breaking news
Authoress
-
రచయిత్రిగా విద్యాబాలన్?
బాలీవుడ్లో టాప్‌మోస్ట్ హీరోయిన్లలో ఒకరుగా ప్రకాశిస్తున్న నటి విద్యాబాలన్. ది దర్టి పిక్చర్ చిత్రం ముందువరకు కుటుంబ కథా నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రంలో తన అందాలను విచ్చలవిడిగా కుమ్మరించి గ్లామరస్ పాత్రల పోషణకు సరికొత్త భాష్యం చెప్పారు. అలాంటి విద్యాబాలన్ కహాని చిత్రంలో తప్పిపోయిన భర్తను వెతుక్కుంటూ వెళ్లే పాత్రలో జీవించారనే చెప్పాలి. తాజాగా ఈ సంచలన తార రచయిత్రిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేరళకు చెందిన కమలదాస్ సంచలన రచయిత్రిగా పేరుగాంచారు. ఈమె బాల్య ప్రేమ లాంటి పలు ఇతివృత్తాలలో నవలలు రాసి సంచలనం సృస్టించారు. కమలదాస్ రాసిన మైస్టోరీ పుస్తకం పలు భాషల్లో అనువాదం కావడం విశేషం. కమలదాస్ కొంతకాలం తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించి కమల మరియాగా పేరు మార్చుకున్నారు. ఈమె జీవిత చరిత్రను మళయాల దర్శకుడు కమల్ వెండితెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. దీనిగురించి ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం రచయిత్రి కమలదాస్ జీవిత చరిత్రగా కాకుండా ఒక రచయిత్రి భావోద్వేషాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి విద్యాబాలన్‌ను సంప్రదించనున్నట్లు తెలిపారు. -
స్ఫూర్తి ప్రదాత మాలతీచందూర్
విజయవాడ, న్యూస్‌లైన్ : సుప్రసిద్ధ రచయిత్రి మాలతీచందూర్ యావత్ మహిళాలోకానికి స్ఫూర్తిప్రదాత అని పలువురు వక్తలు కొనియాడారు. రచయిత్రి మాలతీచందూర్ ‘జీవితం-సాహిత్యం’పై విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో గురువారం సాయంత్రం సదస్సు జరిగింది. ప్రధానవక్తగా హాజరైన సాహితీ వేత్త కేబీ లక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి చేరువ చేసిన సుప్రసిద్ధ రచయితల్లో మాలతీచందూర్ ఒకరన్నారు. ఆమెను గొప్ప అనువాదకురాలిగా పేర్కొంటూ మాలతీచందూర్ అనువాద సాహిత్యాలను గురించి సభకు వివరించారు. సంప్రదాయ, అభ్యుదయ భావజాలాన్ని కలిపి నేటితరానికి రచనల ద్వారా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. ఆరు దశాబ్దాల పాటు వివిధ పత్రికల్లో పాఠకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఘనత మాలతీచందూర్‌దేనన్నారు. సభకు అధ్యక్షత వహించిన సాహితీవేత్త డాక్టర్ రెంటాల జయదేవ్ మాట్లాడుతూ మాలతీచందూర్‌ను సాహితీప్రియులందరూ తమ కుటుంబ సభ్యురాలిగా భావించేవారన్నారు. సాహిత్యంలోని వివిధ కోణాలను స్పృశించిన ఆమె అన్ని ప్రక్రియల్లోనూ తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారన్నారు. ఆమె రచించిన పిండి వంటలు పుస్తకాలు సైతం ఎంతో జనాదరణ పొందిందని ఆయన గుర్తుచేశారు. -
మాలతీ చందూర్ క్యాన్సర్ వ్యాధితో మరణం
అన్నానగర్, న్యూస్‌లైన్:బహుముఖ ప్రజ్ఞాశాలిగా, రచయిత్రిగా పేరుపొందిన మాలతీ చందూర్ ఇక లేరు. ఆమె బుధవారం సాయంత్రం క్యాన్సర్ వ్యాధితో మృతిచెందారు. 1930లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నూజివీడులోని జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు దంపతులకు ఆరవ సంతానంగా మాలతి జన్మిం చారు. నూజివీడులోనూ, ఏలూరులోనూ విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1947 మేనమామ అయిన చందూరి నాగేశ్వరావును పెళ్లి చేసుకున్నారు. అనంతరం మాలతి జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఎన్ఆర్ చందూర్ స్వతహాగా పాఠకుడు, రచయిత, సంపాదకుడు కావడంతో ఆయన మాలతి దృష్టిని సాహిత్యం వైపునకు మరల్చి తొలి గురువు అయ్యారు. ఏలూరులోని సాహిత్య మండలితో ఉన్న ఆమెకున్న అనుబంధం సైతం మాలతిని సాహితీ రంగం వైపుకి మరలేలా చేసింది. ‘శరికం’ అనే నాటకంలో మాలతి ఒక పాత్రను కూడా పోషించారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, చలం వంటి వారి పుస్తకాలను ఆమెను సంపూర్ణమైన రచనా వ్యాసాంగంలోనికి దించాయి. అందుకే ఆమె ‘పుట్టిన రోజులకు పుస్తకంను మాత్రమే బహుమతిగా ఇవ్వండి’ అంటూ ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారు. మాలతీ చందూర్ రాసిన పలు పుస్తకాల్లో మధుర స్మృతు లు, చంపకం, చెదపురుగులు, లావణ్య, ఏది గమ్యం - ఏది మార్గం?, రేణుకా దేవి ఆత్మకథ, క్షణికం, ఏమిటీ ఈ జీవితాలు?, రాగరక్తిమ, బ్రతక నేర్చిన జాణ, జయలక్ష్మీ - కృష్ణవేణి, వైశాఖి వంటివి ఉన్నాయి. ఇవి ప్రస్తుతం లభ్యం కావడం లేదు. 1950లో ఆమె రాసిన ఁరవ్వల దిద్దులురూ. అనే తొలి కథ ఆనంద వాణిలో ప్రచురితమైంది. భారతి మాస పత్రికలో లజ్ కార్నర్, నీరజ కథలు ప్రచురితమయ్యాయి. పాప, తనూ - నీరజ శానమ్మ, జాలీ, విలువెంత, ఏడు కొండలవాడా, జమున వంటి కథలు ఆమెను ఒక రచయిత్రిగా నిలిపాయి. మాలతి కథల్లో చెన్నై నగరం ప్రధాన ఇతివృత్తం కావడం గమనించదగిన విశేషం. సుమధుర వంటలూ - కూరలు - పచ్చళ్లూ అనే పలు వంటల పుస్తకాలను కూడా ఆమె రచించారు. మహిళలకు మధుర జీవనం, అందాలు - అలంకారాలూ ఆమె మహిళల కోసం రాసిన పుస్తకాలు. ఉన్నత విద్యను అభ్యసించపోయినా పట్టుదలతో ఆంగ్లాన్ని అభ్యసించి అనేక రచనలను తెలుగులోకి అనువదించారు. మాలతీ చందూర్ ఆలిండియా రేడియో మద్రాసు - బి స్టేషన్ నుంచి ఎన్నో ప్రసంగాలు చేశారు. రెండేళ్ల క్రితం భర్త ఎన్ఆర్ చందూర్ రమణించడంతో ఆమె తన రచనా వ్యాసాంగాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఆ సమయాన్ని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సేవా సంస్థలోని సేవా కార్యక్రమాలకు, అమరజీవి పొట్టి శ్రీరాములు సంఘం కార్యకలాపాలకు వెచ్చిస్తూ కాలం గడిపారు. ఆమె మరణంతో తెలుగు సాహితీ లోకం మరొక ధ్రువతారను కోల్పోయింది. నా తొలి గురువు సాహిత్యంలో మాలతి అమ్మ నాకు గురువు, దైవం. ఆమెతో మాట్లాడడమే ఒక గొప్ప వర్సిటీలో విద్య అభ్యసించడం లాంటిది. సాహితీ కార్యక్రమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడమే కాక తెలుగు భాషా ఉన్నతికి తన వంతు కృషి చేశారు. - మాడభూషి సంపత్ కుమార్, మద్రాసు వర్సిటీ తెలుగు విభాగం పిల్లలతో ఆప్యాయంగా ఉండేవారు మాలతీ చందూర్ పిల్లలతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆమెతో నేను చేసిన ముఖాముఖి సాక్షి పత్రికలో ఁచదవండి బాగా చదవండిరూ. అనే టైటిల్‌తో ప్రచురితమైంది. అది అదృష్టంగా భావిస్తున్నాను. చదవడాన్ని వ్యసనంగా చేసుకోవాలన్న ఆమె మాటలు యువతకు స్ఫూర్తి దాయకం. - డాక్టర్ సగిలి సుధారాణి, పరిశోధకురాలు అమ్మను కోల్పోయినట్టు ఉంది నాకు అమ్మ లాంటి వ్యక్తిని కోల్పోయినందుకు బాధగా ఉంది. ఆమెకు ఫ్యామిలీ డాక్టర్‌గా సేవ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆమె లేని లోటు తీర్చలేనిది. అందరితోనూ కలివిడిగా ఉండేవారు. తన చుట్టూ ఉండే వారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవారు. - డాక్టర్ విజయకుమార్ రచనల్లో కొత్త విషయాలు ఉంటాయి మాలతీ చందూర్ రచనలు కాసులు వంటివి. సాధారణమైన అంశాలను కూడా అసాధారణ ప్రతిభతో రాయడం ఆమెకే చెల్లింది. విషయం స్వల్పమే అయినా అందులో అనేకమైన కొత్త విషయాలు చెప్పడం ఆమె రచనల్లోని ప్రత్యేకత. - డాక్టర్ కాసల నాగభూషణం, వైష్ణవ కళాశాల, తెలుగు ఆచార్యులు