‘భగవంతుడు’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
హీరో తిరువీర్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’. ఈ సినిమాకు జి.జి. విహారి దర్శకుడు. కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై రవి కుమార్ పనస, విద్యా శ్రీ పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.అయితే ఈ రోజు(సోమవారం) ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'ఓ యెల్లమ్మ' పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఎస్. కృష్ణ ప్రసాద్ డివైన్ ట్యూన్ తో కంపోజ్ చేయగా అడ్డుల జంగిరెడ్డి పాడారు. (ఇదీ చదవండి: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో క్రేజీ సాంగ్)