breaking news
azar
-
పాకిస్తాన్‌కు కొత్త టెన్షన్.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్
ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం పాత్రను ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రశ్నిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి."ఇజ్రాయెల్ దృష్టిలో పాకిస్థాన్ విశ్వసనీయ మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వం చేసే దేశం అన్ని పక్షాల విశ్వాసాన్ని పొందాలి. పాకిస్థాన్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు" అంటూ రూవెన్ అజర్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు సంబంధించిన సున్నితమైన అంశాల్లో పాకిస్థాన్ పాత్రపై తమకు సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.అమెరికా లేదా ఇతర దేశాలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్‌ను సంప్రదించవచ్చని, అయితే అది ఇజ్రాయెల్ అభిప్రాయాన్ని మార్చదని అజర్ వ్యాఖ్యానించారు. తమకు ప్రధానంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, అలాగే ఇరాన్ ప్రభావాన్ని నియంత్రించడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.పాకిస్థాన్‌పై ఎందుకు అనుమానాలు?ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం మధ్యవర్తిగా వ్యవహరించే దేశం తటస్థ వైఖరిని కలిగి ఉండాలి. అయితే పాకిస్థాన్‌కు ఇప్పటికీ ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అంతేకాకుండా, గతంలో ఇజ్రాయెల్ విధానాలపై ఇస్లామాబాద్ చేసిన విమర్శలు కూడా ఆ దేశ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అజర్ సూచించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో పాకిస్థాన్ పాత్ర పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇస్లామాబాద్ దౌత్య సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ప్రాంతీయ మిలిటెంట్ సంస్థల కార్యకలాపాలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా అంగీకరించలేమన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలు కొత్త దౌత్య చర్చలకు తెరతీశాయి.భారత్‌పై ప్రశంసలుఇదే సందర్భంగా భారత్ పాత్రను కూడా రూవెన్ అజర్ ప్రశంసించారు. పశ్చిమాసియాలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్‌కు కీలక పాత్ర ఉందని, ప్రాంతీయ శాంతి ప్రయత్నాల్లో న్యూఢిల్లీ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.78 ఏళ్లుగా దూరంగానే పాక్–ఇజ్రాయెల్పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో సంక్లిష్టంగానే ఉన్నాయి. 1947లో పాకిస్థాన్, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామాబాద్ ఆ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా నిలుస్తూ, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించబోమనే వైఖరిని కొనసాగిస్తోంది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా కూడా పాలస్తీనా అంశంలో అరబ్ దేశాలకు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ విధానం పాకిస్థాన్ విదేశాంగ విధానంలో కీలక భాగంగా కొనసాగుతోంది. అధికారిక సంబంధాలు లేకపోయినా, గతంలో రెండు దేశాల మధ్య పరోక్ష స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాలు లేవు. దౌత్య సంబంధాలు కూడా నెలకొనలేదు.ఇక రూవెన్ అజర్ తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యం, ఇరాన్ అంశంలో దాని పాత్ర, అలాగే మధ్యప్రాచ్య దౌత్య సమీకరణాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందన కోసం అంతర్జాతీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. -
పతనానికి పరాకాష్ట
-
అజారుద్దీన్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్
-
నెగెటివ్ ప్రచారం చేయడం తగదు : అజారుద్దీన్
-
అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
-
తొక్కిసలాటకు అజారే బాధ్యత వహించాలి : HCA మాజీ కార్యదర్శి శేషునారాయణ్
-
మద్యం మత్తులో యువతి వీరంగం!
హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. నిర్లక్ష్యంగా కారును నడిపి ఓ యువకుడ్ని ఢీకొట్టింది.హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం... అబిడ్స్ చాపెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన యువతి (26) సోమవారం అర్థరాత్రి (ఏపీ 9సీకే 1340) కారుపై మోహదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తూ ముందు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న టోలీచౌకికి చెందిన అజార్‌ని ఢీకొట్టింది. తర్వాత ఫ్లైఓవర్ పై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి హల్చల్ చేసింది. నిర్లక్ష్యంగా కారు నడుపుతున్నాఆమెను స్థానికులు ప్రశ్నించగా... అడగటానికి మీరెవరిని తిరగబడింది. అంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్‌లు స్వల్పంగా గాయపడ్డ అజార్‌ను ఆస్పత్రికి పంపించారు. అనంతరం యువతిని ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించి మోతాదుకు మించి మద్యం తాగివున్నట్లు నిర్థారించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీఏకు సిఫార్సు చేస్తామన్నారు. కాగా ఇదే యువతి నగరంలో గతంలో కూడా ఇలాగే మద్యం సేవించి వీరంగం సృష్టించినట్లు పోలీసులు తెలిపారు.


