breaking news
attack on girl student
-
ఢిల్లీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. తన చెల్లెలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్‌పై వచ్చి యాసిడ్ దాడి చేయటంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తనకు తెలిసిన వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం 9 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్(పీసీఆర్)కు యాసిడ్ దాడి జరిగినట్లు ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్లు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తన చెల్లెలితో బాధితురాలు ఉందన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై మీడియాతో వివరాలు వెల్లడించారు బాధితురాలి తండ్రి. ‘మా కుమార్తెలు (ఒకరు 17, ఒకరు 13 ఏళ్ల వయసు) ఇద్దరు ఉదయం బయటకు వెళ్లారు. ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మా పెద్ద కూతురిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. వారు ముఖాలకు మాస్కులు ధరించారు.’ అని తెలిపారు. Swati Maliwal (@SwatiJaiHind), chairperson, Delhi Commission for Women on acid attack on 17-year-old Delhi schoolgirl today pic.twitter.com/g2ge62RAez — NDTV (@ndtv) December 14, 2022 ఇదీ చదవండి: మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసు: యువతి తల్లి మృతి -
చిత్తూరు: రెచ్చిపోయిన ఉన్మాది!
చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో ఉన్మాది రెచ్చిపోయాడు. ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో అమానుషంగా దాడి చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి కె.యం.యం కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక కళాశాలలో ఎంబీఏ చదువుతున్న కీర్తన తనును పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కన్న తర్వాత ఇప్పుడు మోసం చేస్తోందంటూ ధనుష్ అనే యువకుడు దాడికి తెగబడ్డాడు. ఆమెను కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలు పాలైన కీర్తనను తోటి విద్యార్థులు తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. కీర్తనకు నాలుగు కత్తిపోట్లు దిగినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని స్నేహితులు దాడి చేసి పారిపోతున్న ధనుష్‌ను వెంబడించి చంద్రగిరి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.