ఒక్క అమెరికాలోనే 23 కోట్లు!
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి సినిమా కలెక్షన్ల జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అమెరికాలో తెలుగు వెర్షన్ కు మూడు రోజులు కలిపి 34,56,605 డాలర్లు.. అంటే, 21.91 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు అమెరికాలో ఇంత వసూళ్లు రాలేదు. ఆగండి.. అప్పుడే అయిపోలేదు. అక్కడ తమిళ వెర్షన్ కూడా రిలీజైంది. దానికి కూడా మొదటి మూడు రోజుల్లో 98.82 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే రెండూ కలిపితే దాదాపు రూ. 23 కోట్లన్న మాట. ఇక ఉత్తరాదిలో విడుదలైన బాహుబలి హిందీ డబ్బింగ్ మొదటి రోజు కంటే రెండో రోజు మరింత ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టింది. శుక్రవారం 5.15 కోట్ల రూపాయలు మాత్రమే రాగా, శనివారం నాడు ఏకంగా 7.09 కోట్లు వచ్చాయి. అసలు హిందీ వెర్షన్ థియేటర్ వసూళ్లు మొత్తం కలిపి 7.5 కోట్లు వస్తే ఎక్కువని భావించారు. అలాంటిది రెండు రోజుల్లోనే 12.24 కోట్లను వసూలుచేసింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఉత్తరాదిలో ఇంత వసూళ్లు రావడం నిజంగా అద్భుతమని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
కేవలం తెలుగు సినిమా రికార్డులే కాకుండా, హిందీలో వచ్చిన పీకే, క్రిష్, చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలనూ దాటేసిందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ తెలిపింది. డిస్ట్రిబ్యూటర్ల నెట్ షేర్ కూడా మొదటి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలోనే కొనసాగింది. బాహుబలికి మొదటిరోజు 42.23 కోట్ల నెట్ షేర్ వచ్చింది. అదే హేపీ న్యూఇయర్ కు 42 కోట్లు, ధూమ్ 3కి 32 కోట్లు, సింగం రిటర్న్స్ కు 31.8 కోట్లు, చెన్నై ఎక్స్ ప్రెస్ కు 28 కోట్లు, కిక్ కు 26 కోట్లు, పీకే కు 25 కోట్లు, అగ్నిపథ్ కు 22 కోట్లు మాత్రమే వచ్చాయి.
#Baahubali [Tamil] - USA: Thu pre $ 10,849, Fri $ 52,939, Sat $ 92,304. Total: $ 156,092 [₹ 98.92 lacs]. SUPER!
— taran adarsh (@taran_adarsh) July 12, 2015
#Baahubali [Telugu] - USA: Thu pre $ 1,360,200, Fri $ 1,061,359, Sat $ 1,035,046. Total: $ 3,456,605 [₹ 21.91 cr]. EXTRAORDINARY!
— taran adarsh (@taran_adarsh) July 12, 2015
#Baahubali [dubbed Hindi version] witnesses 40% growth on Day 2. Fri 5.15 cr, Sat 7.09 cr. Total: ₹ 12.24 cr. India biz. SUPERB!
— taran adarsh (@taran_adarsh) July 12, 2015