breaking news
BCCI coporate Trophy
-
కార్పొరేట్ ట్రోఫీ విజేత కాగ్
ఫైనల్లో కెంప్లాస్ట్ చిత్తు ముంబై: మీడియం పేసర్ల అండతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జట్టు బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో ఈ జట్టు డిఫెండింగ్ చాంపియన్ కెంప్లాస్ట్ జట్టును 32 పరుగుల తేడాతో ఓడించింది. వాంఖడే మైదానంలోని బౌన్సీ వికెట్‌పై ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కాగ్ 46.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రమీజ్ ఖాన్ (80 బంతుల్లో 41; 3 ఫోర్లు), అవీ బరోత్ (41 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించారు. సందీప్ శర్మ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెంప్లాస్ట్ 46.3 ఓవర్లలో 178 పరుగులు చేసి ఓడింది. ఇంతియాజ్ అహ్మద్ (5/21)తో పాటు రితురాజ్ సింగ్ (3/32) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. హేమంత్ కుమార్ (85 బంతుల్లో 49; 3 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. చివరి 10 ఓవర్లలో 54 పరుగులు చేయాల్సినదశలో ఇంతియాజ్ రెండు వికెట్లు తీసి కాగ్‌ను గెలిపించాడు. విజేత కాగ్ జట్టుకు రూ.కోటి, రన్నరప్ కెంప్లాస్ట్కు రూ.50 లక్షలు దక్కాయి. -
ఫైనల్లో కెంప్లాస్ట్, కాగ్
బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీ ముంబై: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీ ఫైనల్లో కెంప్లాస్ట్, కాగ్ (సీఏజీ) జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. గురువారం ముంబైలో జరిగిన తొలి సెమీఫైనల్లో కాగ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఇండియా సిమెంట్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా సిమెంట్స్ 40.1 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. బద్రీనాథ్ (51) అర్ధసెంచరీ చేశాడు. ఇంతియాజ్ అహ్మద్ 4, రమీజ్ ఖాన్ 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కాగ్ 32.1 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసి నెగ్గింది. అంకిత్ లాంబా (59), బ్రావిష్ శెట్టి (39) రాణించారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో సెమీస్‌లో కెంప్లాస్ట్ 2 వికెట్ల తేడాతో బీపీసీఎల్‌ను ఓడించింది. ముందుగా బీపీసీఎల్ 49.3 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ నాయర్ (57), మనీష్ పాండే (52), ఇండూల్కర్ (42), యాదవ్ (38)లు రాణించారు. సుతేశ్, పరమేశ్వరన్, పీయూష్ చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత కెంప్లాస్ 49.2 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఎన్స్టైన్ (74), హేమంత్ (60), అశ్విన్ (44), సతీష్ (27) మెరుగ్గా ఆడారు. నెట్రవాల్కర్ రెండు వికెట్లు తీశాడు.