breaking news
Baazigar
-
కూతురికి పాలు పట్టిద్దామంటే రూ.5 కూడా చేతిలో లేవు: నటుడు
సినిమా సక్సెస్ అయిందంటే ఆర్టిస్టుల పంట పండినట్లే అంటుంటారు. కానీ తన విషయంలో మాత్రం ఇది తలకిందులైంటున్నాడు బాలీవుడ్ నటుడు ఆది ఇరానీ (Adi Irani). తను నటించిన సినిమాలు సక్సెస్ అయినప్పటికీ కష్టాలు మాత్రం కొనసాగాయని చెప్తున్నాడు. ఈయన 1990వ దశకంలో అనేక సినిమాలు చేశాడు. షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్‌లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇబ్బందులు ఏకరువు పెట్టిన నటుడుసహాయ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆది తాజాగా తన ఇబ్బందులను బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1993లో వచ్చిన బాజీగర్ సినిమా (Baazigar Movie) షారూఖ్‌ను స్టార్‌గా మార్చింది. కానీ నాకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. 1995లో నాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో పాల ధర రూ.5గా ఉండేది. కూతురికి పాలు కొనడానికి నా దగ్గర కనీసం రూ.5 కూడా ఉండేవి కాదు. బాజీగర్ సినిమా స్టిల్పెట్రోల్కు డబ్బుల్లేకపోతే..ప్రతిరోజు నగరానికి వెళ్లి ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగేవాడిని. అవకాశాల కోసం అడుక్కునేవాడిని. నా స్నేహితుడి స్కూటర్ తీసుకుని వెళ్లేవాడిని. కొన్నిసార్లు అందులో పెట్రోల్ కొట్టించడానికి కూడా నా దగ్గర డబ్బు ఉండేదికాదు. అప్పుడు బస్సుల్లో తిరిగేవాడిని. జనాలేమో.. నువ్వేంటి, బస్‌స్టాప్‌లో ఉన్నావని ఆశ్చర్యపోతూ అడిగేవారు. ఫ్రెండ్ వస్తానన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా అని అబద్ధాలు చెప్పేవాడిని. అక్క సాయం వద్దన్నానుబస్సుల్లో తిరుగుతుంటే నీకు బస్ ఎక్కాల్సిన అవసరం ఏంటనేవారు. వారి మాటలు భరించలేక ఒక్కోసారి ఇంటికి తిరిగి వెళ్లిపోయేవాడిని. మా అక్కకు నా విషయం తెలిసి ఎన్నోసార్లు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ నేను ఒప్పుకోలేదు. తమ్ముడినైనంతమాత్రాన జీవితాంతం నన్ను పోషించాలని లేదు కదా.. పైగా తనకంటూ ఓ కుటుంబం ఉంది. అప్పటికే ఆ ఫ్యామిలీని చూసుకుంటోంది. నా బాధలేవో నేను పడ్డా..మళ్లీ నా కుటుంబాన్ని కూడా తనే చూసుకోవడం కరెక్ట్ కాదుకదా.. అందుకే నా బాధలేవో నేను పడ్డాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆది ఇరానీ అక్క అరుణ ఇరానీ అప్పటికే ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఆది ఇరానీ.. దిల్, బాజీగర్, బాద్షా, హమ్ ఆప్కే దిల్ మే రెహతా హై, వెల్కమ్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 2022లో వచ్చిన ఎ థర్స్డే చిత్రంలో చివరిసారిగా నటించాడు.చదవండి: నువ్వు దొరకడం నా అదృష్టం.. ఈ ఏడాదైనా జరగాల్సిందే!: రవి కృష్ణ -
అతడి కోసం డ్యాన్స్ చేస్తా: షారుఖ్
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు కీర్తినార్జించి పెట్టిన చిత్రం ‘బాజీగర్’ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విజయానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేశారని, దీనికి సంబంధించి షారూఖ్ తన తోటి నటీ నటులకు, దర్శకుడికి ధన్యవాదాలు తెలిపుతూ ట్వీట్ చేశారు. షార్‌ఖ్ ట్వీట్‌కు ముంబై ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ రీట్వీట్ చేశారు. తనకు నచ్చిన చిత్రాలలో బాజీగర్ ఒకటని, అందులో ఎలాంటి సందేహం లేదని ట్వీట్లో స్పష్టం చేశారు. అనూహ్యంగా రోహిత్ శర్మ నుంచి వచ్చిన స్పందనకు బాలీవుడ్ బాద్షా ఫిదా అయ్యారు. అంతేకాకుండా రోహిత్‌కు అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్ ప్రారంభోత్సవంలో రోహిత్ శర్మ కోసం బాజీగర్ చిత్రంలోని ‘ఏ కాలీ కాలీ ఆంఖే’ అనే పాటకు నృత్యం చేస్తానని ప్రకటించారు. ఐపీఎల్ పుణ్యమా అని బాలీవుడ్ స్టార్స్‌తో క్రికెటర్లకు మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అందులోనూ ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహయజమాని షారుఖ్ కావడంతో క్రికెటర్లతో స్నేహం కలిసింది. క్రికెట్ తరహాలోనే హాకీకి కూడా పెద్దఎత్తున మద్దతివ్వాలని గతంలో అభిమానులకు షారుఖ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ చిత్రంలో ఎవర్గ్రీన్ బ్యూటీ కాజోల్, పొడుగాళ్ల సుందరి శిల్పాశెట్టిలు ప్రధాన పాత్రలు కాగా, షారూఖ్ ది మాత్రం నెగిటివ్ రోల్. ఆ పాత్రలో కూడా షారూఖ్ హీరోయిజాన్ని ప్రదర్శించారు. 25yrs of Baazigar. A film that defines my career & gave me lifelong friends. Thx Utd 7 @rtnjn @theabbasmustan @KajolAtUN @TheShilpaShetty Thomas Johnnybhai Annu Rakhiji Sid Dilip Sarojji Rekha AkbarB & everyone on the film. pic.twitter.com/5zlmNUXPLL — Shah Rukh Khan (@iamsrk) November 12, 2018 One of my top movies, no questions!! @iamsrk https://t.co/rY8rUexNop — Rohit Sharma (@ImRo45) November 12, 2018 Next time will do Kaali Kaali Aankhen for you live at the IPL my friend. Keep healthy. Love to u. https://t.co/vPzChMoWY0 — Shah Rukh Khan (@iamsrk) November 13, 2018 -
20 వసంతాలు పూర్తి చేసుకున్న'బాజీగర్'
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు కీర్తినార్జించి పెట్టిన మునపటి చిత్రం బాజీగర్ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి షారూఖ్ తన తోటి నటీ నటులకు, దర్శకుడిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం విజయానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేశారని షారూఖ్ అన్నారు. ఆ సినిమాలో బ్లాక్ బ్యూటీ కాజోల్, పొడుగాళ్ల సుందరి శిల్పాశెట్టిలు ప్రధాన పాత్రలు కాగా, షారూఖ్ ది మాత్రం నెగిటివ్ రోల్. ఆ పాత్రలో కూడా షారూఖ్ హీరోయిజాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రంలో డైలాగ్ లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగానే ఉంటాయి. ఓడి గెలిచినవాడే బాజీగర్(అభీ భీ హర్కర్ జీత్నేవాలే కో బాజీగర్ క్యహతే హైన్) అనే డైలాగ్ కు విశేష ఆదరణ లభించింది. వీటిన ఒకసారి గుర్తు చేసుకున్నషారూఖ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆనాటి టీంకు కృతజ్జతలు తెలియజేశాడు. ఇప్పటికీ దూకుడుమీద ఉన్న షారూఖ్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.