breaking news
bassist
-
గురువు దారిలోనే శిష్యురాలు.. భర్తకు విడాకులు
దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. ఇతడి భార్య సైరా భాను.. తన లాయర్ల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రెహమాన్ దగ్గర పనిచేస్తున్న శిష్యురాలు కూడా భర్తకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన సైరా భాను.. భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు.. పెద్ద అంతరాన్ని సృష్టించాయని ఆమె లాయర్ వందనా షా పేర్కొన్నారు. రెహమాన్- సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకు ఉన్నాడు.ఇకపోతే రెహమాన్ దగ్గర బాసిస్ట్గా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలో ఏఆర్ రెహమాన్, అతడి సహాయకురాలు విడాకులు (వేర్వేరుగా) తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రెండు విడాకుల అంశాలకు ఏమైనా సంబంధముందా అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
వేదికపై కుప్పకూలి ప్రాణాలు వదిలింది
గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన అమెరికాకు చెందిన ప్రముఖ సంగీతకారిణి(బాసిస్ట్) జేన్ లిటిల్ కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం సంగీత ప్రదర్శన ఇస్తుండగా వేదికపై కుప్పకూలిపోయారు. తర్వాత ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 87 ఏళ్లు. ఒకే ఆర్కెస్ట్రా తరపున ఎక్కువ కాలం కొనసాగినందుకు ఆమె గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. బాస్ గిటార్ విద్యాంసురాలైన ఆమె 16 ఏళ్ల ప్రాయంలో 1945లో అట్లాంటా సింఫనీ ఆర్కెస్ట్రా(ఏఎస్ఓ)లో చేరారు. హైస్కూల్ లో రెండేళ్ల పాటు బాస్ గిటార్ నేర్చుకుని ఏఎస్ఓలో సభ్యురాలయ్యారు. అప్పటి నుంచి 71 ఏళ్లుగా అదే ఆర్కెస్ట్రాలో కొనసాగారు. నలుగురు సంగీత దర్శకులు సారథ్యంలో ఆమె పనిచేశారు. జేన్ లిటిల్ మరణం పట్ల ఏఎస్ఓ ప్రగాఢ సంతాపం తెలిపింది. తనకు ఇష్టమైన వాయిద్యంతో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తూనే జేన్ కన్నుమూయడం ఆమె చేసుకున్న పుణ్యమని పేర్కొంది. ఏఎస్ఓలో సీనియర్ సభ్యురాలైన జేన్ మరణం తమకు తీరని లోటని వెల్లడించింది.