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్.