anger therapy
-
కోపానికి టాటా చెప్పేద్దాం!
కోపం వలన గుండె సంబంధిత జబ్బులు రావచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. చిన్నపాటి కోపమైనా సరే అది రక్తనాళాలను ప్రభావితం చేయడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక జీవన శైలి వలన ఇప్పటికే పలు రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. సీటులో నుంచి కదలకుండా ఒకేచోట స్థిరంగా కూర్చోవడం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వలన గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అనుకోకుండా వచ్చే కోపం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.కేవలం ఎనిమిది నిమిషాల పాటు ఉండే కోపం అనే భావోద్వేగం వల్ల రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం దాదాపు సగానికి తగ్గిపోతుంది. అంతే కాదు కేవలం 8 నిమిషాల పాటు వచ్చే కోపం వలన దాని ప్రభావం 40 నిమిషాల వరకు ఉంటుందని గుర్తించారు. దీనితో పాటు ఎక్కువ కోపంగా ఉండటం వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.పరిశోధనలో అసలేం తెలుసుకున్నారు?అమెరికాలోని వివిధ సంస్థల నిపుణులు చేసిన పరిశోధనలో దాదాపు 300 మంది ఆరోగ్యంగా ఉన్నటువంటి పెద్దవయస్సు వారిని ఎనిమిది నిమిషాల పాటు కోపంగా ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతూ అధ్యయనం చేశారు. దీని ద్వారా వారు పొందిన ఫలితాలను బట్టి ఈ అధ్యయనం చేశారు. అయితే, విచారం లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు గుండె ఆరోగ్యంపై ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే...బాగా కోపం వచ్చినప్పుడు లోతుగా డీప్ బ్రీత్ తీసుకోవడం లేదా 10 వరకు అంకెలు లెక్కపెట్టడం బెటర్. కోపం కలిగించే వ్యక్తులకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి.రెగ్యులర్‌గా వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి.రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు మంచి నిద్ర, విశ్రాంతి అవసరం. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ధ్యానం లేదా యోగా రెగ్యులర్‌గా చేయడం అలవాటు చేసుకోవాలి. మీ కొలెస్ట్రాల్ లెవల్స్ మేనేజ్ చేసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి. చదవండి: ముప్పై ఏళ్లకే ఎముకలు గుల్లబారుతున్నాయి -
'నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను'
నా వయసు 34 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ. చిన్న విషయాలకే ఒళ్లు తెలియని కోపంతో చేతిలో ఏది ఉంటే దానితో కొట్టడం, ఖరీదైన ఫోన్లు, టీవీలు పగలగొట్టడం జరుగుతోంది. కోపావేశంలో నా ముందున్న వ్యక్తి ఎవరు అనే ఆలోచన లేకుండా దాడి చేసే పరిస్థితి వస్తోంది. దీనివల్ల నా భార్య, పిల్లలు చాలా భయపడుతున్నారు. కోపం తగ్గిన తరువాత చాలా బాధ, పశ్చాత్తాపం ఉంటాయి. కానీ ఆ సమయంలో మాత్రం నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నాకు ఇతర మానసిక, శారీరక సమస్యలు ఏవీ లేవు. ఒకసారి మానసిక వైద్యుడిని కలవాలని అనుకుంటున్నాను. నాకు ఉన్న ఈ సమస్యకు సరైన చికిత్స లేదా పరిష్కారం ఉందా?– రవికుమార్, హిందూపూర్మీ సమస్యను ఇతరుల మీద నెట్టకుండా, మీరే బాధ్యత తీసుకుని మారాలనుకోవడం నిజంగా అభినందనీయం. మీరు వివరించిన లక్షణాలను వైద్య పరిభాషలో ఇగో డిస్కంట్రోల్ సిండ్రోమ్ (ego dyscontrol syndrome) లేదా ఇంటర్మిటెంట్ ఎక్స్‌ప్లోసివ్ డిసార్డర్ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారు చాలా చిన్న విషయాలకే అసాధారణమైన కోపం, ఆవేశానికి గురవుతారు. ఆ సమయంలో తనపై పూర్తిగా నియంత్రణ కోల్పోయి విలువైన వస్తువులను పగలగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, మాటలతో లేదా చర్యలతో ఇతరులపై దాడి చేయడం వంటి ప్రవర్తనలు చేస్తాడు. కోపం తగ్గిన తరువాత మాత్రం పశ్చాత్తాపం, తప్పు చేశాననే భావన ఎక్కువగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం, ఇలాంటి వ్యక్తుల మెదడులో సెరటోనిన్ (Serotonin) అనే రసాయనం తక్కువ స్థాయిలో ఉండటం గమనించవచ్చు. ఇది చాలా సందర్భాల్లో జన్యుపరంగా వచ్చే సమస్యగా కూడా ఉండవచ్చు. అంటే, సెరటోనిన్ తయారు చేసే వ్యవస్థలోనే లోపం ఉండే అవకాశం ఉంది.అలాగే వారు పెరిగిన వాతావరణం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, కొన్ని అలవాట్లు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే అమీగ్డాలా, ఫ్రాంటల్ కార్టెక్స్ వంటి భాగాలు సరిగా పనిచేయకపోయినా కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమస్యకు పూర్తిగా చికిత్స ఉంది. సైకోథెరపీ, కోప నియంత్రణ చికిత్స లతోపాటు, మెదడులో సెరటోనిన్ స్థాయిని పెంచేందుకు తగిన మందులను, మనసుని స్థిమితపరిచే మూడ్ స్టెబిలైజర్స్ వంటి మందుల్ని వైద్యుల పర్యవేక్షణలో వాడడం వలన మంచి మెరుగుదల కనిపిస్తుంది.చదవండి: కొలీగ్‌పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. ఏం చేయాలి?సమయానికి చికిత్స తీసుకుంటే, కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యం అవుతుంది. దీనిద్వారా కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు. ఈ సందర్భంగా మనసుకవి ఆత్రేయ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా’. విరిగిన వస్తువుల్ని అతికించవచ్చు, లేదా మళ్ళీ సంపాదించొచ్చు. కానీ విరిగిన మనసులని, దూరం అయిన బంధాలని మళ్ళీ దగ్గరగా చేసుకోవాలంటే దానికి చాలా శ్రమ అవసరం. కోపాన్ని జయించినవాడే తన జీవితాన్ని జయిస్తాడు అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసినమెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
కోపం రావడం కూడా మంచిదే! ఇలా చేస్తే విజయం మీదే!
ప్రేమ, అభిమానం, ఈర్ష్య, ద్వేషం లాగే కోపం కూడా ఓ సహజ, సహజాత ఉద్వేగం. యాంగర్ మేనేజ్మెంట్ అని దాన్ని చంపుకోవడం కంటే... ఎలా ఛానలైజ్ చేస్తే, దాన్నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటే మంచిదంటున్నారు మానసికవేత్తలూ, ప్రవర్తన శాస్త్రవేత్తలు. నిజానికి కోపం అన్నది పట్టుదలకు మొదటిమెట్టు. భయం ప్రాణరక్షణకు ఉపయోగపడినట్టే... కోపం పట్టుదలకు కారణమై, ఎట్టకేలకు సక్సెస్‌ను సాధించి పెడుతుంది. అంటారు సైకాలజిస్టులు. అదెలాగో చూద్దాం. చాణక్యుడి చతురత మొదలుకొని, ఫ్రెంచి విప్లవం వరకు తొలి దశలోని కోపం... తొలుత పట్టుదలగా మారి... తర్వాత వివేచనతో కూడిన వ్యూహం వల్ల మంచి ఫలితాలను ఇచ్చిన సంగతి చరిత్ర చూసిందే. ఇక్కడ ఓ మంచి మార్పు కోసం ప్రజలు తమ యాంగర్‌ను మోటివేటింగ్ అంశంగా చేసుకున్నారన్నది మానసిక విశేషజ్ఞుల విశ్లేషణ. ఎప్పటి చాణక్యాలో, మరెక్కడి ఫ్రెంచి విప్లవాలో కాదు... ఉప్పు సత్యాగ్రహాలూ, దండి యాత్రలతో మన స్వాతంత్య్రం కూడా ఈ శతాబ్దపు మన ఆగ్రహ విజయ ఫలితమే. ‘ఆగ్రహం నుంచి ఆనందానికి దారి తీసే మంచి దారే మన కోపం’ అని చెబుతున్న ఓ సైకాలజిస్ట్... ఆగ్రహం ప్రభావాన్ని ఇలా వివరిస్తున్నాడు. ‘‘కోపం మొదట మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రేరేపించి స్ఫూర్తిని పుట్టిస్తుంది. పట్టుదల పెంచి విజయం సాధింపజేస్తుంది. చివరగా సంతోషాన్నిస్తుంది. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే యాంగర్ క్రియేట్స్ ఇంపాక్ట్. ఇట్ మొబిలైజెస్, లీడ్స్ టు విక్టరీ దేర్ బై గివ్స్ హ్యాపీనెస్’’. ‘యాంగ్రీ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్’ ఆశావహ దృక్పథానికి ఆగ్రహమే మార్గం... ‘యాంగ్రీ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్’ అన్నది మనోవిశ్లేషకుల మరో మాట. నలుగురు స్టుడెంట్స్ ఒకే రూమ్‌లో చదువుకుంటూ ఉండేవారు. వాళ్లలో ఒకడికి ఓ రేంజ్ మంచి ర్యాంకే వచ్చింది. ఆ ర్యాంకుకు ఆనందించిన ఆ తండ్రి, కొడుక్కి అదే రాష్ట్రంలో సీట్ వచ్చే అవకాశం లేకపోయినా... పక్కరాష్ట్రంలోని ఓ మోస్తరు మంచి కాలేజీలో మెడిసిన్‌లో చేర్పించాడు. దాంతో తమ మీద తమకే కోపం వచ్చిన ఆ ముగ్గురూ... లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరారు. బాగా చదివారు. దాంతో ఆ ముగ్గురూ సొంతరాష్ట్రంలోనే ఫ్రీ సీట్ సాధించారు. కాస్త ధనవంతుడైన తండ్రికి పుట్టిన మొదట సీటు సాధించిన మిత్రుడి కంటే... తమ కోపం కారణంగా ఇంకా మంచి కాలేజీల్లో, ఇంకా కాస్త చవకగా చదువుకుంటున్నారా మిగతా ముగ్గురు మిత్రులు. అనేక విజయ వ్యూహాలకు కోపమే కీలకం... కోపాన్ని ఓ ప్రతికూల ఉద్వేగంగా భావిస్తారు. కానీ విజయం సాధించాలనే పట్టుదలకు కావాల్సిన వ్యూహాలను ఆలోచించేలా చేస్తుంది ఆగ్రహం. అయితే కత్తికి లాగే కోపానికీ రెండు అంచులుంటాయి. వివేకం కోల్పోయిన క్రోధం... పన్నాగాలకు దిగుతుంది. వివేచనతో కూడిన కోపం వ్యూహాలతో విజయాలందిస్తుంది. ఉగ్రతకు ఆస్కారమివ్వకుండా ఆగ్రహాన్ని జాగ్రత్తగా ఛానెలైజ్ చేసుకుని గెలుపెలా సాధించాలో తెలుస్తుంది. తనలోకి తాను చూసుకునేందుకు ఓ సాధనం తనలోకి తాను తొంగి చూసుకుని, అంతర్మధనంతో, ఆత్మపరిశీలనకు తావిచ్చేది కూడా కోపమే అంటారు జెరెమీ డీన్ అనే సైకాలజీ స్కాలర్. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ నుంచి డాక్టరేట్ పొందిన ఆయన ‘‘మేకింగ్ హ్యాబిట్స్, బ్రేకింగ్ హ్యాబిట్స్’’ అనే పుస్తకం రాశారు. మానసిక అంశాలపై బ్లాగ్ కూడా నిర్వహిస్తుంటారు. ఓ సంఘటన మనలో కోపానికి కారణమైందనుకోండి. అప్పుడు మన ఆగ్రహం సహేతుకమైనదేనా?, మన చేతగానితనం వల్ల కోపం వచ్చిందా?... ఇలా ఆత్మపరిశీలన చేసుకోవడం మానసిక ఔన్నత్యానికీ కారణమవుతుందంటారాయన. మరి అంతా మంచేనా... ఇలా చూసుకున్నప్పుడు ఆగ్రహం వల్ల అంతా మంచే జరుగుతుందా? చెడు జరగదా అంటే... కోపం వల్ల చెరుపు జరిగే అవకాశమూ ఉంది. అయితే ఆగ్రహంతో కూడిన ఉన్మాద స్థితిలో మంచికీ, చెడుకూ మధ్య తేడా గుర్తించలేనంత వివేచన కోల్పోయినప్పుడు మాత్రమే ఆగ్రహం వల్ల అనర్థం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు మానసికవేత్తలు. అందువల్ల వివేచన కోల్పోనంత వరకు కోపం కూడా మిత్రుడే! చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
జిహాదీ జాన్‌కు యాంగర్ థెరపీ..
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్‌కు అతడు చదువుకున్న పాఠశాలలోని ఉపాధ్యాయులు కోపాన్ని నియంత్రించుకునే థెరపీ (యాంగర్ థెరపీ) ఇచ్చారట. నిరంతరం అతడు తోటి విద్యార్థులతో అనవసరంగా గొడవపడుతుండటం చూసి ఈ థెరపీని ఇచ్చినట్లు లండన్‌లోని క్వీన్స్ పార్క్‌లోగల క్వింటిన్ కినాస్తోన్ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పాఠశాలలో అతడు సెకండరీ ఎడ్యుకేషన్ చదివాడు. జిహాదీ జాన్ విజయాన్ని అందుకునేందుకు నిరంతరం తపించేవాడని, నిజంగా లవ్ లీ, లవ్ లీ, లవ్ లీ బాయ్ అని వారన్నారు. అందరిని చాలా బాగా గౌరవించేవాడని, తనకొచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని సంపాధించుకుని పాఠశాల వెలుపల అడుగు పెట్టాడని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు క్రూరంగా హత్యలు చేయడం చూసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. బ్రిటన్, అమెరికాతోపాటు పలు దేశాల్లోని వారిని బంధీలుగా పట్టుకెళ్లి క్రూరంగా జిహాదీ జాన్ హతమారుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె అతడి అసలు పేరు మహమ్మద్ ఎంమ్వాజీ అని తెలిసింది.


