breaking news
armed man
-
విస్మయపరుస్తున్న సీసీటీవీ దృశ్యాలు
జోధ్‌పూర్: రాజస్థాన్‌లో సోమవారం జరిగిన ఓ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వీక్షకులను విస్మయపరుస్తున్నాయి. జోధ్‌పూర్‌లోని ఓ ఎలక్ట్రానిక్ షోరూంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. హెల్మెట్ ధరించి వచ్చిన ఆ వ్యక్తిని షాపులోని వారు ముందుగా కస్టమర్‌గా భావించి వివరాలు అడుగుతుండగానే.. అతడు గన్ తీశాడు. దీంతో భయంతో అంతా తలోదిక్కున నక్కగా.. కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి ఉడాయించాడు. -
సన్యాసుల ఆశ్రమానికి వెళ్లి మహిళ హత్య
ప్యారిస్: ఫ్రాన్స్‌లోని ఓ సన్యాసుల విశ్రాంతి భవనంలోకి చొరబడి ఓ సాయుధుడు దాడికి తెగబడ్డాడు. ఓ మహిళను దారుణంగా హత్య చేసి పారిపోయాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్ మీడియా ప్రకారం చనిపోయిన మహిళ ఆ విశ్రాంతి గృహానికి గార్డుగా పనిచేస్తుందట. సరిగ్గా రాత్రి పది గంటల ప్రాంతంలో దుండగుడు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, అతడు ఎందుకు ఈ హత్య చేసి ఉంటాడన్న కారణాలు మాత్రం తెలియరాలేదు. దాదాపు 59మంది సన్యాసులు ఈ విశ్రాంతి భవనంలో ఉంటున్నారు. వీరంతా ఆఫ్రికాలో సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. హత్య చేసేందుకు వచ్చిన వ్యక్తి ఓ తుఫాకీని కూడా వెంట తెచ్చుకున్నట్లు తెలిసింది.