breaking news
Akella Raghavendra
-
చదివితే ఐఏఎస్ విద్యార్థిలాగే
1973–75 కాలంలో ఓ పక్క వైద్యం, ఇంకోపక్క కుటుంబం. ఇక ఖాళీ సమయమంతా పుస్తక పఠనం ఇంతే. మరో వ్యాపకమే ఉండేది కాదు వైఎస్‌కి. పులివెందులలో జిల్లా శాఖా గ్రంథాలయం ఒకటుంది. ఆ గ్రంథాలయం కేరాఫ్ అడ్రస్సయ్యింది. అక్కడ కూర్చుని– చరిత్ర, సమాజం, రాజకీయాలకు చెందిన పుస్తకాలతో పాటు ఇంగ్లిష్ ఫిక్షన్ కూడా చదివేవాడు. హెరాల్డ్ రాబిన్స్ రచించిన ‘ది ఎడ్వెంచరర్స్’, మారియో ఫ్యుజో రచించిన ‘ద గాడ్‌ఫాదర్’ లాంటి పుస్తకాలు వైఎస్ ఆ రోజులలో చదివినవే. చదవడం మొదలుపెడితే వైఎస్‌కి పుస్తకమే ప్రపంచమైపోయేది. బయటి ప్రపంచం కనిపించకుండా పోయేది. వైఎస్ కాన్సంట్రేషన్ అలాంటిది. అసెంబ్లీలోనో, మరో చోటనో ప్రసంగించేందుకు తయారు చేసుకునే స్పీచ్‌లకు ప్రిపేరయ్యేటప్పుడు కూడా అంతే. తలుపులు వేసేసుకొని గంట రెండు గంటలపాటు ఎవరినీ లోపలికి రానివ్వకుండా, ఎవరూ తనను డిస్టర్జ్ చేయకుండా– ఎంసెట్‌కో, ఐఏఎస్‌కో ప్రిపేరయ్యే సీరియస్ స్టూడెంట్‌లా ఏకాగ్రతతో ప్రసంగ పాఠాల్ని పఠించిన సందర్భాలు అనేకం. -ఆకెళ్ల రాఘవేంద్ర (‘దటీజ్ వైఎస్ఆర్’ లోంచి) సాహిత్యం పట్ల వైఎస్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కళాకారులు, సాహితీవేత్తల పట్ల కులం, వర్గం, మతాలతో నిమిత్తం లేకుండా గౌరవాన్ని ప్రదర్శించేవారు. షేక్ హుసేన్ సత్యాగ్ని, శశిశ్రీ(షేక్ రహమతుల్లా) లాంటి రచయితల్ని ఎంతో ప్రోత్సహించారు. కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధికీ, అది నిలదొక్కుకోవడానికీ ఎంతగానో సహకరించారు.-కేతు విశ్వనాథ రెడ్డి తెలుగుకు ప్రాచీన హోదా గురించి ఆయనకు ఎలాంటి ఆలోచనలుండేవోగానీ భాష అభివృద్ధి చెందుతుంది అని ఓ సందర్భంలో చెప్పినప్పుడు వెంటనే సీరియస్‌గా తీసుకున్నారు. రెండ్రోజుల్లోనే దాని గురించి కమిటీ వేశారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కడానికి కృషి చేశారు. ఇంగ్లిషు నేర్చుకోవాలి, తెలుగు తప్పకుండా చదువుకోవాలి అనేవారు. -డాక్టర్ ఎల్వీకే 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన దీక్షకు మద్దతుగా కవిసమ్మేళనం జరిగింది. ఆయన అందరి కవితలనూ ఎంతో శ్రద్ధగా విన్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి కవిత్వానికి ఉందని నమ్మిన మనిషి ఆయన. ఒక పుస్తకం ఇస్తే దాని సారాన్ని ఇట్టే గ్రహించగలిగేవారు.-కందిమళ్ల భారతి -
సమీక్షణం: సాఫల్య జీవన దృశ్యాలు
పుస్తకం : చెరగని ముద్రలు (వ్యాసాలు) రచన : ఆకెళ్ల రాఘవేంద్ర పేజీలు: 168 (హార్డ్‌బౌండ్); వెల: 249 ప్రతులకు: నవోదయా, ఇతర ప్రధాన పుస్తకకేంద్రాలు విషయం : సాక్షి ఫన్డేలో ‘రాలిన మొగ్గలు’ పేర ధారావాహికంగా ప్రచురింపబడిన యాభై రెండు జీవితాల చెరగని ముద్రలు ఈ వ్యాసాలు. జీవితం ఎంత చిన్నదైనా దానికొక అర్థం, పరమార్థం, లక్ష్యం ఉన్నవాళ్లు మరణానంతరం కూడా జీవిస్తారు. ఈ సంపుటిలో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచంలో జీవితాన్ని ఆదర్శవంతంగా, స్ఫూర్తిప్రదాయకంగా గడిపినవారి జీవన దృశ్యాలు కనిపిస్తయి. సాహిత్యం, సంగీతం, చిత్రకళ నటనా రంగాలకు చెందినవారితో పాటు, సుప్రసిద్ధులైన ఆధ్యాత్మిక, తాత్విక వేత్తలు, చారిత్రక వ్యక్తులు, దేశభక్తులు ఈ సంపుటిలో ఉన్నారు. పదహారు సంవత్సరాల వయసులోనే ఈ విశ్వం మీద చెరగని సంతకం చేసి వెళ్లిపోయిన జోన్ ఆఫ్ ఆర్క్, యాన్ ఫ్రాంక్‌లతో పాటు మనకు పేర్లు మాత్రమే తెలిసిన ధన్యజీవుల జీవన గమనాన్ని చదువుతూ మన జీవితాన్ని యే విధంగా ఉపయోగిస్తున్నామని ప్రశ్నించుకుంటాం. ప్రతి వ్యాసంలో ఒక రాలిన మొగ్గ ఫొటో, ఆ వ్యక్తి గడిపిన కాలం, భౌతికంగా మరణించిన వయసుతో పాటు, పరిచయం, ప్రభావం, ఘనత, వేషభాషలు తెలిపే సంక్షిప్త వ్యాసాలున్నాయి. కవయిత్రి తోరుదత్ జీవితం ‘ముహుర్తా జ్వలితం శ్రేయో, నతు ధూమాయితం చిరం’ (పే.73)తో మొదలైతే, విప్లవ వనిత ప్రీతిలత వడేదార్ జీవితం క్లైమాక్స్‌తో మొదలవుతుంది. స్వామి వివేకానంద జీవిత చిత్రం ‘స్వామీ! ఈ దేశంలోని యువతీ యువకుల కండరాల్లోని ప్రతి కణంలోనూ నీ దేహపు ప్రత్యణువునీ ప్రవహించనీ. నిప్పుకణికలై ప్రజ్వరిల్లనీ’ (పే.38) అనే వాక్యాలతో పూర్తయితే, ఇరవై నాలుగేళ్ల వయసులో ఉరితీయబడ్డ భగత్‌సింగ్ జీవితం ‘ఈ వయసువాళ్లు ఈనాడు ఏం చేస్తున్నారు?’ అన్న వాక్యంతో పూర్తవుతుంది. వైవిధ్యం ఉన్న ప్రారంభం, ముగింపుల మధ్య ఆయా జీవితాలలో మలుపులు, సంఘటనలు వివరించిన విధానం ఆసక్తిని, కుతూహలాన్ని కలిగిస్తుంది. - చింతపట్ల సుదర్శన్ కథకుడు చెప్పిన చరిత్ర పుస్తకం : తొలి తెలుగు శాసనం రచన : డా. వేంపల్లి గంగాధర్ విషయం : తెలుగు భాష ప్రాచీనతను తెలియచేసే శాసనం కాబట్టి ఒక కథా రచయితను ఈ అంశం ఆకర్షించి ఉంటుందని ఈ పుస్తకం చూడగానే అనిపిస్తుంది. కానీ పుస్తకం తెరిచిన తరువాత చెప్పదలుచుకున్న ప్రతి అంశం మనకి కూడా ఆసక్తి కలిగిస్తుంది. డాక్టర్ వేంపల్లి గంగాధర్ ఈ చక్కని పుస్తకాన్ని అందించారు. రేనాటి చోళులు కడప జిల్లా కలమళ్ల గ్రామంలోని చెన్నకేశవాలయంలో వేయించిన శాసనమిది. చారిత్రకాధారాలను చరిత్రకారుడు పలికించినపుడే చరిత్ర రూపొందుతుందని చెబుతుంది చరిత్ర రచన పద్ధతి. కానీ ఒక కథకుడు చారిత్రకాధారాలను పలకరిస్తే ఆ కథ వేరుగా ఉంటుంది. చరిత్రలో, భాషా చరిత్రలో, సంస్కృతిలో ఈ శాసనం స్థానం గురించి చాలా ఆసక్తిగా రచయిత ఆవిష్కరించారు. ప్రతి రచయిత ఇలాంటి అభిరుచిని పెంచుకుంటే చరిత్ర రచనకు జరిగే ఉపకారం ఎంతో ఉంటుంది. ఈ శాసనం వివరాలు సేకరించడానికి జరిగిన కృషి వివరాలు, చోటు కల్పించిన ఫోటోలు విశిష్టంగా ఉన్నాయి. - కల్హణ రెక్కల్లో గీతాంజలి పుస్తకం : రెక్కల్లో టాగోర్ గీతాంజలి అనుసృజన : డి.హనుమంతరావు విషయం : అక్షరాల్ని అమృత పుష్పాలుగా మార్చిన విశ్వకవి టాగోర్. ‘గీతాంజలి’కి అనువాదాలు అనుసృజనల్ని పద్య, గేయ, వచన కవితా రూపాల్లో ఎందరో కవులు తెలుగులో వెలువరించారు. డి.హనుమంతరావు ‘గీతాంజలి’ని రెక్కల ప్రక్రియలో అనుసృజన చేశారు. నాలుగు లైన్లు ఒక స్టేట్మెంటును, చివరి రెండు లైన్లు వాటికి తగిన తాత్వికతను చెప్పే ప్రక్రియ ఇది. చివరి రెండు లైన్లు ‘రెక్కలు’గా చెప్పుకోవచ్చు. పేజీలు: 102; వెల: 60 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో. ‘ఏదో ఆనందం నాలో తెలియని అలజడి నాలో - నీ సమక్షం ఓ మధుర పరిమళం!’ భగవంతుణ్ని ప్రియునిగా భావించి ఆయన ఎదురుపడ్డప్పుడు ఆనందంతో కూడిన అలజడిని ఎంతో గొప్పగా కవి రెక్కల మూసలో ఒదిగిస్తాడు రచయిత. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి పేజీలు: 104; వెల: 100 ప్రతులకు: కవి, జి-2, పోలీస్ మంగారెడ్డి రెసిడెన్సీ, సూరారం గ్రా., కుత్బుల్లాపూర్ మం., హైదరాబాద్-55. ఫోన్: 8186915342 కొత్త పుస్తకాలు పొడిచే పొద్దు (కథానికలు) రచన: కన్నెగంటి అనసూయ పేజీలు: 152; వెల: 150 ప్రతులకు: రచయిత్రి, విల్లా నం.17ఎ, వెర్టెక్స్ లేక్‌వ్యూ, నిజాంపేట్, హైదరాబాద్-90. ఫోన్: 9246541249 నేలకు దిగిన నక్షత్రం (కథలు) రచన: డా.ఎమ్.సుగుణరావు పేజీలు: 280; వెల: 150 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు కాలుతున్న కట్టెలు (కథలు) రచన: కూతురు రాంరెడ్డి పేజీలు: 188; వెల: 120 ప్రతులకు: రచయిత, ప్లాట్ నం.11, ఇం.నం. 6-67, సుప్రభాత్ వెంచర్-2, కాచవానిసింగారం పోస్టు, ఘట్కేసర్ మం. రంగారెడ్డి జిల్లా-500088. ఫోన్: 9000415353 జ్ఞానసుధ రచన: వి.శ్రీరామరెడ్డి పేజీలు: 120; వెల: 80 ప్రతులకు: రచయిత, మర్రిపల్లి, ఓబుళరెడ్డిపల్లి పోస్టు, వి.ఎన్.పల్లి మండలం, వైఎస్ఆర్ జిల్లా- 516321. ఫోన్: 8008372218 ప్రథమ బాలశిక్ష-2 (ఆరోగ్య సూక్తిసుధ) రచన: భాగవతుల శ్రీనివాసరావు పేజీలు: 144; వెల: 90 ప్రతులకు: భాగవతుల సామ్రాజ్యలక్ష్మి, 23-23-52, శివరావు వీధి, సత్యనారాయణపురం, విజయవాడ-11. ఫోన్: 9618165402 గ్లోబల్ వార్మింగ్ రచన: టి వి సుబ్బయ్య పేజీలు: 134; వెల: 75 ప్రతులకు: దీప్తి బుక్ హౌజ్, మ్యూజియం రోడ్, విజయవాడ-2