breaking news
Azad Khan
-
వారిని హిందుత్వవాదులే చంపారా?
రాంచి: జార్ఖండ్ రాష్ట్రంలోని జబ్బార్ గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు పశువుల వ్యాపారులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి, వారి చేతులను వెనక్కి విరిచికట్టి ఓ చెట్టుకు ఉరితీశారు. వారి హత్యకు కారణాలు ఏమిటో పోలీసులు నేటికి కనుక్కోలేకపోయినా వారిని హిందుత్వవాదులే హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యకు గురైన వారు ఆజాద్ ఖాన్ అలియాస్ ఇబ్రహీం(15), ముహమ్మద్ మజ్లూం(35) అనే ముస్లిం యువకులు అవడం, గోవులను కబేళాలకు తరలిస్తున్నారని ఆ మధ్య ఇద్దరు వ్యక్తులను హిందుత్వ వాదులు కొట్టి చంపిన నేపథ్యంలో ఈ హత్యలు కూడా ఆ కోవకు చెందినవేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉరితీసిన చోట ఓ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి గొడవ చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితులను అదుపు చేయడం కోసం పోలీసులు పలుసార్లు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇవి కచ్చితంగా హిందూ ర్యాడికల్స్ చేసిన హత్యలేనని జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) ఎమ్మెల్యే ప్రకాష్ రమాస్ ఆరోపించారు. ఎనిమిది ఎద్దులను సమీపంలోని ఛాట్రా మార్కెట్కు తీసుకెళుతుండగా ఈ హత్యలు జరిగాయని, కొంతమంది గుంపు ముస్లిం యువకులను తీవ్రంగా కొట్టడం దూరం నుంచి చూశామంటూ కొందరు గ్రామస్థులు తెలిపారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎద్దులు ఏమయ్యాయో గ్రామస్థులు కూడా చెప్పలేక పోతున్నారని వారన్నారు. ఇప్పుడే హత్యలపై ఓ నిర్ణయానికి రాలేమని, హత్యలకు గురైన వారితో ఎవరికైనా వ్యక్తిగత కక్ష్యలు ఉన్నాయా? వ్యాపార లావాదేవీల గొడవులున్నాయా ? అన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
మైనర్లపై వరుస అత్యాచారాలు... నిందితుడు అరెస్ట్
మైనర్లపై వరుస అత్యాచారాలకు పాల్పడుతు పోలీసులు కళ్లుకప్పి తిరుగుతున్న నిందితుడు ఆజాద్ ఖాన్ (27)ను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి పి.కరుణాకరన్ వెల్లడించారు. బీహార్లోని నిందితుడి స్వగ్రామంలో అతడిని న్యూఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... తుగ్లకబాద్లో భార్యతో కలసి ఆజాద్ ఖాన్ నివసిస్తున్నారు. స్థానిక కంపెనీలో అతడు కార్మికుడుగా పని చేసేవాడని, ఆ సమయంలో స్థానిక బాలికలకు తినుబండారాల ఆశ చూపి, వారిని మాటలతో మభ్యపెట్టివాడని పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో బాలికలను తుగ్లక్బాద్ అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి వారిపై అత్యాచారం జరిపేవాడని పోలీసులు చెప్పారు. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్, డిసెంబర్ మాసాలలో వరుసగా ముగ్గురు బాలికల అతడు అత్యాచారం చేశాడని పోలీసులు వివరించారు. దీంతో అయా బాలికల తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు ఏడు నెలలుగా నిందితుడు ఆజాద్ ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎట్టకేలకు గత వారం నిందితుడి స్వగ్రామంలో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు.