వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
అప్పన్నపేట (గరిడేపల్లి) : వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. గరిడేపల్లి, మిర్యాలగూడ, మఠంపల్లి, చింతపల్లి మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. గరిడేపల్లి మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన దాసర్ల సైదులు, నిడమనూరుకు చెందిన గుంజ గోపాల్‌లు ద్విచక్ర వాహనంపై తమ బంధువుల ఇంటికి ఖమ్మం వెళుతున్నారు. ఈ క్రమంలో అప్పన్నపేట శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాసర్ల సైదులు (28) అక్కడికక్కడే మృతి చెందగా గుంజ గోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకు న్న పోలీసులు అక్కడకు చేరుకుని గోపాల్‌ను చికిత్స నిమిత్తం హు జూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్, డబ్బులను 108 సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించి తమ నిజాయితీ చాటుకున్నారు. దాసర్ల సైదులు తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఏఎస్ఐ ఎన్. జగన్మోహన్రెడ్డి తెలిపారు.
క్రేన్ ఢీకొని మేకల కాపరి..
మిర్యాలగూడ రూరల్: మిర్యాలగూడ పట్టణం శివారు రాంనగర్ కాలనీకి చెందిన ఆవుల మహేష్(20)బదలాపురం మేకల యజమాని వద్ద మేకల కాపరీగా పని చేస్తున్నాడు. ఉదయం 9 గంటల సమయంలో రోజు మాదిరిగానే మహేష్ మేకలను తోలుకుని రోడ్డు వెంట అటవికి వెళుతున్నాడు. కాగా మిర్యాలగూడ పట్టణం నుంచి అవంతీపురం వైపు వెళుతున్న క్రేన్ మేకలను తోలుకొని రోడ్డు వెంట వెళుతున్న మహేష్‌ను ప్రమాద వశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనతో తీవ్రగాయాలైన మహేæష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. మృతుడి తల్లిదండ్రులు పుల్లమ్మ, ముత్తయ్యలకు ఇద్దరు కొడుకులు కాగా మహేష్ చిన్నవాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరళించారు. ప్రమాదానికి కారణమైన క్రేన్ , డైవర్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు రూరల్ ఎస్సై కుంట శ్రీకాంత్ తెలిపారు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
ప్రమాదవశాత్తు కిందపడి ఉత్తర్‌ప్రదేశ్ వాసి..
మఠంపల్లి: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఖుషీ నగర్ జిల్లా సిద్ధియా బంగర్భట్ గ్రామానికి చెందిన మృతుడు కపిల్ సహాని సంవత్సర కాలంగా అదే పరిశ్రమలో కాంట్రాక్టర్ సిరాజుద్దీన్ వద్ద గ్యాస్ కట్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న మధ్యాహ్నం డ్యూటీ దిగి సరుకులు తెచ్చుకునేందుకు మఠంపల్లి వైపు వెళ్లాడు. తిరిగి అదేరోజు రాత్రి 10 గంటలకు ఎన్సీఎల్ మెయిన్ గేటు ముందు ఆటో దిగి నడుచుకుంటూ పరిశ్రమలోని బ్యారక్ సమీపంలో కాలుజారి కింద పడిపోయాడు. అయితే ఈ విషయమై రాత్రి తన రూం లోని మిత్రులతో తలనొప్పిగా ఉందని చెప్పి నిద్రపోయాడు. సోమవారం ఉదయం నిద్రపోయిన సహాని అలాగే మృతిచెంది ఉన్నాడు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కాంట్రాక్టర్ సిరాజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.