breaking news
Bhagavanth reddy
-
విషాదం: మార్కెట్ కమిటీ ఛైర్మన్ భగవంత్ రెడ్డి ఆత్మహత్య
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంతంపల్లి గ్రామంలో అప్పులకు తాళలేక మార్కెట్ కమిటీ ఛైర్మన్ భగవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం.. భగవంత్ రెడ్డి భిక్కనూర్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో అప్పులు ఎక్కువగా కావడంతో ఆయన వేదనకు లోనయ్యారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, అంతంపల్లిలో విషాదం నెలకొంది. -
పేదల అభ్యున్నతితోనే నిజమైన స్వాతంత్య్రం
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతు రెడ్డి మహబూబ్‌నగర్ అర్బన్ : పేదలు అన్ని రంగాల్లో అభివద్ధి చెందితేనే స్వాతంత్య్రానికి సార్థకత చేకూరుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక న్యూటౌన్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొన్నారు. గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం జాతీయజెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా భగవంతురెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహానీయుల ఆశయ సాధనకు కషి చేద్దామన్నారు. పేదల అభ్యున్నతికి పాలక వర్గాలు నిజాయితీగా పనిచేయాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ పథకం పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. అన్ని రంగాలకు ఆర్థిక వనరులు కల్పించి మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారన్నారు.ప్రస్తుతం రాజకీయాలు కలుషితమయ్యాయని, స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు నైతిక విలువలను మంట గలుపుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకోవడానికి కార్యకర్తలు పునరంకితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మహ్మద్ హైదర్అలీ, మిట్టమీది నాగరాజు, జెట్టి రాజశేఖర్, ఇందిర, నిరంజన్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మహ్మద్‌వాజిద్, మరియమ్మ, ఎం.డి.హుస్సేన్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్, నాయకులు బాబుమియా, అఫ్సర్, జహంగీర్, రహెమాన్, విజయకుమార్‌యాదవ్, మహమూద్, నాసిర్,ప్రవీణ్, ఖాజానసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.