పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్య
చిత్తూరు: పురుగులమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం వర్నాగెపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంజప్ప(30) బుధవారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. గురువారం ఉదయం గ్రామ శివారులో శవమై పడి ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
(వి.కోట)