breaking news
aslam khan
-
నటుడు దిలీప్‌కుమార్ సోదరుడు మృతి
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ సోదరుడు అస్లాంఖాన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో పాటు ఇంతకుముందే బీపీ, షుగర్, గుండెజబ్బు లాంటి అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి మరణించారు. గతవారం దిలీప్‌కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కోవిడ్ లక్షణాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నిర్దారణ కావడంతో వెంటనే కరోనా వార్డుకు తరలించి చికిత్స అందించారు. అప్పటికే శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో పాటు వారి ఆక్సిజన్ లెవల్స్ కూడా 80% కంటే తక్కువగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని, వయసు పైబడటం, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి అస్లాం ఖాన్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇషాన్ ఖాన్ వయసు 90 సంవత్సరాలు కాగా, అస్లాం ఆయన కంటే చిన్నవాడని తెలిపారు. (రియా, మహేష్ భట్ల వాట్సాప్ చాట్ వైరల్) -
శునకాన్ని చంపి లైంగికదాడి
రాజేంద్రనగర్: మద్యం మత్తులో ఓ యువకుడు గర్భంతో ఉన్న శునకాన్ని చంపి దానిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఎస్సై నాగాచా రి తెలిపిన వివరాల ప్రకారం...ఢిల్లీకి చెందిన అస్లాంఖాన్(20) వారం రోజుల క్రితం నగరానికి వచ్చి శాస్త్రీపురం ప్రాంతంలో ఉంటూ చిల్లరగా తిరుగుతున్నాడు. సోమవారం ఉదయం ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలోని చెట్ల మధ్యకు ఓ కుక్కను తీసుకు వెళ్లిన అతను దానిని మెడ పిసికి చంపి లైంగిక దాడికి దిగాడు. సమీపంలోని ఓ ఇంటిలో ఉంటున్న జహంగీర్ అనే వ్యక్తి దీనిని చూసి కుమారులకు చెప్పడంతో వారు స్థానికుల సహాయంతో అస్లాంను పట్టుకుని చితకబాదారు. అనంతరం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. శునక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.