breaking news
Bathula Laxma Reddy
-
MLA Bathula Lakshma Reddy: రైతుల కోసం రెండు కోట్లు
-
యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే భారీ వితరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నదే. అయితే తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Batthula Laxma Reddy), ఆయన కుటుంబసభ్యులు భారీ విరాళం అందించారు. ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్‌ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ (Revanth Reddy)ను లక్ష్మారెడ్డి కలిసి రూ.2కోట్ల చెక్ అందజేశారు. తాను అందించిన వితరణతో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని సీఎంను ఆయన కోరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను సీఎం రేవంత్ అభినందించారు.