breaking news
baskets
-
కేన్ క్రాఫ్ట్! ఆకట్టుకునే ఆకృతులు.. పర్యావరణ స్నేహితులు!
సాక్షి, సిటీబ్యూరో: నడిరోడ్డుపైన కొలువుదీరిన ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. కాదేదీ సృజనకు అనర్హం అన్నట్టు వెదురు, కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తులు అందానికీ, వైవిధ్యానికి పట్టం గడుతున్నాయి. ఖరీదైన మాల్స్‌లో మాత్రమే కాదు కచ్చా రోడ్లపై కూడా షాపింగ్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా వెదురు, కేన్‌తో తయారు చేసిన బుట్టలు, బ్యాగ్‌లు, ఇతర ఉత్పత్తులు నగరవాసుల మది దోచుకుంటున్నాయి. తయారీ నైపుణ్యంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.రూ.200 నుంచి రూ.25 వేల వరకూ..ఒకొక్కటీ సుమారుగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకూ ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఎన్ని మార్కెట్లు ఉన్నా మా వినియోగదారులు మాకున్నారంటున్నారు. చేసే పనిలో నైపుణ్యం ఉండాలే గాని ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, ఫైబర్, వంటివి ఎన్ని మోడల్స్ వచి్చనా సంప్రదాయ కళలకు ప్రజాదరణ ఉంటుందని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.ఇదే జీవనాధారం.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వచి్చన ఓ కుటుంబం సంప్రదాయ హస్తకళనే జీవనాధారంగా చేసుకుంది. రామానాయుడు స్టూడియో నుంచి కిందికి వెళ్లే రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఈ ఉత్పత్తులు మన ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లో విద్యుత్తులైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు, లాంతరు లైట్లు, తయారుచేస్తున్నారు. లాంతరు లైట్లు, మూత ఉన్న బుట్టలు, గంపలు, పెద్దపెద్ద హాల్స్‌లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువులను అక్కడికక్కడే తయారుచేసి అందిస్తున్నారు. వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.పర్యావరణ హితం కోసం.. వెదురుతో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేస్తున్నాం. మా కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తున్న కళ ఇది. మాకు ఇదే జీవనాధారం. వివిధ ఆకృతుల్లో అందంగా, ఆకట్టుకునే వస్తువులను తీర్చిదిద్దుతున్నాం. వస్తువు తయారీకి ఉపయోగించిన ముడిసరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తాం. పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కూలి గిట్టుబాటు అయితే చాలనుకుంటాం. ఫలితంగా అందరికీ అందుబాటైన ధరలోనే వస్తువులు లభిస్తాయి. రోజు పదుల సంఖ్యలో వస్తువులు అమ్మకాలు జరుగుతున్నాయి. – రమేష్, తయారీదారుడు, జూబ్లిహిల్స్ -
టోకు ధరలకు ఇంధన సెగ!
డిసెంబర్లో 3.39 శాతం న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం డిసెంబర్ టోకు ధరల బాస్కెట్‌పై పడింది. 2016 డిసెంబర్లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 డిసెంబర్‌తో పోల్చితే 2016 డిసెంబర్లో టోకు ధరల బాస్కెట్ ధర 3.39 శాతం పెరిగిందన్నమాట. కాగా నవంబర్‌లో ఈ రేటు 3.15 శాతం. గత ఏడాది ఇదే కాలంలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా – 1.06 క్షీణతలో ఉంది. మూడు భాగాలు వేర్వేరుగా... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్‌ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో రేటు 4.58 శాతం నుంచి 0.27 శాతానికి తగ్గింది. ఇక ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 7.89 శాతం నుంచి –0.70 శాతం క్షీణతకు చేరింది. (నవంబర్‌లో ఈ రేటు 1.54 శాతం) పలు నిత్యావసర ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 7.84% నుంచి 0.62%కి తగ్గింది. ఫ్యుయల్, పవర్: ఈ విభాగంలో –9.15 శాతం క్షీణత నుంచి 8.65 శాతం పెరుగుదల నమోదయ్యింది. డీజిల్ ధరలు 20.25 శాతం పెరిగితే, పెట్రోల్ ధరలు 8.52 శాతం పెరిగాయి. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం పైగా వాటాఉన్న ఈ రంగం కూడా –1.49 శాతం క్షీణ బాట నుంచి 3.67 శాతం పెరుగుదలకు మళ్లింది. నిత్యావసరాలు హోల్‌సేల్‌గా... ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరల తీరును ప్రత్యేకంగా చూస్తే... కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా వార్షికంగా 2015 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, – 33.11 శాతం తగ్గాయి. ఒక్క ఉల్లిపాయలు చూస్తే, ధర –37.20 శాతం తగ్గింది. చక్కెర ధర భారీగా 28.04 శాతం పెరిగింది. ఆలూ ధర 26.42 శాతం ఎగసింది. పప్పుధాన్యాల ధరలు 18.12 శాతం ఎగశాయి. గుడ్లు, మాసం, చేపల ధరలు 2.73 శాతం పెరిగాయి.