-
షేన్‌వార్న్‌కు ఆసీస్ బోర్డు సముచిత గౌరవం
దివంగత క్రికెటర్ షేన్‌వార్న్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. ఇకపై ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డును షేన్‌వార్న్ పేరిట ఇవ్వనుంది. ఇకపై ఈ అవార్డు ‘షేన్ వార్న్ బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా వ్యవహరిస్తారు. గత మార్చిలో షేన్ వార్న్ మృతి చెందిన తర్వాత అతని సొంత మైదానం మెల్బోర్న్ గ్రౌండ్లో మొదటి టెస్టు జరుగుతున్న సందర్భంగా సోమవారం ఈ విషయాన్ని ఆసీస్ బోర్డు ప్రకటించింది. లెగ్‌స్పిన్ దిగ్గజం వార్న్ 145 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు. -
‘ఉత్తమ టెస్టు క్రికెటర్’ వార్నర్
క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డులు సిడ్నీ: ఆస్ట్రేలియా ‘అత్యుత్తమ టెస్టు క్రికెటర్’ (అలెన్ బోర్డర్ మెడల్) అవార్డును ఓపెనర్ డేవిడ్ వార్నర్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ టెస్టుల్లో, వన్డేల్లో ఉత్తమ ఆటను ప్రదర్శించిన వార్నర్... ఓటింగ్‌లో కెప్టెన్ స్మిత్, మిచెల్ స్టార్క్‌లను వెనక్కినెట్టాడు. వార్నర్‌కు 30 ఓట్లు రాగా, స్మిత్ (24), స్టార్క్ (18)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మ్యాక్స్‌వెల్‌కు ‘ఉత్తమ వన్డే ఆటగాడు’; ఆడమ్ వోజెస్కు ‘ఉత్తమ దేశవాళీ ఆటగాడు’ అవార్డులు లభించాయి. -
స్మిత్ డబుల్ ధమాకా
► ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎంపిక ► ఉత్తమ టెస్టు ఆటగాడి పురస్కారం కూడా తనదే ► వన్డేల్లో ఉత్తమ క్రికెటర్ డివిలియర్స్ ► భారత ఆటగాళ్లకు దక్కని అవార్డులు దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హవా కొనసాగించాడు. ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్ (సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) అవార్డును గెలుచుకున్నాడు. అలాగే ‘ఉత్తమ టెస్టు క్రికెటర్’ పురస్కారం కూడా అతనికే దక్కింది. ఈ అవార్డుల్లో భారత్ క్రికెటర్లలెవ్వరికీ చోటు దక్కలేదు. అవార్డుల ఎంపిక కోసం ఐసీసీ 18 సెప్టెంబర్ 2014 నుంచి 13 సెప్టెంబర్ 2015 వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది. ఈ కాల వ్యవధిలో స్మిత్ 13 టెస్టుల్లో 82.57 సగటుతో 1734 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. 26 వన్డేల్లో నాలుగు శతకాలతో 1249 పరుగులు సాధించాడు. అలాగే ఆసీస్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నెలారంభంలో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసిన టెస్టు, వన్డే జట్లలోనూ స్మిత్ చోటు దక్కించుకున్నాడు. దిగ్గజాల మధ్య చోటు దక్కడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా స్మిత్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి పురస్కారాలు ప్రత్యేకతను కల్పించినా... జట్టు గెలవడమే తనకు అత్యంత ప్రోత్సాహంగా ఉంటుందన్నాడు. వన్డేల్లో ‘ఉత్తమ క్రికెటర్’ అవార్డును దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వరుసగా రెండో ఏడాది కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు 2010లో కూడా ఏబీకి ఈ అవార్డు దక్కింది. ఓటింగ్ కాలంలో డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌లో 1265 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 128.4గా ఉంది. ఈ ఏడాది ఉత్తమ టి20 క్రికెటర్ పురస్కారం డు ప్లెసిస్‌కు లభించింది. 2015 జనవరి 11న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డు ప్లెసిస్ 56 బంతుల్లోనే 119 పరుగులు చేయడం అవార్డును తెచ్చిపెట్టింది. ఇంగ్లండ్ అంపైర్ కెటిల్‌బొరో వరుసగా మూడో ఏడాది ఉత్తమ అంపైర్ అవార్డు గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మక సోబర్స్ ట్రోఫీని సాధించిన 11వ ఆటగాడు స్మిత్. ఆసీస్ తరఫున నాలుగో క్రికెటర్. 2004లో అవార్డును ప్రవేశపెట్టినప్పట్నించి రికీ పాంటింగ్ (2006, 07), మిచెల్ జాన్సన్ (2009, 14), మైకేల్ క్లార్క్ (2013), ద్రవిడ్ (2004), ఫ్లింటాఫ్, కలిస్ (2005), చందర్‌పాల్ (2008), సచిన్ (2010), ట్రాట్ (2011), సంగక్కర (2012)లకు ఈ అవార్డు లభించింది. ఒకే ఏడాది రెండు అవార్డులు సాధించిన ఏడో క్రికెటర్ స్మిత్. ద్రవిడ్ (2004), కలిస్ (2005), పాంటింగ్ (2006), సంగక్కర (2012), క్లార్క్ (2013), జాన్సన్ (2014)లు ఒకే ఏడాది రెండు పురస్కారాలను సాధించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement