breaking news
Bhadragiri
-
కంచుకోట పదిలమేనా..?
సాక్షి, భద్రాచలం: భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా టీఆర్ఎస్, ప్రజాకూటమి (కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్) పోటీ నెలకొనగా, కొన్ని చోట్ల బీజేపీ కూడా రంగంలో ఉండటంతో త్రిముఖ పోటీ ఉంది. భద్రాచలంలో మాత్రం పంచ ముఖ పోటీ నెలకొంది. సీపీఎం, టీఆర్ఎస్, కూటమి, బీజేపీ, బీఏస్పీ బరిలో ఉన్నాయి. భద్రాచలం సీపీఎంకు సిట్టింగ్ స్థానం. దశాబ్దాల కాలంగా ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది. మళ్లీ తన స్థానాన్ని దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కాగా బీజేపీ, బీఎస్పీల నుంచి కూడా బలమైన అభ్యర్థులే పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మిగతా చోట్ల మేమే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలు మాత్రం, సీపీఎంకు కంచుకోటలా ఉన్న భద్రాచలం విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. భద్రగిరిలో వారిదే ఆధిపత్యం .. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, తమ కంచుకోటగా భావించే భద్రాచలంలో మాత్రం సీపీఎంనే ఆధిపత్యం కనబరుస్తుంది. 1955 నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరుగగా సీపీఎం 8 సార్లు గెలుపొందింది. ముర్ల ఎర్రయ్య రెడ్డి రెండు సార్లు, కుంజా బొజ్జి మూడు సార్లు, తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మూడుసార్లు విజయం సాధించారు. 1976 నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో ప్రతి సారీ సీపీఎంనే విజయం సాధిస్తూ వస్తుండగా 2009లో మాత్రం ఆ పరంపరకు గండి పడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చరిస్మాతో అప్పడు జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అయినప్పటికీ సీపీఎం అభ్యర్థిగా నిలిచిన సున్నం రాజయ్య గట్టిపోటీనే ఇచ్చారు. తిరిగి 2014లో మళ్లీ సున్నం రాజయ్య గెలుపుతో భద్రాద్రిని సీపీఎం కైవసం చేసుకుంది. కానీ ఈ సారి జరుగుతున్న ఎన్నికలు సీపీఎంకు సవాల్‌గా మారాయి. సీపీఎం ఓటు బ్యాంకు మండలాలు ఏపీలోకి.. తాజాగా జరుగుతున్న ఎన్నికల సీపీఎంకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తరువాత కూడా సీపీఎం గెలుచుకున్న ఏకైక స్థానం భద్రాచలం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భద్రాచలం ప్రజలు సీపీఎంకే ఎక్కువ సార్లు పట్టం కట్టారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించటం లేదు. సీపీఎం కంచుకోటకు బీటలు వారే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నియోజకవర్గం మూడు ముక్కలు కావటం పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. సీపీఎంకు ఓటు బ్యాంకు ఉన్న మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావటంతో ఈ సారి గెలుపు అంత ఈజీ కాదనే పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒక్క దుమ్ముగూడెం మండలం మినహా నియోజకవర్గంలోని మిగతా నాలుగు మండలాల్లో ప్రధాన పార్టీలకు పోటీ ఇస్తుందా అనేది అనుమానమే. గతంలో ఉన్న కేడర్ పార్టీకి దూరం కావటంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రచారంలో మిగిలి ఉన్న నాయకులు తీవ్రంగానే కసరత్తు చేయాల్సివస్తోంది. రాజయ్య లేకపోవడంతో.. భద్రాచలంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సున్నం రాజయ్య ఈ సారి ఇక్కడ ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపారు. రాజయ్యకే టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ ముందుకొచ్చినప్పటికీ, తన స్వగ్రామం ఏపీలో విలీనమైన ప్రాంతంలో ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించేందుకు ఆయన ఆసక్తి కనబరచలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా దుమ్ముగూడెం వాసి అయిన మిడియం బాబూరావును బరిలో దింపారు. రాజమండ్రిలో డాక్టర్‌గా స్థిరపడిన ఈయనను ఆ పార్టీ 2004లో భద్రాచలం ఎంపీగా బరిలో దింపింది. అప్పుడాయన విజయం సాధించారు. ఈ సారి అసెంబ్లీ బరిలో దింపింది. తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య ఇక్కడ నుంచి వెళ్లిపోతుండటంతో ఆ పార్టీకి కొంత నష్టమేనని పరిశీలకుల అభిప్రాయం. 2009లో కాంగ్రెస్ నుంచి సీపీఎంపై గెలిచి, 2014లో ఓడిన(మూడోస్థానం) సత్యవతి ఈ సారి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. 2009లో పీఆర్పీ నుంచి బరిలో నిలిచిన గుండు శరత్ ఈసారి బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ 2009కు ముందు సుదీర్ఘకాలంలో సీపీఎంలో పనిచేసినవారే. ఈ క్రమంలో సీపీఎం ఓట్లకు గండి పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో భద్రాచలం సీటు జారితే ఇక్కడ తమ ఉనికికే ప్రమాదమని భావిస్తున్న ఆ పార్టీ నేతలు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో కూడా ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కంచుకోటలో మళ్లీ సీపీఎం పాగా వేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. -
పవర్... ప్లస్ కామెడీ!
మోహన్‌కృష్ణ, జాహిదా సామ్ జంటగా జనార్ధన్ బోదాసు దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్, జె.యన్.ఆర్. నిర్మిస్తున్న ‘భద్రగిరి’ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ సాయిబాబా గుడిలో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘టైటిల్‌కు తగ్గట్టు పవర్‌పుల్ కథతో రూపొందుతోన్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో హీరో క్యారెక్టర్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘జబర్దస్త్’ టీమ్ చేసే కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. రఘుబాబు, రవివర్మ, సుమంత్శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమేశ్ నాయుడు.