breaking news
autobiography Khullam Khulla
-
ఆ హీరోయిన్ కోసం నన్ను కొట్టాలనుకున్నాడు
ముంబై: బాలీవుడ్లో ఎఫైర్స్, తగాదాలు, న్యాయపోరాటాలు కామన్‌గా మారిపోయాయి. సీనియర్ నటుడు రిషీ కపూర్ తన ఆత్మకథ ఖుల్లాం ఖుల్లాలో ఇలాంటి విషయాన్నే వెల్లడించాడు. హీరో సంజయ్ దత్ ఓ హీరోయిన్ విషయంలో తనతో గొడవపడి కొట్టాలని భావించాడని రిషీ కపూర్ వెల్లడించాడు. తనను అపార్థం చేసుకోవడమే దీనికి కారణమని, తర్వాత సంజయ్ విషయం తెలుసుకుని తనతో సఖ్యతగా మెలిగాడని పేర్కొన్నాడు. నటుడు గుల్షన్ గ్రోవర్ చెప్పిన విషయాన్ని రిషీ కపూర్ తన ఆత్మకథలో ప్రస్తావించాడు. 'సంజయ్ దత్‌కు అప్పట్లో నటి టీనా మున్నిమ్తో ఎఫైర్ ఉండేది. టీనాతో రిషీ కపూర్‌కు కూడా ఎఫైర్ ఉందని సంజయ్ అనుమానించాడు. సంజయ్ స్నేహితులు రిషీ కపూర్ గురించి చెడుగా చెప్పడమే దీనికి కారణం. సంజు, నేను అన్నదమ్ముళ్లలాగా ఉండేవాళ్లం. ఓ రోజు సంజయ్ నా వద్దకు వచ్చి రిషీ కపూర్ ఇంటికి వెల్లి గొడవ పెట్టుకోవాలని చెప్పాడు. రిషీ కపూర్ భార్య నీతూజీ ఈ విషయంలో ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ జరగకుండా చూసింది. టీనాతో రిషీ కపూర్‌కు ఎఫైర్ లేదని సంజయ్‌కు వివరించింది చెప్పింది. దీంతో అక్కడ నుంచి మేం వచ్చేశాం' అని గుల్షన్ గ్రోవర్ చెప్పినట్టుగా రిషీ కపూర్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. -
ఆ హీరోయిన్‌తో నాకు ఎఫైర్ ఉందని..
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ తన ఆత్మకథ ఖుల్లాం ఖుల్లాలో సంచలన, వివాదాస్పద విషయాలను వెల్లడించారు. హీరోయిన్లతో తనకు ఎఫైర్స్ ఉన్నట్టు పుకార్లు రావడం, వాటిపై భార్య నీతు స్పందన గురించి ఈ పుస్తకంలో రాశారు. తనకు వివాహం కాకముందు బాలీవుడ్ హీరోయిన్ టీనా మునిమ్‌తో ఎఫైర్ ఉన్నట్టు మరో హీరో సంజయ్ దత్ అనుమానించాడని రిషి కపూర్ పేర్కొన్నారు. అప్పట్లో టీనా సంజయ్ పట్ల ఆకర్షితురాలైందని వెల్లడించారు. మీడియా ఈ విషయం గురించి ప్రస్తావించలేదని, కానీ కొందరు బాలీవుడ్ ప్రముఖులు మాత్రం తనకు టీనాతో సీక్రెట్ ఎఫైర్ ఉందని భావించేవారని తెలిపారు. ఈ విషయం తెలియగానే ఓ రోజు సంజయ్ దత్, గుల్షన్ గ్రోవర్తో కలసి తనతో గొడవ పడటానికి నీతూ ఇంటికి వచ్చారని వివరించారు. ఇద్దరి మధ్య గొడవ కాకుండా నీతూ పరిష్కారం చేసిందని వెల్లడించారు. తనకు, టీనాకు మధ్య ఎపైర్ లేదని, ఈ పుకార్లు నిరాధారమని, కేవలం కో స్టార్లుగా స్నేహంగా ఉంటారని.. సంజయ్‌కు నీతూ చెప్పి నమ్మించడంతో వివాదం ముగిసిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రస్తావన వచ్చినపుడు తాను, సంజయ్ నవ్వుకునేవాళ్లమని తెలిపారు. ఈ సంఘటన జరిగాక నీతూ, తాను వివాహం చేసుకున్నామని, తమ పెళ్లికి తన హీరోయిన్లు అందరూ వచ్చారని వెల్లడించారు. పెళ్లయిన తర్వాత డింపుల్ కపాడియాతో తనకు ఎఫైర్ ఉందని పుకార్లు వచ్చాయని రిషి కపూర్ పుస్తకంలో రాశారు. తనపై నీతూకు నమ్మకముందని, ఈ విషయం గురించి ఆమె ఆందోళన చెందలేదని తెలిపారు. డింపుల్ తనకు స్నేహితురాలు మాత్రమేనని పేర్కొన్నారు. తామిద్దరం బాబీ సినిమాలో నటించామని, తర్వాత సాగర్ సినిమా చేశామని తెలిపారు.