breaking news
appoligises
-
"సర్కే చునార్" వివాదం : సంజయ్ దత్ క్షమాపణలు, దిద్దుబాటు చర్య
ఢిల్లీ, సాక్షి: "సర్కే చునార్ తేరీ సర్కే"పాటలో అశ్లీలత, మహిళలను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై వచ్చిన ఆందోళనలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం నటుడు సంజయ్ దత్ జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు జయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్‌కు లిఖితపూర్వక క్షమాపణను సమర్పించారు. ఈ విషంయంపై విచారం వ్యక్తం చేస్తూ, సృజనాత్మక కంటెంట్‌లో మహిళలకు బాధ్యతా యుతమైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను అంగీకరిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయంఒక దిద్దుబాటు చర్యగా, సామాజిక సంక్షేమానికి , మహిళా సాధికారతకు సానుకూలంగా దోహదపడే దిశగా, సంజయ్ దత్ 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించారు. ఇకపై, సినిమాలు మరియు సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులలో మహిళలు ,పిల్లలకు గౌరవప్రదమైన మరియు సముచితమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, తప్పనిసరి చట్టపరమైన నిబంధనలను చేర్చుతానని సంజయ్ దత్ కమిషన్‌కు హామీ ఇచ్చారు.ఈ విచారణ సందర్భంగా ఎన్సీడబ్ల్యూ అనేక అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ వివాదానికి సంబంధించి ఏప్రిల్ 6న దర్శకుడు, కిరణ్ కుమార్ అలియాస్ ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం , గౌతమ్ కె.ఎం. కెవిఎన్ ప్రొడక్షన్ ప్రతినిధులు కూడా ఎన్సీడబ్ల్యూ ముందు హాజరై క్షమాపణలు తెలిపారు. మరోవైపు నటి నోరా ఫతేహిని కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఆమె ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున హాజరు కాలేకపోయారు. ఆమె మరో తేదీని కేటాయించమని కమిషన్‌ను కోరారు.కాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన సినిమాలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట పెద్ద వివాదానికి దారితీసింది.ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ దుమారం చెలరేగడంతో జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సినిమా యూనిట్‌ను ఆదేశించింది. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ సాంగ్‌ను తొలగించారు. అర్జున్ జన్య స్వరకల్పనలో, మంగ్లి పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. -
సారీ చెప్పిన హీరోయిన్
ముంబైః మాట జారి తప్పు చేశానని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అంగీకరించింది. ట్విట్టర్ ద్వారా సరబ్జిత్ సింగ్‌పై అనుచితంగా వ్యాఖ్యానించినందుకు చింతిస్తున్నట్లుగా ఆమె పేర్కొంది. దీంతో పాటు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పింది. ఇలా క్షమాపణలు చెప్పడం చిన్నతనం కాదనీ, హుందాతనమని ఈ దబాంగ్ భామ పేర్కొంది. వివరాల్లోకి వెళితే సరబ్జిత్ సింగ్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నట్లుగా ఓ యువతి.. అతని ఫొటోని సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఈ బాలీవుడ్ భామ కూడా స్పందించింది. ఆ ఫొటోలోని వ్యక్తిని తిడుతూ కామెంట్ పోస్ట్ చేసింది. క్షణాల్లో ఈ ఫొటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు సరబ్జిత్ సింగ్‌ని అరెస్ట్ చేశారు. అయితే ఆ యువతి కావాలనే సరబ్జిత్ సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాలో వెల్లడించారు. దీంతో తప్పు తెలుసుకున్న సోనాక్షి తాను తొందరపడ్డానంటూ క్షమాపణలు తెలిపింది. Admitting a mistake and apologizing doesn't make anyone a smaller person...thats what I've been taught! https://t.co/3hQtJcPhHg — Sonakshi Sinha (@sonakshisinha) August 27, 2015


