నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్
తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి-హీరోయిన్ అంజూ కురియన్ పెళ్లి చేసుకుంది. 2024 అక్టోబర్ నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు అంటే దాదాపు రెండేళ్ల తర్వాత వ్యాపారవేత్త రోషన్ కరిప్పపరంబిళ్తో కొత్త జీవితం మొదలుపెట్టేసింది. కేరళలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం శనివారం ఈ శుభకార్యం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అంజు షేర్ చేసింది.(ఇదీ చదవండి: పర్సనల్ వీడియో వైరల్.. నటి సురేఖావాణి సీరియస్)స్వతహాగా మలయాళీ అయిన అంజూ కురియన్.. తమిళ, తెలుగు సినిమాలు కూడా చేసింది. 2013లో 'నేరమ్' అనే మలయాళ మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. ప్రేమమ్, ఓం శాంతి ఓషానా తదితర మూవీస్లో సహాయ పాత్రలు పోషించింది. 'కవి ఉద్దేశించతు' అనే మూవీతో హీరోయిన్ అయిపోయింది. 2018లో 'ఇదం జగత్' అనే తెలుగు చిత్రంలోనూ హీరోయిన్గా చేసింది. రీసెంట్ టైంలో ఓహో ఎంతన్ బేబీ, అదర్స్, ఇదయం మురళి సినిమాల్లో కనిపించింది.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు హీరో సాయి దుర్గాతేజ్ ప్రేమలేఖ) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10)