breaking news
Bail extended
-
బైపాస్ సర్జరీ నేపథ్యంలో రెండు నెలలు పొడిగించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంపై నమోదైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు కింది కోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్ ఆంజనేయులు తరఫున న్యాయవాది నగేష్‌రెడ్డి వాదనలు వినిపించారు.అనారోగ్య కారణాలతో పిటిషనర్‌కు కింది కోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు. ఈ గడువు గురువారంతో ముగుస్తుందని చెప్పారు.ఈ నెల 25న పీఎస్సార్ ఆంజనేయులుకు బైపాస్ సర్జరీ జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పీఎస్సార్ ఆంజనేయులుకు 2 నెలల పాటు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు.మధుసూదన్‌కు వైద్య పరీక్షలు చేయించి నివేదికివ్వండిఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న క్యామ్‌సైన్ సంస్థ డైరెక్టర్ పమిడికాల్వ మధుసూదన్ బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని మధుసూదన్ చెబుతున్న నేపథ్యంలో గాల్‌బ్లాడర్, కిడ్నీ వ్యాధుల వైద్యులతో ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించి, నివేదికను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. -
Teesta Setalvad: తీస్తా బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: 2002 గోధ్రా అనంతర అల్లర్ల కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాద్ బెయిల్‌ను జూలై 19 దాకా సుప్రీంకోర్టు పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, ఎ.ఎస్.»ొపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణం వెలువరించింది. పిటిషనర్ మహిళ గనుక గుజరాత్ హైకోర్టే బెయిల్ రూపంలో ఆమెకు ఎంతో కొంత రక్షణ కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. సీతల్వాద్‌కు జూలై 1న సుప్రీంకోర్టు వారం పాటు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. -
వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో లింకు కేసులో మధ్యంతర బె యిల్‌పై ఉన్న విప్లవ కవి వరవరరావు(82)కు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. నవంబర్ 18వ తేదీ వరకు తలోజా జైలు అధికారులకు ఆయన లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వరవరరావు వేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే నెలకు వా యిదా వేసింది. అనారోగ్య కారణాలతో తలోజా జైలులో ఉన్న వరవరరావుకు బాంబే హైకో ర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది. బెయిల్‌ను పొడిగించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌పై ఉండగానే హైదరాబాద్ వెళ్లాలన్న వినతిపై వేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. -
వరవరరావుకు ఊరట
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన కవి, సామాజిక ఉద్యమకారుడు వరవరరావు(82)కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఈ నెల 28 దాకా తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలి్సన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ చేపడతామని వెల్లడించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న లొంగిపోవాల్సి ఉండగా, బెయిల్ గడువును పెంచాలని విజ్ఞప్తి చేస్తూ గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, బెయిల్ గడువును పెంచాలన్న వరవరరావు వినతిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వ్యతిరేకించింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వరవరరావు ప్రస్తుతం ముంబైలో భార్యతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ గడువును పొడిగించాలన్న వరవరరావు విజ్ఞప్తి పట్ల న్యాయస్థానం గురువారం సానుకూలంగా స్పందించింది. ఈ నెల 28 దాకా లొంగిపోవాలి్సన అవసరం లేదని వెల్లడించింది. -
మోపిదేవి మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. అనారోగ్య కారణాలరీత్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను శనివారం తోసిపుచ్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రధాన న్యాయాధికారి యు.దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మోపిదేవి కోరిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన వ్యక్తిగత డాక్టరు పరిశీలనలో జైలు అధికారుల పర్యవేక్షణలో అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేయించాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. నిబంధనలు అనుమతిస్తే, వైద్య పరీక్షలను ప్రభుత్వ ఖర్చుతో, లేదంటే మోపిదేవి సొంత ఖర్చులతో పరీక్షలు చేయించాలని స్పష్టం చేసింది. పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయించుకోవాలని మోపిదేవి నిర్ణయించుకుంటే, సంబంధిత మెడికల్ రికార్డుతో తిరిగి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని, రికార్డుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ ప్రత్యామ్నాయం కాదన్న న్యాయాధికారి, రెండో అభిప్రాయం కోసం పరీక్షలు చేయించుకుంటామని కోరడాన్ని తప్పుపట్టలేమని పేర్కొన్నారు. -
ఓఎంసి కేసులో శ్రీనివాస రెడ్డి బెయిల్ పొడిగింపు
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసులో దాని మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి తాత్కాలిక బెయిల్‌ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. శ్రీనివాస్ రెడ్డి భార్య కాలికి ఆపరేషన్ చేస్తున్నందున తొలుత ఈ నెల 5 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన భార్య కాలికి ఆపరేషన్ చేయించవలసి ఉన్నందున, తనకు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 2వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 50 వేల రూపాయల డిపాజిట్, ఇద్దరి వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు మినహా ఇతరులతో మాట్లాడరాదని షరతు విధించింది. ఐదు రోజులపాటు ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తరలించి, తిరిగి సాయంత్రం 4 గంటలకు జైలుకు తీసుకువెళ్లాలని జైలు సూపరింటిండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. శ్రీనివాస రెడ్డి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముగ్గురు సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఉండాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. మళ్లీ శ్రీనివాస రెడ్డి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ను మరో నాలుగు రోజులు పొడిగించింది. -
ఓఎంసి కేసులో శ్రీనివాస రెడ్డి బెయిల్ పొడిగింపు
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసులో దాని మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి తాత్కాలిక బెయిల్‌ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. శ్రీనివాస్ రెడ్డి భార్య కాలికి ఆపరేషన్ చేస్తున్నందున తొలుత ఈ నెల 5 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన భార్య కాలికి ఆపరేషన్ చేయించవలసి ఉన్నందున, తనకు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 2వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 50 వేల రూపాయల డిపాజిట్, ఇద్దరి వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు మినహా ఇతరులతో మాట్లాడరాదని షరతు విధించింది. ఐదు రోజులపాటు ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తరలించి, తిరిగి సాయంత్రం 4 గంటలకు జైలుకు తీసుకువెళ్లాలని జైలు సూపరింటిండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. శ్రీనివాస రెడ్డి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముగ్గురు సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఉండాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. మళ్లీ శ్రీనివాస రెడ్డి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ను మరో నాలుగు రోజులు పొడిగించింది.