breaking news
akbaruddin oyc
-
'జీనియస్‌లు టీఆర్ఎస్లో ఉన్నారేమో.. మేం కాదు'
హైదరాబాద్: ఎంఐఎం శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ సర్కార్ పై సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ లో జీనియస్ లు ఉన్నారేమో.. మేము మాత్రం కాదు' అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఒకే రోజు డిమాండ్లు పెట్టి ఆ రోజే చర్చించాలనడం సరికాదని అన్నారు. డిమాండ్లకు సంబంధించిన సమాచారం ముందుగా ఇచ్చిన తర్వాతే చర్చ చేపట్టాలని అక్బరుద్దీన్ చెప్పారు. -
పారిశుధ్య యంత్రాలను ఇవ్వండి: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు కావాల్సిన పారిశుధ్య యంత్రాలను అందజేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ఎంఐఎం నేత అసదుద్ధీన్ ఒవైసీ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలంతా పాల్గొంటారని చెప్పారు. గురువారం సీఎం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ సమీక్షలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి పాల్గొన్న అసదుద్ధీన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో పారిశుధ్య నిర్వహణకు 100 రిక్షాలు, 100 చెత్త బుట్టలను వెంటనే ఇవ్వాలని సీఎంను కోరామన్నారు. మక్కామసీదు పేలుళ్ల నిందితుల బెయిల్ రద్దు చేయాలి... 2008 మక్కా మసీదు పేలుళ్ల నిందితులు దేవేందర్, లోకేష్ బెయిల్‌ను రద్దు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అసదుద్ధీన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుల బెయిల్‌పై కేంద్రం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కూడా చేయలేదంటూ తప్పుపట్టారు.