ప్రియాంకకు స్టేట్ బెస్ట్ వలంటీర్ అవార్డు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ బీఎస్సీ చదువుతున్న కేఎస్ శ్రీవల్లీ ప్రియాంక ఎన్ఎస్ఎస్ స్టేట్ బెస్ట్ వలంటీర్ అవార్డుకు ఎంపికైందని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి సోమవారం తెలిపారు. దీనికి సంబంధించి స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.రామచంద్రరావు నుంచి సమాచారం అందిందన్నారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి బెస్ట్ వలంటీర్‌గా ప్రియాంక ఎంపికైందన్నారు. బాస్కెట్‌బాల్‌లో జాతీయస్థాయిలో ప్రథమబహుమతిని పొందిందని, పలు సేవా కార్యక్రమాల్లో సేవలు అందించిందని తెలిపారు. ఈ సందర్బంగా ప్రియాంకను కళాశాల ప్రిన్సిపాల్ కేసీ సాగర్, సి.ఫణికుమార్, ఎన్ఎస్ఎస్ పొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు అభినందించారు.