breaking news
beguluru
-
బెగులూర్‌ను సందర్శించిన అడిషనల్ హెల్త్ డైరెక్టర్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బెగులూర్‌ను అడిషినల్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మలేరియా, ఫైలేరియా వైద్యులు ప్రభావతి గురువారం సందర్శించారు. జ్వరాలతో మృతి చెందిన lవారి గురించి ఆరా తీశారు. పారిశుధ్యలోపంతోనే జ్వరాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర కన్సల్టెంట్ సంజీవరెడ్డి, సైదులు, క్లస్టర్ ఎస్పీహెచ్వో సమియెుద్దీన్, ఎస్వీవో నాగిరెడ్డి, హెచ్‌ఈవో రమేశ్, మలేరియా, హెల్త్సూపర్వైజర్లు లార్వాలను నిర్మూలించడంలో పాల్గొన్నారు. -
బెగుళూరులో ప్రత్యేక వైద్య బృందం
కాళేశ్వరం: విషజ్వరాలు విజృంభిస్తున్న మహదేవపూర్ మండలం బెగుళూరులో మలేరియా ప్రబలేందుకు కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు సూచించేందుకు వరంగల్ మలేరియా ఎంటమాలిజికల్ బందం శనివారం పర్యటించింది. విషజ్వరాల వ్యాప్తికి కారణమవుతున్న దోమల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపారు. మలేరియా నివారణ బందం గ్రామంలో ఏసీఎం అల్ఫాసైఫామైత్రిమ్, ప్రతి ఇంట్లో దోమల నివారణ రసాయనాలు స్ప్రే చేస్తోంది. దోమల లార్వాల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మండలంలో విషజ్వరాల బారిన పడి ఇప్పటికే 17మంది మత్యువాత పడ్డారు. అందులో ఒక్క బెగులూరులోనే తొమ్మిది మంది మతిచెందడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. పర్యటనలో డీఎం డాక్టర్ రవీందర్, క్లస్టర్ ఎస్పీహెచ్వో సమియోద్దీన్, వైద్యులు అశ్విని, దీపక్, ఎస్వీవో నాగిరెడ్డి, కంట్రోల్ ల్యాబ్ ఇన్సెక్టు కలెక్టర్ సుకుమార్, జోనల్ మలేరియా హెచ్‌ఈవో అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.