breaking news
Army Staff
-
ఆర్మీ చీఫ్‌గా విక్కీ
‘ఉరి’ (2019) సినిమా విక్కీ కౌశల్‌కు బాలీవుడ్లో కావల్సినంత బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత ‘సర్దార్ ఉదమ్ సింగ్, భూత్: ది హాంటడ్ షిప్’ సినిమాలు ప్రకటించారు విక్కీ. తాజాగా మరో కొత్తచిత్రాన్ని కూడా ఓకే చేశారు. మాజీ మిలటరీ ఆర్మీ స్టాఫ్ చీఫ్ శ్యామ్ మానేక్షా జీవితం ఆధారంగా మేఘన్ గుల్జార్ రూపొందించనున్న సినిమాలో టైటిల్ రోల్ చేయనున్నారు. ‘‘దేశ ప్రథమ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ జీవితాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించబోతున్నందుకు గౌరవంగా, గర్వంగా ఫీలవుతున్నాను’’ అన్నారు విక్కీ. -
కరడుగట్టిన 12మంది ఉగ్రవాదులకు ఉరి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో కరడుగట్టిన 12 మంది ఉగ్రవాదులకు ఉరి శిక్ష విధించినట్లు పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. వీరిని త్వరలోనే ఉరి తీయనున్నట్లు తెలిపింది. వీరంతా కూడా హీనాతిహీనమైన నేరాలకు పాల్పడినవారేనని ఈ సందర్భంగా వివరించింది. దేశంలో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, బన్ను జైలు గోడలు బద్ధలు కొట్టడం, సైనికులపై దాడులకు తెగబడటం, ప్రజలపై, చట్టసభలపైన బాంబులతో దాడులు చేయడంవంటి పనులు చేసినట్లు పాక్ ఆర్మీ వివరించింది. ఈ నేరాలకింద అరెస్టు చేసిన వీరికి ఇప్పటికే మిలటరీ కోర్టులు ఉరి శిక్షను విధించాయని, ఆ శిక్షను ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ ఆమోదించారని పేర్కొంది. 'గురువారం ఆర్మీ చీఫ్ 12మంది కరుడుగట్టిన ఉగ్రవాదులకు ఉరి శిక్షను ఖరారు చేశారు. వీరంతా కూడా హీనమైన నేరాలకు పాల్పడిన వారే' అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. 2014 డిసెంబర్ 16న పెషావర్ లోని ఓ పాఠశాలపై బాంబుదాడికి పాల్పడి 150మందిని వీరు పొట్టనపెట్టుకున్నారు. అక్కడ చనిపోయినవారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారు.