breaking news
bethupalli pond
-
అందరూ సేఫ్
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువు వరదలో మత్స్యకారులు చిక్కుకోవడం, వారిని రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవ బోల్తా పడడంతో గల్లంతైన ఘటన సుఖాంతమైంది. 12 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా, గురువారం ఉదయం 7:30 గంటలకు అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. బేతుపల్లి చెరువు వరదలో బుధవారం మధ్యాహ్నం ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకున్నారనే సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు.కలెక్టర్ దివాకర, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్ పర్యవేక్షణలో సాయంత్రం 6:40 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలుత వెళ్లి ముగ్గురు మత్స్యకారులను తీసుకొచ్చారు. ఆ తర్వాత మిగిలిన వారి కోసం రెండు బోట్లలో ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక శాఖ సిబ్బంది పది మంది, ఓ మత్స్యకారుడితో రెండు బోట్లలో బయలుదేరారు. అయితే, వరద ఉధృతి పెరగడంతో బోట్లు బోల్తా పడగా, సిబ్బంది కకావికలమయ్యారు. ఆపై విజయవాడకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఖమ్మంలో ఉండడంతో రంగంలోకి దింపారు.సహాయక చర్యలుమంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహాయక చర్యలపై ఆరా తీయగా, కలెక్టర్ దివాకర, ఎస్పీ రోహిత్‌రాజ్ పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్లలో వెళ్లి రాత్రి 11:15 గంటలకు మత్స్యకారులందరినీ ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, దారి చూపించడానికి వెళ్లిన స్థానిక మత్స్యకారుడిని రక్షించేందుకు ఫోన్ ట్రాకింగ్ చేయగా బేతుపల్లి ప్రత్యామ్నాయ మార్గంలో సిగ్నళ్లను గుర్తించారు.నలుగురు ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది తమ్మిలేరు వాగు మధ్యలో చిక్కుకున్నట్టు తేలగానే స్థానిక పోలీసులు, మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాకర్లపల్లి వైపు నుంచి బేతుపల్లి లాకుల వైపు ట్రాక్టర్ల మీద వెళ్లి అర్ధరాత్రి దాటాక వారిని, తెల్లవారుజామున 2:45 గంటలకు మరో నలుగురు సిబ్బంది రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇక ఉదయం 5 గంటల సమయాన ఐదుగురు సిబ్బంది, మత్స్యకారుడిని బయటకు తీసుకురాగలిగారు. మరో ఉద్యోగి మిగిలిపోవడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. చివరకు ఆ ఉద్యోగి ఓ చెట్టును పట్టుకొని ఉన్నట్టు తేలడంతో ఉదయం 7.15 గంటలకు బయటకు తీసుకురాగా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కాగా, వరదలో గల్లంతైన సిబ్బంది చెట్ల ఆధారంగా గంటల తరబడి ఉండడం, సిగ్నళ్ల ఆధారంగా గుర్తించి రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు వారి కుటుంబాలు అక్కడే వేచి ఉన్నాయి. ఉద్యోగులంతా రావడంతో ఆలింగనం చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు.సీఎం, సీఎస్ ట్వీట్లు, మంత్రుల అభినందనలురెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగానే ఉదయం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బేతుపల్లి చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌లో పాలు పంచుకున్న కలెక్టర్, ఎస్పీలతోపాటు ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అభినందించారు. అధికారులు సమన్వయంతో పనిచేయటం వల్లే ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. కాగా, కలెక్టర్ దివాకర, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌ను, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సిబ్బంది ప్రదర్శించిన ధైర్య సాహసాలు, అంకితభావం ప్రశంసనీయమన్నారు. సీఎస్ సంజయ్ జాజు కూడా ట్వీట్లో అధికారులు, ఉద్యోగులను అభినందించారు. -
చెరువులో పడి వ్యక్తి దుర్మరణం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతున్ని దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన పశువుల కాపరి రాఘవులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (సత్తుపల్లి)


