breaking news
Athletics Teams event
-
భారత అథ్లెటిక్స్ జట్టులో బికాశ్, బాల్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘానికి చెందిన బికాస్ కరార్, బి. బాల్‌రాజ్ ఎంపికయ్యారు. స్పెయిన్‌లోని మలగలో ఈనెల 4 నుంచి 16 వరకు జరిగే ఈ టోర్నీలో వీరిద్దరూ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. బికాస్ కరార్ 45ప్లస్ వయో విభాగంలో 200మీ., 400మీ. హర్డిల్స్ ఈవెంట్లలో తలపడతాడు. గతంలో అమెరికా, ఫ్రాన్స్, ఫిన్లాం డ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లోనూ బికాస్ పాల్గొనడం విశేషం. మరోవైపు బాల్‌రాజ్ 40ప్లస్ వయో విభాగంలో 800మీ. పరుగులో పాల్గొంటాడు. బాల్‌రాజ్‌కు చైనాలో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొన్న అనుభవం ఉంది. -
బోల్ట్ ఆల్ స్టార్స్ టీమ్ విజయం
ఒలింపిక్స్ అనంతరం బరిలోకి మెల్బోర్న్: అథ్లెటిక్స్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ మరోసారి ట్రాక్‌పై తన జోరు చూపించాడు. ప్రారంభ నిట్రో అథ్లెటిక్స్ టీమ్స్ ఈవెంట్లో భాగంగా శనివారం జరిగిన 4గీ100మీటర్ల మిక్స్డ్ రిలేలో బోల్ట్‌కు చెందిన ఆల్‌స్టార్స్ టీమ్.. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. రియో ఒలింపిక్స్ అనంతరం బరిలోకి దిగడం బోల్ట్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. బోల్ట్ ఆల్ స్టార్స్ జట్టుతో పాటు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, జపాన్, చైనా జట్లు పోటీపడుతున్నాయి. ఈ జమైకన్ స్టార్ టీమ్‌లో తన దేశం నుంచే కాకుండా అమెరికా, కెన్యాలనుంచి కూడా ఆటగాళ్లున్నారు. ఇక 4గీ100 మీ. మిక్స్డ్ రిలేలో ప్రతీ జట్టు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళా అథ్లెట్స్ బరిలోకి దిగుతారు. ఆల్‌స్టార్స్ టీమ్ నుంచి ఫైనల్ ఈవెంట్లో అసఫా పావెల్‌కు జతగా బోల్ట్ పరుగు తీశాడు. ‘ఆరంభంలో మేం కాస్త నెమ్మదిగా పరిగెత్తడంతో ఆందోళనకు గురయ్యాను. అందరూ మావైపు ఓడిపోతున్నారంటూ చూశారు. అయితే చివరికి మా జట్టే గెలిచింది. ఈ విజయంతో సంతోషంగా ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఫిబ్రవరిలో పోటీల్లో పాల్గొనలేదు. స్థానిక అథ్లెట్లు కూడా విశేషంగా రాణించారు’ అని స్టేడియంలో ప్రధాన ఆకర్షణగా మారిన బోల్ట్ తెలిపాడు. రెండు గంటల పాటు నాన్‌స్టాప్‌గా సంప్రదాయక, ఆధునిక ఈవెంట్ల కలబోతగా నిట్రో అథ్లెటిక్స్ మీట్‌ను రూపొందించారు. ప్రతీ జట్టు 12 మంది చొప్పున పురుష, మహిళల అథ్లెట్లను కలిగి ఉంటాయి.