breaking news
Anglo-Indian
-
టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ రాజీనామా
సాక్షి, గుంటూరు/విజయవాడ: క్రైస్తవ మతం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ శనివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుకు రాజీనామా పత్రాన్ని పంపారు. అనంతరం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు వైఖరి, ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మెడలో శిలువ వేసుకుని బైబిల్ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. చదవండి: (పేదలకు పథకాలందే వేళ ఎన్నికల కోడ్ తెస్తారా!) రామతీర్థం, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలకు క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. రాజకీయాల కోసం క్రైస్తవులను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా చంద్రబాబు పార్టీలో ఎలా కొనసాగుతున్నారంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. క్రైస్తవులను అవమానాలకు గురిచేస్తున్న టీడీపీ, చంద్రబాబు వైఖరి నచ్చక పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఫిలిప్ సి తోచర్ 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. చదవండి: (పక్కా కార్యాచరణతో ముందుకు) -
ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడిగా స్టీఫెన్సన్ నియామాకం
-
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా ఫిలిప్ సి థోచర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభలో ఆంగ్లో ఇండియన్ కోటా కింద ఎమ్మెల్యేగా ఫిలిప్ సీ థోచర్ను గవర్నర్ నరసింహన్ నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు కన్నావారితోటకు చెందిన 65 ఏళ్ల ఫిలిప్ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్లో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గ్రాడ్యుయేషన్ చదివిన ఫిలిప్‌కు భార్య డయానా, కుమారుడు అశాధ్ అబ్రహాం, కుమార్తె ఎలీనా ఉన్నారు. టీడీపీలో 32 ఏళ్లుగా క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసినందుకుగాను తనకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి వరించిందని ఫిలిప్ తెలిపారు. -
అంగ్లో ఇండియన్‌కు మరో ఎమ్మెల్యే పోస్టు..