breaking news
Argentine football star
-
ఇవేం జాగ్రత్తలు!
రష్యన్ అమ్మాయిలను జాగ్రత్తగా డీల్ చెయ్యాలని చెబుతూ అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ తన మాన్యువల్‌లో క్రీడాకారులకు సూచనలు చేయడం వివాదాస్పదం అయింది. జూన్ 14 నుంచి జూలై 15 వరకు రష్యాలో ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల ఫుట్‌బాల్ అసోసియేషన్లన్నీ తమ క్రీడాకారులను కయ్యానికి కాలు దువ్వించి పంపిస్తుంటే, అర్జెంటీనా అక్కడితో ఊరుకోకుండా, ‘రష్యన్ స్త్రీలను లోబరుచుకోవడం ఎలా?’ అనే అంశంపై తన క్రీడాకారులకు కొన్ని టిప్స్ కూడా ఇచ్చి పంపుతోంది! రాజధాని బ్యూనస్ఏర్స్లో గత వారం అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎ.ఎఫ్.ఎ.) విడుదల చేసిన మాన్యువల్‌లోని ఒక అధ్యాయంలో రష్యన్ సంస్కృతి, సంప్రదాయాల గురించి చెబుతూ.. అక్కడి ఆడవాళ్లను వశం చేసుకోడానికి జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని ఎడ్యురాడో పెన్నిసీ అనే ఒక ఉపాధ్యాయుని చేత కొన్ని మెళకువలను చెప్పించింది ఎ.ఎఫ్.ఎ.! రష్యన్ మహిళతో అవకాశం కోసం ఏం చేయాలి?’ అనే శీర్షికతో అచ్చయిన ఆ వ్యాసంలో రష్యన్ ఆడవాళ్ల మనసెరిగి మసలుకోవలసి ఉంటుందన్న హెచ్చరిక ఉంది. ‘‘రష్యన్ యువతులు మగవాళ్లలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే వారి మనసుకు దగ్గరవడం కష్టం. సాధారణంగా రష్యన్ అమ్మాయిలు చాలా ముఖ్యమైన పనుల్లో నిమగ్నం అయి ఉంటారు. వారి అటెన్షన్‌ను పొందడం అంత తేలిక కాదు. ఏమంత ముఖ్యం కాని పనుల్లో ఉండే ఆడవాళ్లను మాత్రం డబ్బుతో మీ వైపునకు తిప్పుకోవచ్చు. అయితే మీరు కొంచెమైనా ఆకర్షణీయంగా ఉండాలి’’ అని మాన్యువల్ ప్రబోధించింది. ఒక ప్రతిష్టాత్మకమైన మాన్యువల్‌లో ఇలాంటి చవకబారు సూచనలు రావడంపై అర్జెంటీనా ప్రభుత్వం వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. -
మెస్సీకి మళ్లీ కొడుకు
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మరోసారి తండ్రయ్యాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ అంటోనిలా రొకుజో మగబిడ్డకు జన్మనిచ్చింది. వీళ్లిద్దరికీ ఇప్పటికే తియాగో అనే పేరున్న మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో బిడ్డకు మాటియో మెస్సీ అని పేరు పెట్టారు. అన్నట్లు... అంటోనిలాకు మెస్సీకి ఇప్పటివరకూ పెళ్లి కాలేదు. -
‘టార్చ్’ టార్చర్!
సరదాగా... ఈ ఫొటోలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ మీద పడిన ఆకుపచ్చ రంగు లైట్ చూశారా! కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మెస్సీ ఏకాగ్రతను దెబ్బతీయడానికి అభిమానులు ఇలా లైట్ వేశారు. అయితే యూరోప్‌లోని అనేక లీగ్‌లలో ఆటగాళ్లను దెబ్బతీయడానికి అభిమానులు ఈ ప్రయత్నం చేస్తుంటారు. కానీ దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. సాధారణంగా మన దగ్గర ఎరుపు రంగులో ఇలాంటి టార్చ్‌లు దొరుకుతాయి. దీని కాంతి మీద పడితే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ పెద్దగా ప్రమాదం ఉండదు. ఈ ఆకుపచ్చ లైట్ నేరుగా క ళ్ల మీద పడితే చాలా ప్రమాదం అట. కొద్దిసేపు కంటిచూపు పోతుందట. వెయ్యి రూపాయలకు దొరికే ఈ లైట్ ద్వారా రెండు కిలోమీటర్ల దూరం కూడా కాంతి పడుతుందట. స్టేడియాలలోకి గ్రీన్ టార్చ్ తేవడంపై నిషేధం ఉంది. మెస్సీ ఉదంతం నేపథ్యంలో ఇకపై మరింత జాగ్రత్తగా అభిమానులను తనిఖీ చేస్తారట.