దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష
దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.షెల్ కంపెనీల నెట్వర్క్ ద్వారా 150 మిలియన్ దిర్హామ్‌లను లాండరింగ్ చేయడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు పాల్పడినందుకు బల్వీందర్ సింగ్ సాహ్ని శిక్ష.. జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారవేత్త నుంచి 5,00,000 AED (రూ. 1.14 కోట్లు) తో పాటు 150 మిలియన్ AED (రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.'అబు సబా' గా ప్రసిద్ధి చెందిన బల్వీందర్ సింగ్ సాహ్ని.. రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) ఫౌండర్. ఈ కంపెనీ యూఏఈలో మాత్రమే కాకుండా.. అమెరికా, ఇండియాతో సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. విలాసవంతమైన జీవితం గడిపే సాహ్ని.. ఎమిరేట్స్‌లో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లలో ఒకటైన 'డీ5' కోసం సుమారు రూ. 75 కోట్ల ఖర్చు చేశారు.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలుకార్ల ధరల కంటే కూడా.. ఆ కార్ల కోసం కొనుగోలు చేసిన నెంబర్స్ ధరలే ఎక్కువని సాహ్ని.. ఓ సందర్భాల్లో చెప్పారు. ఈయన వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.