breaking news
	
		
	
  ambergris
- 
      
                   
                               
                   
            రూ.31.67 కోట్ల అంబర్గ్రిస్ స్వాధీనం
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు తమిళనాడులోని ట్యుటికోరన్లో అత్యంత ఖరీదైన అంబర్గ్రిస్(తిమింగలం వాంతి)ని పట్టుకున్నారు. ట్యుటికోరన్లోని హార్బర్ బీచ్ ఏరియా నుంచి శ్రీలంకకు ఓ ముఠా అంబర్గ్రీస్ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ వాహనంలో తరలిస్తున్న 18.1కిలోల బరువైన అంబర్ గ్రిస్ సంచీ దొరికింది. ఇందుకు సంబంధించి తమిళనాడు, కేరళలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనమైన అంబర్గ్రిస్ విలువ రూ.31.67 కోట్లని అంచనా. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడే అంబర్గ్రిస్కు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం స్పెర్మ్ వేల్ ఉత్పత్తుల ఎగుమతి, రవాణాలపై నిషేధం ఉంది. గత రెండేళ్లలో ట్యుటికోరన్ తీరంలో స్మగ్లర్ల నుంచి రూ.54 కోట్ల విలువైన 40.52 కిలోల అంబర్గ్రిస్ను పట్టుకున్నట్లు డీఆర్ఐ తెలిపింది. - 
      
                   
                               
                   
            రూ. 31 కోట్ల విలువైన తిమింగలం అంబర్గ్రిస్ స్వాధీనం
చెన్నై: అంతర్జాతీయ మార్కెట్లో లో కోట్ల రూపాయల విలువైన తిమింగలం వీర్యం (అంబర్గ్రిస్)ను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. దీన్ని స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు సభ్యులతో కూడిన ముఠాను సైతం అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ రూ. 31.6 కోట్లు ఉంటుందని అంచనా. అత్యంత విలువైన అంబర్గ్రిస్ను సముద్రమార్గంలో తరలించే క్రమంలో సమాచారం అందుకున్న అధికారులు టుటికోరిన్ సీ కోస్ట్ వద్ద పట్టుకున్నారు. విదేశాల్లో భారీ డిమాండ్ తిమింగలాలు చేపలు తినే సమయంలో దాని వీర్యం బయటకు విసర్జిస్తుంది. దీనికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. తమింగలాలు ఎక్కువగా వాటి వీర్యం విసర్జించిన కొన్ని గంటల తరువాత ఆ వీర్యం రాయిలాగా మారిపోయి సముద్రంలోని నీటిలో తేలుతుందట. ఔషధాలు, సుగంధ ద్రవ్యాల్లో వినియోగం ఔషదాలు, సుగంధద్రవ్యాలు అంబర్గ్రిస్ను ఎక్కువగా ప్రయోగాల కోసం, ఔషదాలు, సుగంధద్రవ్యాలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తారట. ఇది అత్యంత విలువైనది కావడంతో స్మగ్లర్లు అత్యంత చాకచక్యంగా దీన్ని విదేశాలకు తరలిస్తూ ఉంటారు. అలా తమిళనాడు నుంచి విదేశాలకు తరలించే క్రమంలోనే ఆ స్మగ్లింగ్ ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: DRI arrested 4 smugglers and seized 18.1 Kg whale ambergris worth Rs 31.6 crores, near the Tuticorin Sea coast: Customs (Video source: Customs pic.twitter.com/b2FAH5hgVz — ANI (@ANI) May 20, 2023 


