breaking news
Andhra Pradesh Farmers Union
-
రాష్ట్రంలో చెత్త పాలన సాగుతోంది
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చెత్తపాలన సాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు విమర్శించారు. హనుమంతరాయ గ్రంథాలయంలో ‘మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు మార్చాలని’ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూములపై ఆంక్షలు విధించి ధరలు అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పచ్చదనం, వ్యవసాయ పరిరక్షణ అంటూ ముద్దు పేర్లతో రైతులను మోసగిస్తోందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 42 మండలాల్లో అగ్రికల్చర్ జోన్ పేరిట అంక్షలు విధించిందన్నారు. 800 గ్రామాల్లో సుమారు 13 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ పరిరక్షణ జోన్ పరిధిలోకి వస్తుందన్నారు. ప్రభుత్వం సింగపూర్, జపాన్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసి రైతులను విస్మరిస్తోందన్నారు. మాస్టర్ ప్లాన్, అభ్యంతరాలపై విడుదల చేసిన నోటిఫికేషన్‌పై రైతులకు అవగాహన ఉండకూడదనేదే చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశమన్నారు. మాస్టర్‌ప్లాన్‌పై ప్రభుత్వం అవగాహన సదస్సులు ఏర్పాటుచేసే లోపే రక్షణ వేదిక ఆధ్వర్యంలో 42మండలాల్లో యాత్రలు నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరి 10లోపు నియోజకవర్గస్థాయి యాత్రలు, 20లోపు మండలస్థాయి సదస్సులు, 29 నాటికి అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం పది అవగాహన సదస్సులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని, వ్యవసాయ పరిరక్షణ జోన్‌గా ప్రకటించిన అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించేలా ఒత్తిడి తీసుకువస్తామన్నారు. నిబంధనలు మార్చాలి రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.కేశవరావు మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు సమూలంగా మార్చాలని డిమాండ్‌చేశారు. రైతుల అభ్యంతరాలను ప్రతి మండలంలో స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. పరిరక్షణ జోన్ నిబంధనలు తెలుగులో అనువదించి ప్రతి పంచాయతీ కార్యాలయంలో రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. మాస్టర్‌ప్లాన్‌ను స్వదేశీ నిపుణులు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు, రైతు సంఘాలతో చర్చించి రూపొందించాలని డిమాండ్‌చేశారు. -
వ్యవసాయాభివృద్ధికి కృషిచేయాలి
బొబ్బిలి రూరల్ : చంద్రబాబు ప్రభుత్వం రైతులపై మోసపూరిత ప్రకటనలు మానాలని, ఖరీఫ్‌లో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ కోరారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం అయినా ఇంతవరకు ప్రభుత్వం స్టేట్‌లెవెల్ బ్యాంకర్ల సమావేశం ఏర్పాటుచేయలేదని, రాష్ట్ర రుణప్రణాళిక ప్రకటించలేదని, ఖరీఫ్ ఏక్షన్‌ప్లాన్ ప్రకటించలేదని, నాబార్డు సేటస్ పేపరు విడుదల చేయలేదని మండిపడ్డారు. జిల్లాస్థాయిలో 1,20,000 హెక్టార్లలో లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా ఏపీసీడ్స్ ద్వారా కేవలం 40శాతం విత్తనాలను మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. ఇంత వరకు రుణమాఫీ కేవలం రాజకీయ ప్రకటనే అయ్యిందని, ఎవరికీ న్యాయం జరగలేదని, కొత్తరుణాలు రైతులకు పుట్టడంలేదని, ప్రైవేటు అప్పులు 7,8 రూపాయల వడ్డీకి దొరుకుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన సహాయం,సహకారం అందడంలేదని, వ్యవసాయాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిరుత్సాహ పరుస్తున్నాయని ఆరోపించారు. పొలం పిలుస్తోందంటూ చంద్రబాబు హడావిడి ప్రకటనలు, కార్యక్రమాలు చేయడం వల్ల రైతులకు ఒరిగిందేమీలేదని, రుణమాఫీ, రాయితీపై విత్తనాలు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లాలో ఏర్పాటుచేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలలో ఇంతవరకు చెల్లింపులు జరపలేదని,ఎన్సీఎస్ యాజమాన్యం చెరుకు బకాయి లుచెల్లించకపోయినా రైతులకు ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విత్తనాలను సర్పంచ్ల ద్వారా రైతులకు పంపి ణీ చేయాలని తలంపుచేస్తోందని, ఇలా అయితే రాజకీయ కారణాలతో రైతులకు అందే అవకాశం ఉండదని, అలాంటి ఆలోచనలను ప్రభుత్వం మానుకోవా లని లేకుంటే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు వి.చిన్నంనాయుడు, గంట సింహాచలం పాల్గొన్నారు. -
అధికారులను నిలదీసిన రైతులు
అనంతపురం అర్బన్ : ‘మామిడి మొక్కలు పెంచడానికి అప్పుల చేసి ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోస్తున్నాం.. నాలుగు నెలలైనా నీటి సరఫరా, గుంతలు తవ్విన బిల్లులు ఇవ్వలేదు.. అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తామని కాల యాపన చేస్తున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ భవనం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా (డీడబ్ల్యూఎంఏ) బకా యి పడ్డ బిల్లులు వెంటనే చెల్లించాలని బైఠాయిం చారు. ఆందోళనకారులు రెవెన్యూ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఒకటవ పోలీసు స్టేషన్ ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి తమ సిబ్బందితో రైతులను అడ్డుకున్నారు. డ్వామా పీడీ నాగభూషణం రైతులకు సర్దిచెప్పడానికి యత్నించినా వా రు ససేమిరా అన్నారు. కలెక్టర్‌తోనే తాము మాట్లాడతామని మొండికేశారు. చివరకు కలెక్టర్ వారిని పిలిపించారు. రైతులు మాట్లాడుతూ మొ క్కలకు ట్రాక్టర్ల ద్వారా నీళ్లను సరఫరా చేయిం చాం.. ట్రాక్టర్ల యాజమానులు బిల్లులు ఇవ్వకపోతే నీటిని సరఫరా చేయబోమని చెబుతున్నార ని కలెక్టర్‌కు తెలిపారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లిం చాలన్నారు. లేకపోతే జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తామన్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏపీ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు ఎంకె. వెంకటరెడ్డి ఆధ్వర్యం లో సుమారు 200 మంది రైతులు పాల్గొన్నారు. వృద్ధుల గోడు పట్టించుకునేవారెవరు? ఏ అధికారికి విన్నవించినా తమ గోడు వినిపించుకోవడం లేదని, నేరుగా కలెక్టర్‌ను కలసి తమ బాధలను వివరించి సాయం పొందాలని వచ్చిన సుమారు 50 మంది వృద్ధులకు నిరాశ ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి. హిందూపురం మునిసిపాలిటీ పరిధిలోని 37వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బీ నాగభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పింఛను కోల్పోయిని ముదిరెడ్డిపల్లి వృద్ధులు మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్‌ను కలి సేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. రెవెన్యూ భవన్‌లోకి వెళ్లకుండా వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వృద్ధులు దాదాపు 3 గంటల సేపు అధికారులు పిలుస్తారని వేచి ఉన్నారు. అనంతరం రెవెన్యూ భవనం నుంచి బయటకు వెళ్తున్న కలెక్టర్ వద్దకు వెళ్లారు. తాము పింఛన్లకు అర్హులమేనని, అధికారులకు తమ బాధలు వివరించినా పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు వివరించారు. విచారణ చేసి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ మిమ్మల్ని ఎవరూ తీసుకువచ్చారని ప్రశ్నించారు. తమ వార్డు కౌన్సిలర్.. అని వారు చెప్పడంతో అక్కడే ఉన్న కౌన్సిలర్ నాగభూషన్రెడ్డితో కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్లు వస్తాయిలే.. ‘వృద్ధులకు ఏదో ఒకటి మీరే సర్దిచెప్పండి’ అంటూ అర్జీ కూడా తీసుకోకుండా ఆయన వెళ్లిపోయారు. దీంతో వృద్ధులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనిపై కౌన్సిలర్ నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ అక్కడ స్థానిక అధికారులు స్పందించకపోవడంతో ఇక్కడైన న్యాయం జరుగుతుందని వస్తే కలెక్టర్ ఇలా సమాధానం చెప్పడం బాధకరమని ఆవేదన వ్యక్తం చే శారు. అర్హులైన వారికి పింఛన్లు అందేలా న్యాయ పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు. కమిటీలో వివక్షపై సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఫిర్యాదు : గ్రామ స్థాయి కమిటీల్లో తమకు చోటు ఇవ్వకుండా టీడీపీ నాయకులే నిర్ణయాలు తీసుకుంటున్నారని ైవైఎస్సార్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ గ్రామ స్థాయి కమిటీలో సర్పంచే అధ్యక్షుడా..? సర్పంచ్ అధ్యక్షతన సామాజిక భద్రత పింఛన్లు జాబితా.. తయారు అవుతుందా..? అని ఆయన ఎదురు ప్రశ్నించడంతో వారు ఆశ్చర్యపోయారు. పైగా మీరు పార్టీ సింబల్‌పై గెలువలేదు కదా..? అలాటప్పడు మీరు రాజకీయాలు చేయడం ఎందుకని సర్పంచులను కలెక్టర్ ప్రశ్నించడంతో వారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు నరసింహరెడ్డి, సుగుణ, నాగరత్నమ్మ, సుహాసన, ఉదేప్ప, తిక్కమ్మ, ఎంపీటీసీలు యల్ల క్క, లక్ష్మిదేవమ్మ, తదితరులు మాట్లాడుతూ గ్రామ స్థాయి కమిటీల్లో సర్పంచ్ అధ్యక్షుడుగా, గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా ఎంపీటీసీ, డ్వాక్రా సంఘాల నుంచి ఇద్దరు, సామాజిక కార్యకర్తలు ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారని తెలిపారు. సామాజిక భద్రత పింఛన్లో, దీపం పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక జాబితాను ఈ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఈ కమిటీలో టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఉండకూడదని, ఏలాంటి నిర్ణయాధికారం వీరికి లేదని ఇటీవల హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపిందన్నారు. అయినప్పటికీ అధికారులు ఈ విషయంపైన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో టీడీపీ నాయకులు, తమ నిర్ణయాలు ప్రకారం జాబితా తయారు చేస్తున్నా విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేదన్నారు. దీనిపై తాడోపేడో తేల్చుకుంటామన్నారు. అధికారులు తప్పక హాజరు కావాలి.. కలెక్టర్ ప్రతి అధికారి మీ కోసం కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహించిన మండల, డివిజన్ స్థాయి మీ కోసం కార్యక్రమాన్ని కలెక్టర్ రెవెన్యూ భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో 802 అర్జీలు అందాయి. వాటిని క్యాటగిరి వారిగా విభజించి ఆయా శాఖలకు ఆర్జీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జే సీ లక్ష్మీకాంతం ఏజేసీ ఖాజామొహిద్దీన్ , డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్, జెడ్పీసీఈఓ రామచంద్ర, ఆర్డబ్య్లూఎస్సీ కాంతనాథ్, హౌసింగ్ పీడీ ప్రసాద్ తదితరులు వినతులు స్వీకరించారు.