breaking news
arjun rampaul
-
అమలా.. ఆవో
సౌత్‌లో సక్సెస్ సాధించిన కథానాయిక అమలాపాల్.. ఇప్పుడు నార్త్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఆమెకు బీ టౌన్ నుంచి పిలుపు వచ్చింది. అర్జున్ రామ్‌పాల్ హీరోగా రూపొంద్నున్న ఓ హిందీ థ్రిల్లర్ మూవీలో అమలాపాల్ నటించనున్నారు. నరేశ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ కానుందట. ‘‘బాలీవుడ్లో తొలి సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నరేశ్ చెప్పిన స్టోరీ నచ్చింది. ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో కూడా జరగనుంది. నేను ఎగై్జట్ అయ్యే విషయాల్లో ఇదొకటి. ఈ సినిమా డిస్కషన్స్‌లో భాగంగా అర్జున్‌తో మాట్లాడుతున్నప్పుడు హిందీ భాషపై నాకు ఎంత గ్రిప్ ఉందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒక టైమ్‌లో నేను ఢిల్లీలో స్టే చేయడం వల్ల హిందీ భాషపై మంచి అవగాహన ఉంది. కానీ, ఇదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్ నాకు ప్లస్ అవుతాయనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అమల. ట్రావెలింగ్‌ను అమల లైక్ చేస్తారు. అందుకేనేమో.. హిమాలయాల్లో షూటింగ్ అనగానే ఎగై్జట్ అయ్యుం టారని ఊహించవచ్చు. -
అర్జున్ రాంపాల్‌ను నిందించడం తగదు
హృతిక్‌తో విడిపోవడానికి కారణం వెనుక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో ఉన్న సన్నిహిత సంబంధమే అనే రూమర్లు మీడియాలో జోరుగా షికారు చేస్తున్న నేపథ్యంలో సుజానే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘‘ఈ విషయంలో మీరు ఎవ్వరిని నిందించాల్సిన అవసరం లేదు. ఎవ్వరినైనా దీనికి బాధ్యుల్ని చేస్తే అంతకంటే పెద్ద విషాదమేమీ ఉండదు. మేము క్లోజ్‌ఫ్రెండ్స్. మేము విడిపోవడానికి మరొకర్ని నిందించడం సరికాదు’’ అని సుజానే అన్నారు. హృతిక్, సుజానేలు విడిపోవడానికి తానే కారణమనే వార్తల్ని అర్జున్ రాంపాల్ కూడా ఖండించారు. తన నుంచి సుజానే విడిపోవడానికి నిర్ణయం తీసుకుందని డిసెంబర్ 13న హృతిక్ రోషన్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.