breaking news
Bacha Khan University
-
'అవి మీ దేశ ఫోన్లే.. సహాయం చేయండి'
ఇస్లామాబాద్: తమ దేశంలోని విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అఫ్ఘానిస్తాన్ సహాయాన్ని పాకిస్థాన్ అర్జించింది. ఈ మేరకు ఆ దేశ ముఖ్య సైనికాధికారి రహీల్ షరీఫ్ అఫ్ఘాన్ నేతలకు ఫోన్లు చేశారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి, అక్కడ అమెరికా సైనిక వ్యవహారాలు చూస్తున్న ఉన్నతాధికారికి ఫోన్ చేసి తమకు సహాయం చేయాల్సిందిగా కోరారు. అఫ్ఘానిస్తాన్‌లో ఎక్కువ ప్రభావం ఉన్న తాలిబన్లు బుధవారం బచా ఖాన్ విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ ప్రొఫెసర్ తో సహా 21మంది ప్రాణాలుకోల్పోయారు. ఇటీవలె ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రపంచానికి చెప్తున్న పాక్ తాజా ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన ఎలా జరిగింది అని ఆరా తీయగా తాలిబన్ల ఆపరేషన్ అఫ్ఘానిస్తాన్ నుంచే పర్యవేక్షించారని, అఫ్ఘాన్ సెల్ ఫోన్లే తాలిబన్లు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించారని గుర్తించారు. ఈ నేపథ్యంలో వారి సహాయాన్ని పాకిస్థాన్ కోరింది. -
యూనివర్సిటీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు, కాల్పులు
-
యూనివర్సిటీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు, కాల్పులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. వాయవ్య పాకిస్థాన్ లోని ఛార్ సదా ప్రాంతంలో యూనివర్సిటీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని బచా ఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధ ఉగ్రవాదులు చొరబడ్డారు. తరగతులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా కాల్పులు, బాంబు పేలుళ్లకు తెగబడ్డారని వార్తా చానళ్లు వెల్లడించాయి. 25 మంది మృతి చెందారు. 60 మందిపైగా గాయపడినట్టు సమాచారం. వర్సిటీలో మొత్తంలో 600 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబాన్ ప్రకటించుకుంది. విద్యార్థులు తల్లిదండ్రులు, వర్సిటీ సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా వర్సిటీ వెలుపల గుమిగూడారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. వీరికి సాయంగా హెలికాప్టర్లను రప్పించారు. పొగమంచు దట్టంగా అలముకోవడంతో వర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనేది తెలియడం లేదు. కాగా, నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. పెషావర్ సైనిక స్కూల్ పై తాలిబాన్ ఉగ్రవాదులు 134 విద్యార్థులను కాల్చివేసిన సంఘటన మర్చిపోకముందే విద్యాలయంపై మరో దాడి జరగడం పట్ల భయాందోళన వ్యక్తమవుతోంది.