breaking news
BC rights
-
56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌తో ‘56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.మూడు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలిప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీలకు కేటాయించాలని సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. వడ్డెర, కుమ్మరి, నాయీబ్రాహ్మణ వంటి ఇప్పటివరకు తగిన ప్రాతినిధ్యం పొందని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.రెండు దశాబ్దాల్లో తగ్గిన ప్రాతినిధ్యంటి.చిరంజీవులు మాట్లాడుతూ.. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉండగా, 2014లో నలుగురికి, 2018లో ముగ్గురికి, ప్రస్తుతం ఇద్దరికి తగ్గారని గణాంకాలతో వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీసీల మంత్రివర్గ ప్రాతినిధ్యం మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు పరిపాలనలో మైనారిటీగా మారడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు.సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. మెజారిటీగా ఉన్న బీసీలు రాజకీయ అధికారంలో మాత్రం మైనారిటీ స్థాయిలో ఉండటం బాధాకరమన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని, జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని కోరారు.‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’బీసీలకు కేవలం ఓటు హక్కు కాకుండా జనాభా ప్రాతిపదికన అధికారంలోనూ వాటా కావాలని బాలగోని బాలరాజుగౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.అలాగే, తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీలను విభజించి వారి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కటకం నరసింహారావు బీసీ హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం నిర్మించాలని కోరారు. గుజ్జ సత్యం రానున్న కాలం బీసీలదేనన్నారు.తదుపరి వట్టే జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవుల్లో కనీసం ఒకటి యాదవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విఠల్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్నారు.బీసీలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలిజనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ బీసీలకు అధికారంలో తగిన వాటా దక్కడం లేదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’ అనే పరిస్థితి మారాలని, బీసీలు ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది.జనగణనలో ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించడం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గణాంకాలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం, బీసీ కులాలు, సంఘాలు, మేధావులు ఐక్యంగా ముందుకు సాగడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.అడ్వొకేట్ రాజు మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీలు సాధించిన విజయం వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. పొన్నం దేవరాజు మాట్లాడుతూ బీసీ అడ్వొకేట్లు తమ హక్కులు, రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, సూర్యనారాయణ, రిటైర్డ్ డీఆర్వో ఇలి వెంకన్న, దుర్గయ్యగౌడ్, మెట్టు సూర్యప్రకాశ్, బైరి శేఖర్, కర్ణాటి మనోహర్, చిన్నారాములు, ముదిరాజ్, చెన్న శ్రీకాంత్, బొంగు ప్రసాద్, నీరజ గౌడ్, లింగేశ్, చోళ రాజేశ్వర్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని సమావేశం స్పష్టం చేసింది. -
బీసీల హక్కులకు భంగం కలిగితే పోరాటాలే
కేంద్రం ఒప్పుకోదని తెలిసీ కేసీఆర్ నాటకాలు: రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు రిజర్వేషన్ల పేరుతో కేసీఆర్ చేస్తున్న రాజకీయం వల్ల బీసీల హక్కులకు భంగం కలిగితే వీధి పోరాటాలకు దిగుతామని టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చ రించారు. శనివారం అసెంబ్లీలో జరిగిన టీటీడీఎల్పీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రేవంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలకు మేలు చేయాలనుకుంటే ముస్లిం మైనారిటీలకు 12 శాతంతోపాటు బీసీలకు 52 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని, కోర్టులు అనుమతించవనే విషయం తెలిసిన కేసీఆర్.. ముస్లింలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. బీసీ–ఇ గ్రూపులోని రిజర్వే షన్లు మాత్రమే పెంచుతామని చెబుతున్న కేసీఆర్‌కు బీసీల్లోని ఏ, బీ, సీ, డీ గ్రూపు ల్లోని కులాల వారు మనుషుల్లా కనిపించడంలేదా అని కృష్ణయ్య ప్రశ్నించారు. -
బీసీల హక్కులకోసం పోరాటం
రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ షాబాద్: సమాజంలో బీసీల హక్కుల కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు నయీంతో సంబంధాలు లేవని కేసు ఉపసంహరించుకోవడంతో ఆదివారం షాబాద్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అన్ని రంగాల్లో ఆదుకోవాలని కోరారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.20 వేల కోట్ల బడ్జెను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేయడంతో బీసీల్లో సంతోషం వ్యక్తం అవుతుందని ప్రజలు రుణపడి ఉంటారని చేప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం ప్రచార కార్యదర్శి వెంకటస్వామి, బీసీ సేన మండల అధ్యక్షుడు రాజు, నాయకులు మల్లేష్, నారాయణ, రమేష్, నవీన్, రాములు, జంగయ్య తదితరులు ఉన్నారు. -
'పావురాల ఘటన కలిచివేసింది'
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పావురాల ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే తాము వారి తరుపున పోరాటానికి దిగుతామని చెప్పారు


