పదేళ్ల ప్రాయంలోనే... ఎఫ్1 అకాడమీలో భారత రేసర్ అతీఖ
లండన్: భారత చిన్నారి రేసర్ అతీఖ మీర్ (Atiqa Mir)కు ప్రతిష్టాత్మక ఫార్ములావన్ అకాడమీలో ప్రవేశం లభించింది. ఈ నెల ఆరంభంలో జరిగిన ఆర్ఎంసీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలువడం ద్వారా వెలుగులోకి వచ్చిన పదేళ్ల భారత బాలిక ప్రస్తుతం ఖతర్‌లో ఎంఈఎన్ఏ నేషన్ కప్‌లో పోటీ పడుతోంది. ఆమె ప్రతిభను గుర్తించిన ఫార్ములావన్ సంస్థ చాంపియన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అకాడమీ ప్రొగ్రామ్ (సీఓటీఎఫ్ఏ)లో భాగంగా అతీఖ మీర్‌కు ప్రవేశం కల్పించింది.ఇందులో భాగంగా యూఏఈలో జరిగే రెండు జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనేందుకు కావాల్సిన శిక్షణ ఇస్తుంది. ఇందులో రాణిస్తే డిస్కవర్ యువర్ డ్రైవ్ (డీవైడీ) కార్యక్రమంలో ఇతర పోటీల్లో పాల్గొనేందుకు కూడా సహకారం అందజేస్తుంది. 2023లో సీఓటీఎఫ్ఏ ప్రారంభించినప్పటి నుంచి బాలికలు, మహిళా రేసర్లకు తమవంతు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నామని ఎఫ్1 అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ సుసీ వోల్ఫ్ తెలిపారు.ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రవేశం పొందినవారిలో 30 శాతం మంది బాలికలు ఉన్నారని.. మహిళా రేసర్ల ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు తమ అకాడమీ కృషి చేస్తుందని వోల్ఫ్ అన్నారు. ప్రస్తుతం 27 మంది బాలిక రేసర్లు యూఏఈ, బ్రిటీష్ సిరీస్‌లలో పోటీపడేందుకు సిద్ధమవుతున్నారని వోల్ఫ్ వివరించారు. ఇదీ చదవండి: ఫైనల్లో ముంబై, బెంగళూరుసాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో బెంగళూరు టొర్పెడస్, ముంబై మెటియోర్స్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ముంబై మెటియోర్స్ 15–8, 15–8, 16–14తో గోవా గార్డియన్స్ జట్టుపై... బెంగళూరు టొర్పెడస్ 10–15, 15–11, 15–13, 15–13తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టుపై విజయం సాధించాయి. ఆదివారం ఫైనల్ జరుగుతుంది.