breaking news
basava raju saraiah
-
నువ్వా.. నేనా
అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ తూర్పు ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 8, టీడీపీ - 3, స్వతంత్రులు -2 ప్రస్తుత ఎమ్మెల్యే: బస్వరాజు సారయ్య(కాంగ్రెస్) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం ఎక్కువ. మైనార్టీలు, బీసీలు, ఎస్సీల ఓట్లు అధికం ప్రస్తుతం బరిలో నిలిచింది: 15 ప్రధాన అభ్యర్థులు వీరే.. బస్వరాజు సారయ్య (కాంగ్రెస్) కొండా సురేఖ (టీఆర్ఎస్) రావు పద్మరెడ్డి (బీజేపీ) మెట్టు శ్రీనివాస్ (సీపీఎం) మాజీ మంత్రుల మధ్య బిగ్ ఫైట్ ఇప్పుడు అందరి దృష్టి వరంగల్ తూర్పు స్థానం మీదే ఉంది. హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య నాలుగోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. రాజకీయ జన్మనిచ్చిన పరకాలను, పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన మరో మాజీ మంత్రి కొండా సురేఖ, సారయ్య విజయాన్ని అడ్డుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ, సీపీఎం అభ్యర్ధులు రావు పద్మ, మెట్టు శ్రీనివాస్ ఏమేరకు ఓట్లు చీలుస్తారన్నదాని మీదే గెలుపోటములు ఆధారపడిఉన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సారయ్యకు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. అభివృద్ధి సానుకూల అంశం. సారయ్య మంత్రి అయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం కారణంగా నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, కొందరు అనుచరులు టీఆర్ఎస్లో చేరడం ప్రతికూల అంశాలు. పట్టు కోసం సురేఖ కొండా సురేఖ కొత్త నియోజకవర్గమైనా పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సారయ్య వ్యతిరేకులను కలుపుకుని పోతున్నారు. టికెట్ రాక నిరాశకు గురయిన గులాబీ నేతలను బుజ్జగిస్తున్నారు. ప్రచారం హోరుగా సాగుతున్నప్పటికీ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే. స్థానికేతరులు కావడం, నియోజకవర్గంపై పట్టులేకపోవడం ఆమెకు ప్రతికూలాంశం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్లో చేరడం కూడా చర్చనీయాంశం అయింది. మోడీ జపంతో రావు పద్మ టీడీపీ, బీజేపీ పొత్తుల భాగంగా రావు పద్మ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఈమె హన్మకొండకు చెందిన వారు కావడం ప్రతికూలాంశం. టీడీపీ ఓట్లు బీజేపీకి మారుతాయా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ కోసం బీజేపీ చేసిన యత్నం, మోడీ మంత్రమే ఆయుధంగా సాగుతున్నారు. అభివృద్ధి మెట్టు సీపీఎం అభ్యర్ధి మెట్టు శ్రీనివాస్ ప్రజా సమస్యలు, నగరాభివృద్ధి, సంక్షేమంపై కేంద్రీకరించి ప్రచారం చేస్తున్నారు. గుడిసెవాసుల్లో, కార్మికపేటల్లో సీపీఎంకు గట్టి ఓటు బ్యాంకున్నది.వివిధ సమస్యలపై పోరాడినా వాటిని ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. సమైక్యవాదం ఈ పార్టీకి కొంత ఇబ్బందిగా మారనున్నది. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం నగరంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తా అండర్‌డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తా - బస్వరాజు సారయ్య టెక్స్టైల్ పార్కు ఏర్పాటు పూర్తి చేయిస్తా స్పిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు కృషి ఐటీ రంగాభివృద్ధికి ప్రయత్నం చేస్తా వరంగల్ నగరాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తా - కొండా సురేఖ అపెరల్ పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తా వరంగల్‌లో అండర్గ్ర {yైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస బీడీ కార్మికుల సంక్షేమంపై దృష్టి ఉర్సు ప్రసూతి ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా - రావు పద్మ నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా మురికివాడలులేని నగరంగా తీర్చిదిద్దుతా అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తా అసంఘటిత కార్మికుల ఉపాధి కల్పన విద్య, వైద్య వసతులపై కేంద్రీకరిస్తా - మెట్టు శ్రీనివాస్ -
బీసీల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ ద్వారా గతంలో రూ.30 వేలు మాత్రమే సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుతం లక్ష రూపాయలకు పెంచామన్నారు. బీసీ కులాల్లో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిలో ప్రతి నియోజకవర్గంలో 2వేల మందికి బ్యాంకు లింకేజీ కింద రుణాల కోసం బడ్జెట్ విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2013-14లో 6 లక్షల మంది బీసీలకు ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. మండలాల్లో ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లో కమిషనర్లు కన్వీనర్లుగా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. జీవో నెం.101 ప్రకారం ఈ నెల 21వ తేదీ నాటికి రుణాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేశామని, అయితే గడువు పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 40 వసతి గృహాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 38 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న బీసీ సంక్షేమ, సహాయ సంక్షేమాధికారులు, హెచ్‌డబ్ల్యూఓలు, ఇతర మినిస్టీరియల్ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తెలిపారు. మంత్రికి బీసీ నేతల స్వాగతం.. మంత్రి బసవరాజు సారయ్య కర్నూలుకు వచ్చిన నేపథ్యంలో పలు బీసీ సంఘాల నాయకులు స్థానిక ప్రభుత్వ అతిథిగృహం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాంబాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ, బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ టి.శేషఫణి, బీసీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగస్వామి, పాలెగార్ సత్యనారాయణరాజు, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కె.జోషి తదితరులు స్వాగతం పలికారు.